Anju-Nasrullah love story : అంజూ-నస్రుల్లా ప్రేమకథలో బిగ్ ట్విస్ట్…అంజూకు పాక్ పౌరసత్వం

భారతీయ మహిళ అంజూ- పాక్ యువకుడు నస్రుల్లా ప్రేమకథలో తాజాగా బిగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. ఇస్లాం మతంలోకి మారి ఫాతిమాగా పేరు పెట్టుకొని పాక్ యువకుడు నస్రుల్లాను ప్రేమ వివాహం చేసుకోవడంతో పాక్ ప్రభుత్వం ఆమెకు పాకిస్థాన్ పౌరసత్వం ఇచ్చారని సమాచారం....

Anju-Nasrullah love story : అంజూ-నస్రుల్లా ప్రేమకథలో బిగ్ ట్విస్ట్…అంజూకు పాక్ పౌరసత్వం

Anju-Nasrullah love story

Anju-Nasrullah love story : భారతీయ మహిళ అంజూ- పాక్ యువకుడు నస్రుల్లా ప్రేమకథలో తాజాగా బిగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని భివాడికి చెందిన అంజూ తన ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ప్రేమికుడు నస్రుల్లాను వివాహం చేసుకుంది. ఇస్లాం మతంలోకి మారి ఫాతిమాగా పేరు పెట్టుకొని పాక్ యువకుడు నస్రుల్లాను ప్రేమ వివాహం చేసుకోవడంతో పాక్ ప్రభుత్వం ఆమెకు పాకిస్థాన్ పౌరసత్వం ఇచ్చారని సమాచారం. (Anju will soon get citizenship of Pakistan) అంజూ నస్రుల్లాను పాక్ కోర్టులో వివాహం చేసుకోవడంతో ఆమెకు పాక్ పౌరసత్వం ఇచ్చారని అంటున్నారు.

Ayodhya: హోటళ్లన్నింటినీ బుక్ చేసుకుంటున్న ట్రావెల్ ఏజెంట్స్.. డిమాండ్ మామూలుగా లేదు

పాక్ మహిళ సీమా హైదర్ (Seema Haider) భారతదేశానికి వచ్చి హిందూ యువకుడిని ప్రేమ వివాహం చేసుకొని బొట్టు పెట్టుకొని పూజలు చేస్తున్న నేపథ్యంలో పాక్ ఐఎస్ఐ కుట్ర పన్ని అంజూను రప్పించి కథ నడిపించిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంజూకు పాక్ ఆ దేశ పౌరసత్వం ఇవ్వగా, సీమా హైదర్ కేసులో ఇంకా తేలలేదు. సీమా కూడా తనకు భారత పౌరసత్వం ఇవ్వాలని విన్నవించింది. పాకిస్థాన్ దేశంలో అంజూ-నస్రుల్లాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Anju and Nasrallah’s love story)

Revanth Reddy Missing Posters : రేవంత్ రెడ్డి మిస్సింగ్ అంటూ హైదరాబాద్ లో పోస్టర్లు

పాక్ యువకుడు నస్రుల్లా మొట్టమొదటి సారి మౌనం వీడారు. ఇస్లాం మతాన్ని స్వీకరించిన అంజూను తాను వివాహం చేసుకున్నానని ప్రకటించారు. మరో వైపు ఫాతిమాగా పేరు మార్చుకున్న అంజూ తిరిగి భారతదేశానికి రానని స్పష్టం చేశారు. భారతదేశానికి వచ్చే అర్హత తనకు లేదని అంజూ అలియాస్ ఫాతిమా చెప్పారు. తాను తిరిగి భారత్ కు వచ్చినా తన బంధువులు, పిల్లలు తనను అంగీకరించరని అంజూ చెప్పారు.