Nani : ఇన్నాళ్లు క్లాస్.. ఇకపై మాస్.. ఈ రెండు క్లిక్ అయ్యాయి అంటే నాని రేంజ్..
నాని.. బాయ్ నెక్ట్స్ డోర్ ఇమేజ్ నుంచి బయటికొచ్చి ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తున్నారు. (Nani)
Nani
Nani : స్టార్ హీరో అవ్వడం అంటే అంత ఈజీకాదు. అయితే ఆ స్టార్ హీరో ట్యాగ్ ని సంపాదించుకోవడానికి తెగ కష్టపడుతున్నారు నాని. నానికి మంచి ఫ్యాన్స్ ఉన్నా, మంచి నటుడు అని పేరొచ్చినా, ప్రతి సినిమా హిట్ అయినా స్టార్ హీరోల ఓపెనింగ్స్ మాత్రం రావట్లేదు. అటు స్టార్ హీరోలకి, ఇటు యంగ్ హీరోలకి మధ్యలో ఉన్న నాని ఇప్పుడు స్టార్ హీరో అయ్యే పనిలో ఉన్నారు.
నాని.. బాయ్ నెక్ట్స్ డోర్ ఇమేజ్ నుంచి బయటికొచ్చి ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాల రిజల్ట్ సంగతి పక్కనపెడితే పెద్ద హీరోల లిస్ట్ లో జాయిన్ అవ్వడానికి నాని మాత్రం బాగా ట్రై చేస్తున్నారు. వరసపెట్టి నాని చేస్తున్న సినిమాల్ని చూస్తే ఆ విషయం క్లియర్ గా అర్దమవుతుందంటున్నారు ఆడియన్స్. ప్రజెంట్ టాప్ హీరోలందరూ చేస్తున్నట్టు నాని కూడా వరసగా యాక్షన్ సినిమాలే అనౌన్స్ చేస్తున్నారు.
Also Read : Pawan Kalyan : ఫుల్ గడ్డంతో పవన్ రీసెంట్ లుక్స్.. ఆ సినిమా కోసమేనా..?
నిన్న మొన్నటి వరకూ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన నాని ఇప్పుడు మాస్ తో వరల్డ్ వైడ్ రేంజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దసరా, హిట్ 3 లాంటి యాక్షన్ మూవీతో తనని తానూ ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేసిన నాని ఇప్పుడు చేస్తున్న 2 సినిమాలూ యాక్షన్ మూవీసే చేస్తున్నాడు. అదికూడా మాస్ మ్యాసివ్ యాక్షన్ మూవీస్.
Nani
శ్రీకాంత్ ఓదెలతో ప్రస్తుతం నాని చేస్తున్న ద ప్యారడైజ్ సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ గా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటి వరకూ నేషనల్ హీరోగా ఉన్న నాని ప్యారడైజ్ తో ఇంటర్నేషనల్ హీరో కావడానికి ట్రై చేస్తున్నారు. అందుకే ప్యారడైజ్ ని ఏకంగా 8 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి రిలీజైన ఆయాషేర్ సాంగ్ లో నాని మ్యాసివ్ మేకోవర్ ని చూపించారు.
కెరీర్ లో మాస్ యాక్షన్ మూవీగా శ్రీకాంత్ ఓదెలతో చేసిన దసరా మూవీతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నారు నాని. ఇప్పుడు అదే కాంబినేషన్లో తెరకెక్కుతున్న ద ప్యారడైజ్ మూవీని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీతో పాటు బెంగాలీ, స్పెయిన్, ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Also Read : ది ప్యారడైజ్ నుంచి ‘ఆయా షేర్’ సాంగ్ వచ్చేసింది.. నాని డ్యాన్స్ అదరగొట్టేసాడుగా..
నాని కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ తో మ్యాసివ్ మేకోవర్ తో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ద ప్యారడైజ్ ఓటీటీ రైట్స్ ని 65 కోట్లకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఈ సినిమా మార్చి 26 నుంచి వాయిదా పడి ఆగస్ట్ 21 కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ద ప్యారడైజ్ సినిమాలో యాక్షన్, వయెలెన్స్ ఎక్కువగా ఉంటుందని ముందే హింట్ ఇచ్చిన నాని తన కెరీర్ లోనే ప్యారడైజ్ మూవీ బిగ్గెస్ట్ రిలీజ్ కాబోతోందంటున్నారు.
Nani
దసరా లోనే భారీ గా వయెలెన్స్ చేసిన నాని, హిట్ 3 లో రూత్ లెస్ వయెలెన్స్ చూపించిన నాని.. ద ప్యారడైజ్ లో ఇంతకు మించి ఏం చూపిస్తాడా, ఇంకా కొత్తగా సినిమాలో ఏముంటుందా..? గ్లోబల్ ఆడియన్స్ ని రీచ్ అయ్యేలా ఏం ఎలిమెంట్స్ ఉన్నాయా అని చర్చ జరుగుతుంది.
Also Read : Rashmika Vijay : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న.. ఎవరు ఏం చదువుకున్నారో తెలుసా?
ది ప్యారడైజ్ ఒక ఎత్తైతే సుజిత్ డైరెక్షన్లో నాని అనౌన్స్ చేసిన సినిమా అంతకుమించిన యాక్షన్ తో రాబోతోందని అనౌన్స్ మెంట్ వీడియోతో హింట్ ఇచ్చారు మేకర్స్. ఒక పక్క యాక్షన్ అంటున్నారు మరో వైపు లవర్ అంటున్నారు. బ్లడీ రోమియో అంటూ టైటిల్ అనౌన్స్ చేయ్యడంతో అసలు ఈ జానర్ ఏంటా అని తెగ ఆలోచిస్తున్నారు ఫాన్స్. నాని చెఫ్ రోల్ చేస్తున్నారు, ఎట్ ద సేమ్ టైమ్ యాక్షన్ రోల్ లో కూడా కనిపిస్తున్నారు.
ఓజీ అంటూ పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ చేసిన సుజిత్ నానితో ఈ బ్లడీరోమియో అనౌన్స్ చెయ్యడంతో ఈ కాంబినేషన్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గ్యారంటీ అని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇలా ఒకవైపు ద ప్యారడైజ్, మరో వైపు బ్లడీ రోమియో.. ఈ 2యాక్షన్ మూవీస్ క్లిక్ అయ్యాయా ఇక స్టార్ హీరోల భారీ ఓపెనింగ్, పాన్ ఇండియా లిస్ట్ లో నాని యాడ్ అయినట్టే అంటున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.
