Mayank Pawar: 37ఏళ్ల వయసులోనే ప్రముఖ ఫిట్నెస్ ఐకాన్ మృతి.. షాక్‌లో ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు
రియాలిటీ షో మాత్రమే కాదు, ఫిట్నెస్ పరిశ్రమలో కూడా సుపరిచితుడు మయాంక్. అతను అనేక బాడీ బిల్డింగ్ టైటిళ్లను గెలుచుకున్నాడు.
Mayank Pawar Representative Image (Image Credit To Original Source)
- రియాలిటీ షో రంగంలో పాపులర్
- ఫిట్నెస్ పరిశ్రమలో కూడా సుపరిచితుడు
- 7 సార్లు మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్
Mayank Pawar: ఫిట్ నెస్ ఐకాన్ గా గుర్తింపు పొందిన మయాంక్ పవార్ కన్నుమూశాడు. మయాంక్ పవార్ ప్రముఖ టీవీ రియాలిటీ షో ‘MTV Splitsvilla’ సీజన్ 7 కంటెస్టెంట్. అంతేకాదు 7 సార్లు మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్ కూడా. ఆయన వయసు 37ఏళ్లు. ఫిట్నెస్ మోడల్‌గా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మయాంక్ మరణ వార్త ఇండస్ట్రీ, ఫిట్ నెస్ రంగానికి చెందిన ప్రముఖులు, అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్న వయసులోనే చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
మయాంక్ మరణ వార్తను ఆయన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. “ఒక సోదరుడు, ఒక ఛాంపియన్, ఒక గురువు, చాలా మందికి ప్రేరణ. మయాంక్ పవార్ ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచి ఉంటారు.” అని అందులో రాసుకొచ్చారు.
రియాలిటీ షో రంగంలో మయాంక్ ఒక ప్రసిద్ధ పేరు. స్ప్లిట్స్ విల్లా 7లో పాల్గొన్న తర్వాత అతను పాపులారిటీ పొందాడు. అతడి ప్రశాంత స్వభావం, నిజాయితీ వ్యక్తిత్వంతో ప్రశంసలు అందుకున్నాడు. అతని ఎలిమినేషన్ సీజన్లో అత్యంత చర్చనీయాంశమైంది.
రియాలిటీ షో మాత్రమే కాదు, ఫిట్నెస్ పరిశ్రమలో కూడా సుపరిచితుడు మయాంక్. అతను అనేక బాడీ బిల్డింగ్ టైటిళ్లను గెలుచుకున్నాడు. ప్రతిష్టాత్మక మిస్టర్ ఇండియా టైటిల్‌ను దక్కించుకున్నాడు. సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేశాడు. బాడీ బిల్డింగ్ పట్ల తన అంకితభావంతో చాలామంది యువ అథ్లెట్లకు ప్రేరణనిచ్చాడు.
