Ram Charan : ‘పెద్ది’ సూపర్ హిట్.. కానీ చరణ్ ఎక్కడ..? చెప్పినట్టే..
Ram Charan
Ram Charan
Ram Charan : రామ్ చరణ్ పెద్ది సినిమా సూపర్ హిట్ అయింది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కి ఫిదా అవుతున్నారు ప్రేక్షకులు. సెకండ్ హాఫ్, క్లైమాక్స్ లో అయితే చరణ్ పర్ఫార్మెన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయితే సినిమా రిలీజ్ ముందు వరకు ప్రమోషన్స్ లో హడావిడి చేసిన చరణ్ సినిమా రిలీజ్ ముందు రోజు నుంచి ఎక్కడా కనిపించట్లేదు.
రామ్ చరణ్ కి పెద్ది సినిమాలో కుస్తీ పోటీలకు సంబంధించిన షూటింగ్ చేస్తుండగా పలు గాయాలు అయ్యాయి. ముఖ్యంగా మణికట్టుకి పెద్ద గాయం అయింది. మణికట్టు లోపల చాలా ఎఫెక్ట్ అయింది. అప్పటికి ఫిజియో చేయించుకొని షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే తర్వాత దానికి ఆపరేషన్ అవసరమని చెప్పారు. పెద్ది ప్రమోషన్స్ సమయంలో చరణ్ తన చేతికి మణికట్టు వద్ద ఒక మెడికల్ బ్యాండ్ వేసుకొనే కనిపించారు.
Also Read : Buchibabu Sana : బుచ్చిబాబుది ఎంత మంచి మనసో.. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో..
చరణ్ కూడా ఈ గాయం గురించి చెప్పి పెద్ది ప్రమోషన్స్ అయ్యాక, సినిమా రిలీజ్ అయ్యాక ఆపరేషన్ చేయించుకుంటాను. ఇప్పుడు చేయించుకుంటే రెస్ట్ తీసుకోవాలి. ప్రమోషన్స్ ఆగకూడదు అని తెలిపారు. పెద్ది సినిమా కోసం చరణ్ ఎంత కష్టపడ్డాడో అందరికి తెలుసు. ప్రమోషన్స్ కోసం తన ఆపరేషన్ ని కూడా వాయిదా వేసుకోవడంతో అంతా అభినందించారు.
సినిమా రిలీజ్ ముందు రోజు నుంచే చరణ్ ఎక్కడా కనిపించలేదు. మూవీ యూనిట్, చరణ్ భార్య ఉపాసన సైతం థియేటర్స్ లో సినిమా చూసారు కానీ చరణ్ కనపడలేదు. నేడు జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్ లో కూడా చరణ్ కనిపించలేదు. దీంతో చరణ్ ముందే చెప్పినట్టే సినిమా రిలీజ్ అయ్యాక మణికట్టుకు ఆపరేషన్ చేయించుకోడానికి వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. చరణ్ సన్నిహితుల సమాచారం ప్రకారం అపోలో హాస్పిటల్ లో చరణ్ కి మణికట్టు ఆపరేషన్ చేసారని, చరణ్ రెస్ట్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. దీంతో అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. చరణ్ ప్రస్తుతం ఆపరేషన్ చేయించుకున్నాడు కాబట్టి కోలుకున్నాక ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహిస్తారని సమాచారం.
Also Read : Janhvi Kapoor : ‘పెద్ది’లో జాన్వీ కపూర్ కి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా..?
