Ayodhya: హోటళ్లన్నింటినీ బుక్ చేసుకుంటున్న ట్రావెల్ ఏజెంట్స్.. డిమాండ్ మామూలుగా లేదు

ఆ తేదీల్లో బల్క్ బుకింగుల కోసం.. దేశ వ్యాప్తంగా ఉన్న ట్రావెల్ ఏజెన్సీలు విపరీతంగా ప్రయత్నాలు జరుపుతున్నాయి.

Ayodhya: హోటళ్లన్నింటినీ బుక్ చేసుకుంటున్న ట్రావెల్ ఏజెంట్స్.. డిమాండ్ మామూలుగా లేదు

Ayodhya - Ram Mandir

Ayodhya – Ram Mandir: అయోధ్యలో హోటళ్లు, గెస్ట్ హౌసులు, ధర్మశాలు అన్నింటినీ ట్రావెల్ ఏజెంట్స్ బుక్ చేసుకున్నారు. అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్టాపనకు ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)కి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Shri Ram Janmabhoomi Teerth Kshetra) ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే.

వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 26 మధ్య అయోధ్యలో ఉండడానికి అధికంగా బుకింగులు చేసుకుంటున్నారు. రామ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు జనవరి 14 నుంచి జనవరి 24 వరకు జరుగుతాయని ఇప్పటికే ఆలయ నిర్మాణ కమిటీ చెప్పింది. ఈ వేడుకలు ఘనంగా జరగనున్న నేపథ్యంలో అక్కడకు భక్తులు భారీగా తరలివెళ్లే అవకాశం ఉంది.

ఆ తేదీల్లో బల్క్ బుకింగుల కోసం.. దేశ వ్యాప్తంగా ఉన్న ట్రావెల్ ఏజెన్సీలు విపరీతంగా ప్రయత్నాలు జరుపుతున్నాయి. ఈ డిమాండుకు తగ్గట్లే రేట్లు ఉంటున్నాయి. మరోవైపు, భక్తులు కూడా బుకింగుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు వారం రోజుల పాటు అక్కడే ఉండేలా చాలా మంది భక్తులు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా బుకింగులు చేసుకుంటున్నారు.

ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల నుంచి ఎక్కువగా బుకింగులు జరుగుతున్నాయని ఓ హోటల్ ఎండీ శారద్ కపూర్ అన్నారు. భక్తులను తాము స్వాగతిస్తామని, అయితే, దాదాపు 40 శాతం గదులు వీఐపీ విజిటర్ల కోసం రిజర్వు చేస్తామని చెప్పారు. అయోధ్యలో ప్రస్తుతం 100 హోటళ్లు ఉన్నాయి.

గొండా, బలరాంపూర్, తారాబ్గంజ్, దోమరియాగంజ్, తాండా, ముసాఫిర్ఖానా, బన్సి వంటి ప్రాంతాల్లో హోటళ్ల బుకింగులకు ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్లు ఆప్షన్లు ఇవ్వడం ప్రారంభించారు. తాజాగా, అయోధ్య అధికారులు హోటళ్ల యజమానులతో సమావేశం నిర్వహించి భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేసి, సౌకర్యాలు కల్పించాలని కోరారు. భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉండడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయని చెప్పారు.
Hyderabad: నిర్మాణరంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్.. స్కైస్క్రాపర్స్‌ ఆఫీస్ స్పేస్‌లో భాగ్యనగరానిదే హవా