Medicine Prices Rise : యుద్ధం ఎఫెక్ట్.. మందుల ధరలు పెరుగుతున్నాయ్..! ఏ ఔషధం రేటు ఎంత పెరిగిందంటే?
Medicine Prices Rise : కంపెనీలు ఎప్పటికప్పుడు ధరలు పెంచుతుంటాయి. ఆ సమయంలో 5శాతం నుంచి 10శాతం వరకు ధరల్లో పెరుగుదల ఉంటుంది. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో 90శాతం వరకు ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.
Medicine prices in India could see a substantial hike
- పశ్చిమాసియాలో యుద్ధం ఎఫెక్ట్..
- ఔషధ ధరలు భారీగా పెరిగే చాన్స్
- 20శాతం నుంచి 186శాతం వరకు భారం
- 900 రకాల ఔషధాల ధరల పెంపు
Medicine Prices Rise : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా యుద్ధం కారణంగా భారతదేశంలోని పలు రంగాలకు చెందిన ఉత్పత్తుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. తాజాగా.. ఫార్మా రంగంపైనా యుద్ధం ప్రభావం కనిపిస్తోంది. ఫార్మా రంగం. బల్క్ డ్రగ్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ముడిపదార్థాల (ఏపీఐల) సరఫరాలో కలుగుతున్న అంతరాయాలు.. మందుల ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
మందుల షాపుల్లో అందుబాటులో ప్రస్తుతం ఉన్న స్టాక్ యుద్ధం ప్రారంభంకాకముందు తయారై వచ్చింది. కొత్తగా తయారవుతున్న ఔషధాల ధరలు మాత్రం భారం కానున్నాయి. ఎందుకంటే.. ఫార్మా రంగం, బల్క్ డ్రగ్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ముడిపదార్థాల సరఫరాలో అంతరాయం కలుగుతుంది. దీంతో మందుల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరలు 200 శాతం నుంచి 300శాతం వరకు పెరిగాయి. ఈ కారణంగా పలు ఔషధాల ధరలను 20శాతం నుంచి గరిష్టంగా 180శాతం దాకా పెంచి విక్రయించేందుకు ఫార్మా రంగానికి చెందిన కంపెనీలు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో దాదాపు 900 రకాల ఎసెన్షియల్ మెడిసిన్స్ ధరలు పెరగనున్నాయి.
కంపెనీలు ఎప్పటికప్పుడు ధరలు పెంచుతుంటాయి. ఆ సమయంలో 5శాతం నుంచి 10శాతం వరకు ధరల్లో పెరుగుదల ఉంటుంది. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో 90శాతం వరకు ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఏ ఔషధంపై ఎంత ధర పెరిగిందనే విషయం కొత్త స్టాక్ వస్తేనే తెలుస్తుందని ఫార్మారంగ నిపుణులు పేర్కొంటున్నారు.
తాజాగా ఔషధాల పెరుగుదల భారం ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయితే, రోగులపై పడుతుంది. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో బడ్జెట్ పరిమితుల వల్ల మందుల సరఫరా కొరత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ప్రజలు ఎక్కువగా వినియోగించే పారాసెటమాల్, యాంటీ బయాటిక్స్, నొప్పి నివారణ మందులు, ఇన్సులిన్ స్టెరాయిడ్ ఔషధాల కొత్త స్టాకు ధరలను ఇప్పటికే పెంచేశారు. దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడేవారు.. జ్వరం, నొప్పులు, ఇన్ ఫెక్షన్లు, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులకు ఈ పెంపు ఆర్థికంగా భారంగా మారనుంది.
