Tollywood : చట్టబద్ధత.. అమరావతికి టాలీవుడ్..! నెక్స్ట్ స్టెప్ అదేనా?
అమరావతికి టాలీవుడ్ (Tollywood) విస్తరణ హాట్ టాపిక్‌గా కొనసాగుతూనే ఉంది.
Gossip Garage Is Tollywood may shifted to Amaravati
Tollywood : అమరావతికి టాలీవుడ్ విస్తరణ హాట్ టాపిక్‌గా కొనసాగుతూనే ఉంది. 2014లో చంద్రబాబు ఏపీలో అధికారంలోకి రావడంతో సినీ పెద్దలు చాలా ఆశలు పెట్టుకున్నారు. అప్పుడే నవ్యాంధ్రకు టాలీవుడ్ విస్తరణ జరుగుతోందన్న అంచనాలు ఉండేవి. కానీ రాజధాని అంశం సస్పెన్స్‌గానే కంటిన్యూ అయింది.
ఇప్పుడు ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత రావడం ఆల్ మోస్ట్ పూర్తి కావడంతో టాలీవుడ్ ప్రముఖుల ఆలోచన మారుతోందట. టాలీవుడ్ హీరోలు, టాప్ డైరెక్టర్లు, బిగ్ ప్రొడ్యూసర్లు త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటికే ఈ మీటింగ్ కోసం డేట్స్ ఫైనలైజ్ చేస్తున్నట్టు లీకులు బయటికి వస్తున్నాయి.
Pavithra Puri : చీరలో దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు.. పవిత్ర ఎంత క్యూట్‌గా ఉందో..
చంద్రబాబు, పవన్‌తో జరిగితే భేటీలో అమరావతిలో ఫిల్మ్ సిటీ, స్టూడియోలు, ప్రొడక్షన్ హౌసెస్ ఏర్పాటు వంటి అంశాలను చర్చించబోతున్నారట. ఏపీకి కూడా టాలీవుడ్ విస్తరిస్తే అక్కడ సినిమా షూటింగ్‌లు జరిగితే స్థానిక యువతకు ఉపాధి కల్పించొచ్చని ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టబోతున్నారని టాక్.
పవన్ కల్యాణ్ హీరోగా ఉన్నందున, ఇండస్ట్రీ కష్టాలేంటో తెలిసిన వ్యక్తి కావడంతో త్వరలో జరగబోయే సమావేశం చాలా స్పెషల్ అని అంటున్నారు. పలువురు నిర్మాతలు, టాప్ హీరోలు ఇన్వెస్ట్ చేసి ఫిల్మ్ సిటీ, స్టూడియోలు ఏర్పాటుతో అమరావతిని సినిమా హబ్‌గా మార్చాలనే ప్లాన్ కూడా ఉందన్న గాసిప్ హల్ చల్ చేస్తోంది.
