Dead Body : ఘోరం.. యువతిని వివస్త్రను చేసి, జననాంగాన్ని కాల్చేసి..

ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ యువతిని అతి కిరాతకంగా చంపేశారు. ఆమె జననాంగాన్ని కాల్చేశారు. సౌత్ వెస్ట్ ఢిల్లీ ద్వారకాలోని డాబ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ నాలాలో

Dead Body : ఘోరం.. యువతిని వివస్త్రను చేసి, జననాంగాన్ని కాల్చేసి..

Dead Body

Dead Body : ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ యువతిని అతి కిరాతకంగా చంపేశారు. ఆమె జననాంగాన్ని కూడా కాల్చేశారు. సౌత్ వెస్ట్ ఢిల్లీ ద్వారకాలోని డాబ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ నాలాలో పోలీసులు యువతి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం ఉన్న తీరు చూసి షాక్ తిన్నారు. ఆమె వివస్త్రగా ఉంది. అంతేకాదు ఆమెను గుర్తుపట్టకుండా ఉండేందుకు, వివరాలు తెలియకుండా ఉండేందుకు ఆమె ముఖాన్ని కాల్చివేశారు.

అలాగే ఆమె జననాంగాన్ని కూడా కాల్చేశారు. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు మృతురాలి వివరాలు కనిపెట్టే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా మిస్సింగ్ కేసుల వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు కోసం వేచి చూస్తున్నారు. రేప్ జరిగిందా? ఆమె ఎలా చనిపోయింది? అనేది పోస్టుమార్టం నివేదికలో తెలియనుంది.

Eyes : నిద్రలేవగానే రెండు అరచేతులు రుద్ది కళ్ళకు అద్దుకుంటే ఏమౌతుంది?

డాబ్రీ సెక్టార్ 2లోని సీఎన్జీ ఫ్యూయల్ పంప్ దగ్గర ఓ నాలా ఉంది. అందులో యువతి మృతదేహం ఉంది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి డెడ్ బాడీని గుర్తించి తమ సమాచారం ఇచ్చాడని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సీనియర్ పోలీస్ అధికారులు స్పాట్ కి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పచ్చరంగులో ఉన్న బెడ్ షీట్ లాంటి వస్త్రంలో చుట్టి ఉంచారు. సాధారణంగా అలాంటి వస్త్రాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వినియోగిస్తారు. ఆమె నుదుటిపైన, ప్రైవేట్ భాగాల్లో కాలిన గుర్తులు ఉన్నాయి. చూస్తుంటే, ఆమెపై దాడి చేసి చంపేశారని పోలీసులు భావిస్తున్నారు. వేరే ప్రాంతంలో ఆమెను హత్య చేసి డెడ్ బాడీని ఇక్కడ డంప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Snoring : గురకతో ఎముకలకు ముప్పే…

దీనిపై ద్వారకా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శంకర్ చౌదరి స్పందించారు. మహిళను గుర్తించే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు. మిస్సింగ్ వ్యక్తుల రికార్డులు చెక్ చేస్తున్నట్టు చెప్పారు. అదే వయసు మహిళలు ఎవరైనా మిస్సింగ్ అయ్యారా అనే వివరాలు తెలుసుకుంటున్నారు. అలాగే ప్రత్యేక పోలీసు బృందాలు స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా మహిళ మిస్సింగ్ అయిందా అని తెలుసుకుంటున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబ్, క్రైమ్ టీమ్ స్పాట్ కి వచ్చి పరిశీలించారు. అలాగే పోలీసులు సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తున్నారు. త్వరలోనే అనుమానితులను పట్టుకుంటామని చెప్పారు.