Samsung Galaxy A27 5G : శాంసంగ్ ఫ్యాన్స్ కోసం కొత్త గెలాక్సీ A27 5G వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర కూడా తక్కువే!
Samsung Galaxy A27 5G : శాంసంగ్ అభిమానుల కోసం సరికొత్త 5జీ ఫోన్ రాబోతుంది. శాంసంగ్ గెలాక్సీ A27 5జీ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అంతకన్నా ముందుగానే కీలక ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి.

Samsung Galaxy A27 5G : శాంసంగ్ ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్. సౌత్ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త 5జీ ఫోన్ రాబోతుంది. కొత్త ఫోన్ గెలాక్సీ A27 5జీ అతి త్వరలోనే లాంచ్ చేయనుంది. ఇదివరకే ఈ ఫోన్ సంబంధించిన పూర్తి వివరాలు లీక్ అయ్యాయి. 2.40GHz టాప్ క్లాక్ స్పీడ్‌తో ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. రాబోయే శాంసంగ్ 5జీ ఫోన్ హ్యాండ్సెట్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

శాంసంగ్ గెలాక్సీ A27 5జీ స్పెసిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ A27 5జీ ఫోన్ గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో కనిపించింది. ఈ లిస్టింగ్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ ARMv8 ఆర్కిటెక్చర్ ఆధారిత ఆక్టా-కోర్ ARM ప్రాసెసర్‌తో వస్తుందని అంచనా. ఇందులో రెండు క్లస్టర్లు ఉన్నాయి. మొత్తం 4 కోర్లు 1.80GHz వద్ద మిగిలిన 4 కోర్లు 2.40GHz వరకు క్లాక్ అయ్యాయి. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్తో రానుంది.

గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ A27 5జీలో అడ్రెనో 710 జీపీయూ, 6GB ర్యామ్ ఉండొచ్చు. ఆండ్రాయిడ్ 16తో రన్ అవుతుంది. వన్ యూఐ 8.5 ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్సెట్ సింగిల్-కోర్ టెస్ట్‌లో 777, మల్టీ-కోర్ టెస్ట్‌లో 1,802 స్కోర్ సాధించింది.

మెమరీ కాంపోనెంట్ల ధరలతో హార్డ్‌వేర్ ఆప్షన్‌పై ప్రభావం పడింది. అందుకే 2026 స్మార్ట్‌ఫోన్‌లో దాదాపు రెండేళ్ల నాటి ప్రాసెసర్‌ను తీసుకువచ్చే అవకాశం ఉంది. రాబోయే ఈ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ A26 5Gకి అప్‌గ్రేడ్ వెర్షన్.

శాంసంగ్ గెలాక్సీ A26 5జీ స్పెసిఫికేషన్లు : ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1,080x2,340 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ షూటర్, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 13MP కెమెరా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 పై పనిచేస్తుంది.

ఈ శాంసంగ్ ఫోన్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1380 చిప్సెట్తో రన్ అవుతుంది. 8GB ర్యామ్, 256GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌కు సపోర్టు ఇస్తుంది. శాంసంగ్ గెలాక్సీ A26 5జీలో 25W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది. అథెంటికేషన్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.

ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP67 రేటింగ్ అందిస్తుంది. ధర విషయానికి వస్తే.. ఈ శాంసంగ్ గెలాక్సీ A27 5జీ ఫోన్ ధర రూ. 21,999 మధ్య రేంజ్లో ఉండొచ్చనని అంచనా. తక్కువ ధరలో అదిరిపోయే 5G ఫోన్ కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్.
