killer Egg : మహిళ ప్రాణం తీసిన కోడిగుడ్డు

ఓ కోడిగుడ్డు ఓ మహిళ ప్రాణం తీసింది. తెలంగాణలోని నాగర్ కర్నూలులో జరిగిన ఈ ఘటన స్థానికులను దిగ్ర్భాంతికి గురిచేసింది.

killer Egg : మహిళ ప్రాణం తీసిన కోడిగుడ్డు

Killer Egg

killer Egg.. women dies after eat boiled egg : అదృష్టం బాగా లేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుద్ది అని మన పెద్దలు చెప్పిన సామెత వినే ఉంటారు. అలాగే అదృష్టం బాగుండకపోతే చేతి కర్రే పాము అవుతుంది. ఇవి కేవల సామెతలు కాదు పెద్దలు వారి అనుభవాల్లోంచి చెప్పిన వాస్తవాలు. అటువంటిదే జరిగింది పాపం ఓ మహిళ విషయంలో. ఓ కోడిగుడ్డు ఓ మహిళ ప్రాణం తీసింది. కోడిగుడ్డేంటీ మహిళ ప్రాణం తీయటం ఏంటీ అనే డౌటనుమానం వచ్చే ఉంటుంది. మరి కిల్లర్ కోడిగడ్డు ఘటన ఏంటో చూద్దాం..

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో మంగళవారం (అక్టోబర్ 12,2021) జరిగిన ఈ ఘటన స్థానికులను దిగ్ర్భాంతికి గురిచేసింది. తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లి గ్రామానికి చెందిన నీలమ్మ అనే 50 ఏళ్ల మహిళ భోజనం చేస్తోంది. ఈరోజు కోడిగుడ్డు కూర వండింది నీలమ్మ. భోజనం చేయటానికి అన్నంతో పాటు కూర, కోడిగుడ్డు వేసుకుంది.అలా భోజనం చేసే సమయంలో కోడిగుడ్డు తింటుండగా..ఆ గుడ్డును మొత్తాన్ని ఒకేసారి నోట్లో పెట్టుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ గుడ్డు గుటుక్కుమని నీలమ్మ గొంతులోకి దిగిపోయింది. అదే జారిపోయింది.

Read more : Shocking : తోటలో పనిచేసే కూలీపై పడిన అరటిపండ్లు..4 కోట్ల పరిహారం చెల్లించిన యజమాని..!

అలా గొంతులోకి జారి పోయిన కోడిగుడ్డు ఆమెకు ఊపిరి ఆడకుండా చేసింది. గుడ్డు గొంతులో ఇరుక్కుపోయింది. కిందకు దిగలేదు.పైకి రాలేదు.దీంతో పాపం నీలమ్మ ఊపిరాడక ఆ మహిళ అక్కడిక్కడే పడిపోయింది.అదేంటీ భోజనం చేస్తు అలా పడిపోయిందేంటీ? అని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గబగబా దగ్గరకొచ్చి చూడగా తెరిసిన నోటిలోంచి గొంతులో ఇరుక్కున్న కోడిగుడ్డు కనిపించింది. ఆమె గొంతులోని గుడ్డుని బయటకు తీయడానికి ప్రయత్నించేలోగా మృతి చెందింది. ఈ ఘటనతో స్థానికులు దిగ్ర్భాంతికి గురయ్యారు.

Read more : Car Fire Accident : డాక్టర్ ప్రాణం తీసిన ఎలుకలు ….