BharatPe Flex: భారత్‌పే అదిరిపోయే ఫీచర్.. అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్
భారత్‌పే ఫ్లెక్స్(BharatPe Flex) పేరిట 'క్రెడిట్-ఆన్-యూపీఐ' సేవలను ప్రారంభించిన భారత్‌పే.
BharatPe Launches BharatPe Flex Services
- ఖాతాలో డబ్బు లేకున్నా యూపీఐ పేమెంట్స్
- నలభై ఐదు రోజుల ఉచిత గడువు
- భారత్‌పే తెచ్చిన క్రేజీ క్రెడిట్ సదుపాయం
BharatPe Flex: మన దైనందిన అవసరాలకు క్రెడిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే కొన్నిచోట్ల కేవలం యూపీఐ (UPI) చెల్లింపులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులను తొలగించడానికి ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ‘భారత్‌పే’ ఒక సరికొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. యెస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ‘భారత్‌పే ఫ్లెక్స్’ (BharatPe Flex) పేరిట ‘క్రెడిట్-ఆన్-యూపీఐ’ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా బ్యాంక్ ఖాతాలో డబ్బు లేకపోయినా క్రెడిట్ కార్డు తరహాలోనే సులభంగా డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
Ap Rajya Sabha: ఏపీ రాజ్యసభ సీట్ల సర్దుబాటు పూర్తి.. తెదేపాకు 3, జనసేనకు ఒక స్థానం కేటాయింపు
ఈ సదుపాయం ద్వారా వాడుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి వినియోగదారులకు 45 రోజుల వరకు గడువు లభిస్తుంది. ఈ నిర్ణీత గడువులోపు డబ్బులు చెల్లిస్తే ఎలాంటి వడ్డీ కట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ గడువు ముగిసే సమయానికి పూర్తి బిల్లు చెల్లించలేని వారు, ఆ మొత్తాన్ని 3 నుండి 12 నెలల సులభ వాయిదాల రూపంలోకి మార్చుకునే వీలుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, ఆన్లైన్ షాపింగ్, మొబైల్ రీఛార్జ్ మరియు బిల్లుల చెల్లింపులకు ఈ పరిమితిని వాడుకోవచ్చు.
ఈ సేవలను పొందడానికి వినియోగదారులు భారత్‌పే యాప్‌లో ‘పే లేటర్’ ఆప్షన్‌ను ఎంచుకుని, యెస్ బ్యాంక్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఆ తర్వాత లభించిన క్రెడిట్ పరిమితిని యూపీఐకి లింక్ చేసి, పిన్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ యాప్ ద్వారా చేసే ప్రతి లావాదేవీపై ‘జిలియన్ కాయిన్స్’ రూపంలో లభించే రివార్డులను వోచర్లు కొనడానికి లేదా తదుపరి బిల్లుల చెల్లింపుల తగ్గింపు కోసం తిరిగి వినియోగించుకోవచ్చు.
