Kerala Couple World Tour: చిన్న టీ కొట్టుతో జీవనం..ప్రపంచయాత్ర చేస్తున్న వృద్ధ దంపతులు..ఈసారి ఏదేశమంటే..

చిన్న టీ కొట్టుతో జీవనం సాగించే వృద్ధ దంపతులు ప్రపంచ యాత్ర చేస్తున్నారు. ఇప్పటికే దేశాలు చుట్టి వచ్చారు. ఇప్పుడు 26 దేశ యాత్రకు బయలుదేరుతున్నారు.

Kerala Couple World Tour: చిన్న టీ కొట్టుతో జీవనం..ప్రపంచయాత్ర చేస్తున్న వృద్ధ దంపతులు..ఈసారి ఏదేశమంటే..

Kerala Couple World Tour: అనుకున్నది సాధించాలన్నా..కోరికలు నెరవేర్చుకోవాలన్నా పట్టుదల చాలా ముఖ్యం. పేదా గొప్పా అనే తేడా ఉండదు. అలా ప్రపంచ దేశాన్నిచూడాలని..అక్కడి వింతలు, విశేషాలు, అద్భుతాలు చూడాలని ఆశపడిన ఓ వృద్ధ జంట తమ కోరిన నెరవేర్చుకునే తీరు నిజంగా ఆశ్చర్యమనిపిస్తుంది. కేవలం చిన్న టీకొట్టు మీద వచ్చే ఆదాయంతో జీవించే ఆ దంపతులు ఇప్పటికే పలు దేశాలు చుట్టి వచ్చారు. కోవిడ్ వల్ల ఆగినవారి ప్రపంచ యాత్రను మరోసారి ప్రారంభించనున్నారు. ఈ ప్రపంచ యాత్రలకు వారు వారి టీ కొట్టు మీద వచ్చే ఆదాయంతో మొదలుపెట్టారు. అలా ఇప్పటికే 25 దేశాలు చుట్టి వచ్చారు. ఇప్పుడు తాజాగా 26 దేశంగా రష్యా దేశాన్ని చుట్టి రావటానికి అక్టోబర్‌ 21న బయలుదేరనున్నారు కేరళకు చెందిన 71 ఏళ్ల కె.ఆర్‌. విజయన్‌, ఆయన సతీమణి 69 ఏళ్ల మోహన .

Read more : Zara Rutherford:లోకాన్నిచుట్టేస్తా..19 ఏళ్ల అమ్మాయి విమానంలో ఒంటరిగా ప్రపంచయాత్ర

కేరళకు చెందిన విజయన్, మోహన ఓ చిన్న టీ కొట్టు నడుపుతుంటారు. దాని మీద వచ్చే ఆదాయంతోనే జీవిస్తుంటారు. వెలుగు వచ్చేసరికి ఇద్దరు టీ కొట్టులో ఘుమఘుమలాడే టీనిసిద్ధం చేస్తారు. ఆ చిన్నపాటి ఆదాయంతోనే జీవిస్తుంటారు. వారికి ప్రపంచమంతా తిరిగి రావాలనే వారి కోరిక. కానీ అంత డబ్బులు లేవు. కానీ వెళ్లాలనే ఆకాంక్ష ఉంది. దీంతో తమకు టీకొట్టుమీద వచ్చే ఆదాయంలో రోజుకు రూ.300లను పొదుపు చేసుకుంటువచ్చారు.అలా దాచుకున్న డబ్బులతో వారు 2007లో మొదటిసారి ఇజ్రాయెల్ దేశం వెళ్లి వచ్చారు. అలా ఓ దేశం వెళ్లి రావటం తరువాత మళ్లీ టీకొట్టు నడుపుకోవటం..రూపాయి రూపాయి కూడబెట్టుకుని మరో దేశం వెళ్లి రావటం సాగిస్తున్నారు. అప్పటి నుండి, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, UAE,US వంటి 25 ఇతర దేశాలను చుట్టి వచ్చారు. వారు 26 వ దేశంగా రష్యాకు వెళ్లాలని కూడా యోచిస్తున్నారు.

ఈ క్రమంలో ఆ వృద్ధ జంట స్ఫూర్తిదాయక యాత్ర గురించిన వార్తలు రావడంతో వీరి ఒక పర్యటనలకు సహాయం చేసేందుకు..ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్ర గ్రూప్‌ ఛైర్మన్ అనంద్‌ మహింద్రా 2019లో ముందుకొచ్చి స్పాన్సర్‌ చేసారు.2019లో విజయన్‌, మోహన్‌ దంపతులు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వెళ్లివచ్చారు. అదే వారు చేపట్టిన చివరి విదేశీ పర్యటన. ఆ తర్వాత కరోనా మహమ్మారి ప్రపంచమంతా వ్యాపించడంతో వారి యాత్రలకు బ్రేక్ విదేశీ పర్యటనల కోసం ఈ జంట తమ ఆదాయం నుంచి ప్రతీ రోజు రూ.300 దాచిపెట్టేవారు. పర్యటనల కోసం వీరు అప్పులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఆ అప్పులు తీర్చేవారు.

ఇప్పుడు కొవిడ్‌ సంక్షోభం నుంచి ప్రపంచం క్రమంగా బయటకు వస్తుండటంతో ఈ జంట మరోసారి విదేశీ యాత్రకు సిద్ధమవుతోంది. ఈ సారీ వీరు రష్యా వెళ్లటానికి సిద్ధమవుతున్నారు. అక్టోబర్‌ 21న ప్రారంభమయ్యే వీరి యాత్ర అక్టోబర్‌ 28కు తిరిగి రావాలని ప్లాన్ వేసుకున్నారు. ఈ 26వ దేశ పర్యటనలో వీరి వెంట వీళ్ల మనవలు కూడా వెళ్తున్నారట.ఈ పర్యటనలో వారు కుదిరితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను కలవాలనుకుంటున్నారు.వీరికి పెద్దగా ఇంగ్లిష్‌ మాట్లాడటం రాదు. దీంతో వారు ట్రావెల్‌ ఎజెన్సీల సాయం తీసుకొని ప్రయాణాలు ఖరారు చేస్తుంటారు.

Read more : Viral Video: మటన్ కర్రీ చేస్తున్న భార్య..రొమాంటిక్ భర్త కొంటె పని

తమ విదేశీ పర్యటల గురించి విజయన్ మాట్లాడుతు..తన చిన్నప్పుడు నా తండ్రి భారతదేశంలోని అన్ని ఆలయాలు సందర్శనకు తనకు తీసుకెళ్లాలని అలా దేశాన్ని చేశానని కానీ నా భార్యతో కలిసి ప్రపంచ యాత్ర చేయాలనే ఆశతో ఇలా దేశాలు చుట్టి వస్తున్నామని తెలిపారు. అలా తమ ఆశ నెరవేర్చుకోవటానికి కష్టపడి సంపాదించిన డబ్బుల్ని రూపాయి రూపాయి ఆదా చేసుకుంటున్నామని తెలిపారు. యుక్తవయస్సులో కుటుంబ బాధ్యతల కారణంగా ఆయన కోరిక కోరికగానే మిగిలిపోయింది. కానీ ఇప్పటికైనా తమ ఆశ నెరవేర్చుకోవటానికి ఇలా ప్లాన్ చేసుకున్నామని తెలిపారు.

కాగా విజయన్, మోహన దంపతులు 27 ఏళ్ల క్రితం శ్రీ బాలాజీ కాఫీ హౌజ్‌ పేరుతో చిన్న కాఫీ దుకాణం ప్రారంభించారు. అప్పటినుంచి అదే జీవనోపాధిగా జీవిస్తున్నారు. కుటుంబాన్ని ఆ షాపు మీదనుంచి వచ్చే ఆదాయంతోనే పోషించారు. ఇప్పుడు వారి ప్రపంచ యాత్రను కూడా అదే కాఫీ షాపుపై వచ్చే ఆదాయంతోనే నెరవేర్చుకుంటున్నారు.

అక్టోబర్‌ 21న వీరి రష్యా యాత్ర ప్రారంభంకానుంది. తిరిగి అక్టోబర్‌ 28 తిరిగిరానున్నారు.వీళ్ల కాఫీ షాపులో ఓ గ్లోబు ఉంటుంది. ఆ గ్లోబుమీద ఉన్న దేశాలన్నీ చూడాలని ఈ వృద్ధ జంట లక్ష్యమట. చూశారా..సంకల్పం గట్టిగా ఉంటే ఏదీ ఆపలేదనే విషయాన్ని వీరు ఎలా నిరూపించారో..ఈ పర్యటనలో వీరి వెంట వీళ్ల మనవలు కూడా వెళ్తుండటం మరో విశేషం. మరి ఆ వృద్ధ జంటకు చెప్పేయండి..విష్ యూ హ్యాపీ జర్నీ!