Shocking : తోటలో పనిచేసే కూలీపై పడిన అరటిపండ్లు..4 కోట్ల పరిహారం చెల్లించిన యజమాని..!

తోటలో పనిచేసే కూలీపై పడిన అరటిపండ్లు పడటంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో యజమాని రూ.4 కోట్ల పరిహారం చెల్లించాల్సివచ్చింది.

Shocking : తోటలో పనిచేసే కూలీపై పడిన అరటిపండ్లు..4 కోట్ల పరిహారం చెల్లించిన యజమాని..!

Bananas ‘humper’ Falling On The Head..injured Worker (1)

Bananas ‘humper’ falling on the head..injured worker: తన తోటలో కాసిన అరటిపండే ఆ యజమానికి చుక్కలు చూపించాయి. తోటలో అరటి పండ్ల వల్ల తోట యజమాని నాలుగు కోట్ల రూపాయలు నష్టంవాటిల్లింది. అరటి పండు తింటే పన్ను విరిగింది అన్నట్లుగా పాపం తోట యజమానికి జేబుకు చిల్లే కాదు బ్యాంకు ఎకౌంట్ కూడా చిల్లు పడింది.అసలు విషయం ఏమిటంటే..

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లోని కుక్ టఃన్ సమీపంలోని ఎల్ అండ్ ఆర్ కాలిన్స్‌కు చెందిన అరటి తోటలో జైర్ లాంగ్‌బాటమ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. కాపుకు వచ్చిన చెట్లనుంచి అరటి పండ్ల గెలలను నరుకుతున్నారు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు అరిటి పండ్ల గెలతో పాటు అరటి చెట్టుకూడా అతనిపై పడింది. దాంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆ దెబ్బతీవ్రంగా తగలటంతో లాంగ్ బాటమ్ పాపం వికలాంగుడైపోయాడు. దీంతో అతను పనిచేయలేకపోయేవాడు. ఉపాధి కోల్పోయాడు. దీంతో బాధితుడు 502,740 డాలర్ల పరిహారం కోరుతూ అరటితోట యజమానిపై కోర్టులో పిటీషన్ వేశాడు. ఇది 2016లో జరిగింది.

Read more :Kerala Couple World Tour: చిన్న టీ కొట్టుతో జీవనం..ప్రపంచయాత్ర చేస్తున్న వృద్ధ దంపతులు..ఈసారి ఏదేశమంటే..

ఈ పిటీషన్ పై కోర్టు విచారణ ఇప్పటి వరకు కొసాగింది. తాజాగా మరోసారి ఈ కేసుపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా కోర్టు చీఫ్ జస్టిస్ కేథరీన్ హోమ్స్.. పలు కీలక వ్యాఖ్యలు చేస్తు..అరటి పండ్ల గెల మీద పడటం కారణంగా వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.ఆ ఘటన వల్లలనే అతను జీవితాంతం ఉపాధిని కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి ఆ కూలీకి యజమాని 502,740 డాలర్ల పరిహారాన్ని అంటే భారత కరెన్సీలో 3,77,15,630 రూపాయలను చెల్లించాలని అరటి తోట యజమానిని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా యాజమాన్యం చాలా అజాగ్రత్తగా వ్యవహరించిందని కోర్టు మందలించింది.

Read more :1765 Antarctic Air : 1765 నాటి ‘గాలితో శిల్పం’..త్వరలో ‘పోలార్‌ జీరో ఎగ్జిబిషన్‌’లో ప్రదర్శన

దీంతో సదరు యజమాని కూలీకి నష్టపరిహారంకట్టాల్సి వచ్చింది. అలా అతని తోటలో కాసిన అరటిపండ్లే అతడికి చుక్కలు చూపించినట్లు అయ్యింది. యజమాని కూడా తాను కావాలనే చేయలేదని కాబట్టి నష్టపరిహారం కాస్త తగ్గించాలని కోర్టును కోరాడు. కానీ అతని ఉపాధే కోల్పోయాడు కాబట్టి మొత్తం కట్టాలని కోర్టు స్పష్టంచేసింది. అలా కూలీ వాదనలే నిలవడంతో.. కోర్టు అరటితోట యజమానికి సుమారు నాలుగు కోట్ల జరిమానా విధించింది. ఈ వార్త విని జనాలు షాక్ అవుతున్నారు.