Apple 2026 Lineup : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రోతో పాటు 11 కొత్త డివైజ్‌లు రాబోతున్నాయ్!
Apple 2026 Lineup : ఆపిల్ నుంచి ఐఫోన్ 18 ప్రో సహా సరికొత్త ప్రొడక్టులు లాంచ్ కానున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 11 డివైజ్ లు ఉండే అవకాశం ఉంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
Apple 2026 Lineup
- ఐఫోన్ 18 ప్రో, ఐప్యాడ్ 12, కొత్త ఆపిల్ డివైజ్‌లపై బిగ్ అప్డేట్
- ఆపిల్ కొత్త ప్రొడక్ట్ ప్లాన్ 11 డివైజ్‌లు లాంచ్ అయ్యే అవకాశం
- టెక్ వరల్డ్‌లో సంచలనం.. ఆపిల్ నుంచి ఒకేసారి 11 కొత్త డివైజ్‌లు!
Apple 2026 Lineup : ఆపిల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. అతి త్వరలో ఆపిల్ నుంచి సరికొత్త ఐఫోన్లు రాబోతున్నాయి. మొత్తం కంపెనీ నుంచి 11 ఆపిల్ డివైజ్‌లు లాంచ్ కానున్నాయి. ఇప్పటికే ఆపిల్ ప్రొడక్టులపై అనేక రుమర్లు వినిపిస్తున్నాయి. అదేగానీ నిజమైతే నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్ 18 ప్రో లైనప్ మరికొద్ది నెలల్లో గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
ఇందులో ఐఫోన్ సహా ఇతర డివైజ్‌లైన కొత్త ఐప్యాడ్స్, మ్యాక్ సిస్టమ్స్, వేరబుల్, స్మార్ట్ హోం ప్రొడక్టులు ఉండనున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే కొన్ని ఆపిల్ ప్రొడక్టులను కంపెనీ ప్రవేశపెట్టింది.
రాబోయే నెలలో మరో 11 ఆపిల్ డివైజ్ లను కూడా రిలీజ్ చేసేందుకు ఆపిల్ రెడీ అవుతున్నట్టు లీకులు చెబుతున్నాయి. ఆపిల్ ఎకోసిస్టమ్ నుంచి వచ్చే మూడు నెలల్లో అంటే.. సెప్టెంబర్ నుంచి ఆపిల్ కొత్త ప్రొడక్టులను లాంచ్ చేసే అవకాశం ఉంది.
ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ :
ఆపిల్ ప్రొడక్టుల్లో ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా డిజైన్, కెమెరా టెక్నాలజీ అప్ గ్రేడ్లతో రానున్నాయి. ఫేస్ ఐడీ కంపోనెంట్స్ ఈసారి ఫోన్ కింది భాగం డిస్ ప్లేలో ఉండే అవకాశం ఉంది. అదేగానీ నిజమైతే.. ప్రస్తుత డైనమిక్ ఐలాండ్ డిజైన్ చిన్నది కావొచ్చు లేదంటే పూర్తిగా కనిపించకపోవచ్చు.
ఫ్రంట్ కెమెరా మాత్రం స్మాల్ పంచ్ హోల్ కటౌట్ వద్ద ఉండొచ్చు. కెమెరా సిస్టమ్ విషయానికి వస్తే.. ఈసారి కెమెరా లెన్స్ అత్యంత ఆకర్షణీయంగా ఉండనున్నాయి. లో లైటింగ్ ఫొటోగ్రఫీ కోసం కొత్త ఇమేజ్ సెన్సార్ కూడా తీసుకురానుంది.
ఆపిల్ నెక్ట్స్ జనరేషన్ ఎ20 ప్రో చిప్ కూడా అందించనుంది. ఈ ప్రాసెసర్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఏఐ ఫీచర్లకు ఇది అద్భుతంగా ఉంటుంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడల్ కూడా భారీ బ్యాటరీతో రానుంది.
ఇతర 9 ఆపిల్ డివైజ్‌లివే :
ఐఫోన్ 18 ప్రో లైనప్ తర్వాత ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ కూడా తీసుకురానుంది. మల్టీ టాస్కింగ్ కోసం అతిపెద్ద ఇన్నర్ డిస్ ప్లేతో ఈ ఐఫోన్ వచ్చే అవకాశం ఉంది. ఐప్యాడ్ లైనప్ విషయానికి వస్తే.. కొత్త ఐప్యాడ్ 12 మోడల్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో రానుంది.
నెక్స్ట్ జనరేషన్ ఐప్యాడ్ మినీ కూడా ఓఎల్ఈడీ డిస్ ప్లేతో రానుంది. ఆపిల్ మ్యాక్ పరంగా చూస్తే.. మ్యాక్ స్టూడియో, మ్యాక్ మినీ, ఐమ్యాక్ వంటివి నెక్స్ట్ జనరేషన్ M5 చిప్స్ టెక్నాలజీతో రావొచ్చు. మ్యాక్ బుక్ ప్రో కూడా ఓఎల్‌డీ డిస్ ప్లేతో రానుంది.
వేరబుల్ డివైజ్ పరంగా పరిశీలిస్తే.. ఆపిల్ వాచ్ సిరీస్ 12, ఆపిల్ వాచ్ అల్ట్రాలో కూడా హెల్త్ ట్రాకింగ్, ఫిట్ నెస్ కోసం కొత్త ఫీచర్లు, హార్ట్ వేర్ అప్ గ్రేడ్స్ ఉండనున్నాయి. హోం ప్రొడక్టుల్లో సెంట్రల్ కంట్రోల్ డివైజ్ స్మార్ట్ హోం హబ్ కూడా ఉండనున్నాయి.
ఆపిల్ టీవీ, హోం ప్యాడ్ కూడా కొత్త వెర్షన్లతో రావొచ్చు. పర్సనలైజడ్ వెర్షన్ సిరితో ఈ ప్రొడక్టులు లాంచ్ కానున్నాయి. ప్రస్తుతానికి ఆపిల్ రాబోయే 11 డివైజ్ లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
