Viral Video : మనిషేనా? చెల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించి వీడియో తీసిన సోదరుడు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Viral Video : ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకుంటారు. కానీ, వాడు మాత్రం అలా కాదు. ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపించాడు. అంతేకాదు, దాన్ని వీడియో తీసి పైశాచిక ఆనందం పొందాడు.

Viral Video : మనిషేనా? చెల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించి వీడియో తీసిన సోదరుడు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Viral Video(Photo : Google)

Woman Sets Fire : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్ పూర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చెల్లిని సొంత అన్నే ఆత్మహత్యకు ప్రేరేపించాడు. అంతేకాదు ఆమె కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంటుంటే.. అడ్డుకుని కాపాడాల్సింది పోయి వీడియో తీశాడు. పైశాచిక ఆనందం పొందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాధితురాలి పేరు సరోజ్ యాదవ్(31). ఆమె సోదరుడి పేరు సంజీవ్ యాదవ్. వీరి తల్లిదండ్రులు.. ఇంటి పక్కన వారితో గొడవపడ్డారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి సరోజ్ యాదవ్ తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో సరోజ్ యాదవ్ బాగా అప్ సెట్ అయ్యింది. ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది.

Also Read..Boy Dead : చాక్లెట్ దొంగిలించాడని బాలుడిని కొట్టిన మాల్ మేనేజర్.. కాసేపటికే ఊహించని ఘోరం

అయితే, ఆమెను అడ్డుకోవాల్సిన సోదరుడు సంజీవ్ యాదవ్.. తన చెల్లిని ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపించాడు. దాంతో సరోజ్ యాదవ్ తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. అంతే, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి సరోజ్ యాదవ్ విలవిలలాడింది. నొప్పి భరించలేక గట్టిగా కేకలు వేసింది. అయితే, తన సోదరిని కాపాడాల్సింది పోయి.. సంజీవ్ యాదవ్ దారుణానికి ఒడిగట్టాడు. ఆమె ఆర్తనాదాలు చేస్తుంటే.. అతడు అదంతా తన ఫోన్ లో వీడియో తీశాడు.

బాధితురాలు కేకలు విని బయటకు వచ్చిన చుట్టుపక్కల వారు ఆమెను కాపాడారు. మంటలు ఆర్పివేశారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది. తీవ్రమైన కాలిన గాయాలతో ఆమె బాధపడుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

Also Read..Delhi : బైకుల్లో పెట్రోల్ తీసి నిప్పు పెట్టి బైకుల్ని కాల్చేస్తున్న మహిళ .. ఎందుకలా చేస్తోంది?

సరోజ్ యాదవ్ ఇంటి బయటకు వచ్చి తన దుస్తులపై కిరోసిన్ పోసుకుని అగ్గిపుల్ల గీసి తనను తాను అంటించుకోవడం.. ఇదంతా సీసీకెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. చెల్లిని కాపాడాల్సింది పోయి ఆమెను రెచ్చగొట్టి ఆత్మహత్యకు ప్రేరేపించి వీడియో తీసిన వైనం స్థానికంగా సంచలనంగా మారింది. వాడసలు మనిషేనా? సైకోనా? శాడిస్టా? అని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.