Zara Rutherford:లోకాన్నిచుట్టేస్తా..19 ఏళ్ల అమ్మాయి విమానంలో ఒంటరిగా ప్రపంచయాత్ర

బెల్జియన్‌-బ్రిటిష్‌ సంతతికి చెందిన జారా రూథర్‌ఫోర్డ్‌ అనే 19ఏళ్ల బెల్జియం యువతి ఒంటరిగా విమానంలో ప్రపంచ యాత్రకు బయలుదేరింది.

Zara Rutherford:లోకాన్నిచుట్టేస్తా..19 ఏళ్ల అమ్మాయి విమానంలో ఒంటరిగా ప్రపంచయాత్ర

Zara Rutherford  Solo  World Tour On Plane 

Zara Rutherford  solo  world tour On plane  : అమ్మాయి ఒంటరిగా బయటకు వెళ్లటానికి అనుమతించరు తల్లిదండ్రులు. అటువంటిది ఓ 19 ఏళ్ల అమ్మాయి ఏకంగా విమానంలో ప్రపంచ యాత్ర చేపట్టింది. అదికూడా ఒంటరిగా. ఆ విమానంలో ఒకే ఒక్క సీటు ఉంటుంది. ఆ సీటులో తాను ఒక్కతే..లోకాన్ని చుట్టేయటానికి రెడీ అయిపోయింది. ఈ యాత్ర పూర్తి చేస్తే ఆ అమ్మాయి అత్యంత చిన్న వయసులోనే ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేసిన యువతిగా ప్రపంచ రికార్డు క్రియేట్ చేస్తుంది. బెల్జియన్‌-బ్రిటిష్‌ సంతతికి చెందిన జారా రూథర్‌ఫోర్డ్‌ అనే 19ఏళ్ల బెల్జియం యువతి ఒంటరిగా విమానంలో ప్రపంచ యాత్రకు బుధవారం (ఆగస్టు 18,2021) బయలుదేరింది.

5

అసలే వర్షాకాలం విమాన యాత్రకు ప్రతికూల వాతావరణం కలిగే సీజన్. అయిన ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ప్రయాణాన్ని ఆపేది లేదంటోందీ సాహస యువతి. బెల్జియం కొర్ట్రిజ్క్‌లోని వేవెల్గమ్ విమానాశ్రయం నుంచి జారా రూథర్‌ఫోర్డ్‌ బయలుదేరింది. ఈ సాహసయాత్రం మూడు నెలల పాటు కొనసాగించనుంది. ఈ యాత్రలో ఐదు ఖండాలు, 52 దేశాల మీదుగా యాత్రను కొనసాగించనుంది. జారా యాత్రకు తల్లిదండ్రులు కూడా ఏమాత్రం వెనుకాడలేదు.ఒంటరి అమ్మాయి ఏకంగా ప్రపంచ యాత్ర అంటే ఎవకరైనా ఆలోచిస్తారు.అస్సలు ఒప్పుకోరు. కానీ జారా తల్లిదండ్రులు మాత్రం దగ్గరుండి మరీ కూతురిని సెండాఫ్ ఇచ్చారు. విజయవంతంగా యాత్ర పూర్తి చేసుకుని రా బిడ్డా అంటూ.తన యాత్ర కోసం జారా షార్క్‌ స్పోర్ట్‌ మోడల్‌ విమానాన్ని ప్రత్యేకంగా అన్ని రకాలుగా రెడీ చేసుకుంది.

1

చిన్న వయసులోనే ఒంటిరిగా ప్రపంచాన్ని చుట్టేసిన మహిళగా అమెరికాకు చెందిన షాయెస్టా వయిజ్‌ పేరిట ఇప్పటికే రికార్డు ఉంది. ఆమె 30 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం ఆమె రికార్డను బ్రేక్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేయాలని జారీ లక్ష్యంగా పెట్టుకుని ఈ యాత్ర ప్రారంభించింది. తన యాత్ర ప్రపంచంలోని మరింత మంది మహిళలకు స్ఫూర్తి అవుతుందని జారా భావిస్తోంది. ముఖ్యంగా స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్), ఏవియేషన్ రంగాలపై ఆసక్తి పెంచుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసింది.

Belgium Aviation Record

ఈ యాత్ర సందర్భంగా జారా మాట్లాడుతు..నాకు చిన్నప్పటినుంచి ఏవియేషన్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌ను అంటే చాలా ఇష్టం. ఈ రంగంలో అమ్మాయిల్ని ప్రోత్సహించాలని భావిస్తున్నాను’ అని తెలిపింది. గ్రీన్‌లాండ్, చైనా, నికరగువా సహా మొత్తం ఐదు ఖండాల్లో 52 దేశాల్లో పర్యటించాలనే లక్ష్యంగా బయలుదేరానని తెలిపింది. ఈ యాత్రలు ఆయా ప్రాంతాల ప్రజలను కలుసుకుంటానని వారి జీవన విధానాల గురించి పరిశీలిస్తానని ఈ యాత్ర నా లైఫ్ లో చాలా ముఖ్యమైనది తెలిపింది.

6

జారా తల్లిదండ్రులు ఇద్దరూ పైలట్లే. దీంతో జారాకు చక్కటి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఈ యాత్రకు ఆమెను సగర్వంగా ధైర్యంగా పంపించారు. జారా భవిష్యత్తులో ఆస్ట్రోనాట్‌ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతరిక్షంలోకి వెళ్లడం ఎంతో సాహసంగా భావిస్తానని జారా రూథర్‌ఫర్డ్ తెలిపింది. కాగా..మాసన్ ఆండ్రూస్ అనే యువకుడు 18 వయసులోనే ఒంటరిగా విమానంలో ప్రపంచాన్ని చుట్టివచ్చి అత్యంత పిన్నవయసులోనే ఈ ఘనత సాధించిన వ్యక్తిగా నిలిచారు. ఇప్పుడు జారీ ఈ యాత్ర పూర్తి చేస్తే యువతుల్లో ఇటువంటి యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన రికార్డు క్రియేట్ చేయనుంది.