Snoring : గురకతో ఎముకలకు ముప్పే…

మహిళలతో పోలిస్తే పురుషుల్లో గురక సమస్య ఎక్కువగా వస్తుంది. వాయు నాళాలు తక్కువ వ్యాకోచంతో ఉంటాయి. మెడ, గొంతు భాగంలో అధిక బరువు పడినా గురకకు దారితీస్తుంది.

Snoring : గురకతో ఎముకలకు ముప్పే…

Snoring

Snoring : నిద్రపోయే సమయలో గురక పెట్టే అలవాటు చాలా మందిలో ఉంటుంది. వీరు గురకపెట్టడం వల్ల చాలా మంది ఇబ్బందులకు గురవుతుంటారు. ఎదుటి వారికి నిద్రపట్టదు. గురకను తేలికగా తీసుకోవద్దు. ఇది ఎముకలనూ దెబ్బతీస్తుంది. నిద్రలో ఉన్నట్టుండి కాసేపు శ్వాస ఆగిపోయే మహిళలకు ఎముకలు విరిగే ముప్పు ఉన్నట్లు పలు పరిశోధనల్లో తేలింది.

నిద్ర సమయంలో గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడితే అప్పుడు గురక వస్తుంది. అలాగే ఈ సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ మార్గంలోనూ అవాంతరాలుంటే అప్పుడు కుచించుకుపోయిన మార్గం నుంచి గాలి వెళ్లాల్సి ఉండడంతో చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదలికకు గురై గురక వస్తుంది. కొన్నిసార్లు శ్వాస ఆడక ఉన్నట్టుండి మెలకువ వస్తుంది.

మహిళలతో పోలిస్తే పురుషుల్లో గురక సమస్య ఎక్కువగా వస్తుంది. వాయు నాళాలు తక్కువ వ్యాకోచంతో ఉంటాయి. మెడ, గొంతు భాగంలో అధిక బరువు పడినా గురకకు దారితీస్తుంది. సైనస్ సమస్యలో ముక్కు నాసికా కుహరములు జామ్ అవుతాయి. దీంతో గాలి కష్టంగా వెళ్లాల్సి వచ్చి శబ్దం బయటకు వస్తుంది. ఇప్పటివరకూ దీంతో గుండెజబ్బు, పక్షవాతం వంటి జబ్బుల ముప్పులు పెరుగుతాయనే భావిస్తుండేవారు. తాజాగా ఎముకల మీదా దీని ప్రభావం పడుతున్నట్టు బయటపడింది. కాబట్టి గురక వస్తుంటే ఎముకల ఆరోగ్యం గురించి డాక్టర్‌తో చర్చించటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.