Revanth Reddy Missing Posters : రేవంత్ రెడ్డి మిస్సింగ్ అంటూ హైదరాబాద్ లో పోస్టర్లు

మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలో ఎంపీ రేవంత్ రెడ్డి మిస్సింగ్ అంటూ పోస్టర్లు వెలిశాయి. 2020లో వరదలు వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి కనిపించలేదని, రాలేదని పేర్కొన్నారు.

Revanth Reddy Missing Posters : రేవంత్ రెడ్డి మిస్సింగ్ అంటూ హైదరాబాద్ లో పోస్టర్లు

Revanth Reddy Missing Posters

Updated On : July 28, 2023 / 11:11 PM IST

Hyderabad – Malkajgiri : హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షాలు, వరదలపై రాజకీయ రగడ మొదలైంది. వర్షాలతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతుంటే టీపీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఎటు పోయారంటూ గుర్తు తెలియని వ్యక్తులు ప్రశ్నిస్తున్నారు.

మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలో ఎంపీ రేవంత్ రెడ్డి మిస్సింగ్ అంటూ పోస్టర్లు వెలిశాయి. 2020లో వరదలు వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి కనిపించలేదని, రాలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం వారం రోజులుగా వర్షాలు పడుతున్నా కనిపించడం లేదంటూ నిలదీస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడని నిలదీస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

BJP Leaders : వరద ప్రాంతాల్లో పర్యటించనున్న బీజేపీ నేతలు.. 8 ఉమ్మడి జిల్లాలకు ఎనిమిది బృందాలు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. పలు కాలనీలు, బస్తీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నగరంలోని  జంట జలాశయాలు నీటి కుండలా మారాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రెండు జలాశయాల గేట్లు ఎత్తి మూసీకి నీటిని విడుదల చేశారు. దీతో మూసీ నది పొంగి ప్రవహిస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.