Norway : బాణాలతో దాడి.. ఐదుగురు మృతి ఇద్దరి పరిస్థితి విషమం

:ఆగ్నేయ నార్వేలో ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. బాణాలతో ప్రజలపై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Norway : బాణాలతో దాడి.. ఐదుగురు మృతి ఇద్దరి పరిస్థితి విషమం

Norway

Norway :  ఆగ్నేయ నార్వేలో ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. బాణాలతో ప్రజలపై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాంగ్‌స్‌బర్గ్ పట్టణ ఈ దాడి జరిగింది. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ఉగ్రవాద కుట్రగా అనుమానిస్తున్నారు పోలీసులు. గాయపడిన ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గాయపడిన వారిలో ఓ పోలీస్ అధికారి ఉన్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ దాడిలో ఒక్కరే పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.

చదవండి : Jammu Kashmir: ఎన్‌కౌంటర్లతో అట్టుడుకుతున్న కశ్మీర్

నిందితుడు 37ఏళ్ల డానిష్ పౌరుడనీ పోలీసులు తెలిపారు. గత కొంత కాలంగా ఇతను కాంగ్‌స్‌బర్గ్‌‌లో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ప్రత్యేక్ష సాక్షిగా ఉన్న మహిళ అక్కడి మీడియాతో మాట్లాడింది. వీపు భాగంలో బాణాలు పెట్టుకొని చేతులో విల్లుపట్టుకున్న వ్యక్తి విచక్షణ రహితంగా బాణాలు విసిరాడని.. దీంతో అక్కడ ఉన్నవారు ప్రాణభయంతో పరుగులు తీశారని తెలిపారు.

చదవండి : Jammu and Kashmir : జమ్మూకశ్మీర్‌..30 గంటల వ్యవధిలో 5 ఎన్‌కౌంటర్లు

రాజధాని ఓస్లోకు పశ్చిమాన 80 కిలోమీటర్లు (50 మైళ్ళు) చుట్టూ 25,000 మంది ప్రజలున్న పట్టణంలో బుధవారం సాయంత్రం 6:13 గంటలకు దాడి జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సాయంత్రం 6:47 గంటలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సాధారణ సమయంలో నార్వే అధికారులు ఆయుధాలను కలిగి ఉండరు. ఈ దాడి తర్వాత ప్రతి ఒక్క పోలీస్ అధికారి ఆయుధాలు తమతో పెట్టుకోవాలని సూచించారు.