China: పట్టణాల్లో ఉద్యోగాల్లేవ్, వెంటనే గ్రామాలకు వెళ్లి పని చేసుకోండి.. యువతకు ప్రభుత్వం సలహా

మాన్యుఫ్యాక్చరింగ్ మందగించడం, ఐటీ సెక్టర్ బలహీనపడటం ఈ సమస్యకు కారణాలని చెప్తున్నారు. కమ్యూనిస్ట్ యూత్ లీగ్ గత నెలలో యువ గ్రాడ్యుయేట్లను హెచ్చరించింది. ఫ్యాక్టరీలలో స్క్రూలను బిగించడానికి నిరాకరించేవారిపై మండిపడింది. సూట్లు విప్పేసి, చొక్కా చేతులు వెనుకకు మడిచి, పొలం పనులకు వెళ్లాలని చెప్పింది.

China: పట్టణాల్లో ఉద్యోగాల్లేవ్, వెంటనే గ్రామాలకు వెళ్లి పని చేసుకోండి.. యువతకు ప్రభుత్వం సలహా

China Youth

China: బడా కంపెనీల్లో వరుస లేఆఫ్స్‭తో యువత పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగం ఇప్పటికే చాలా పెరిగింది. రానున్న రోజుల్లో సైతం మరింత తీవ్ర స్థాయికి పెరగనుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెల్లడించింది. ఈ సమస్య చైనాలోనూ అధికంగానే ఉంది. దీంతో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు చైనాలోని ఒక ప్రావిన్స్ ప్రభుత్వం యువతకు సరికొత్త సలహా ఇచ్చింది. పట్టణాల్లో ఉద్యోగాల సృష్టి జరిగే పరిస్థితి కనిపించకపోవడంతో పల్లెటూళ్లకు వెళ్లి, ఉద్యోగాలు వెతుక్కోవాలని సలహా ఇచ్చింది.

Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఎన్ఆర్‭సీ’ వాగ్దానం.. మరో వివాదానికి తెరలేపిన బీజేపీ

సూచన చేయడమే కాదు, ఇప్పటికే సుమారు 3 లక్షల మంది నిరుద్యోగ యువతను పల్లెటూళ్లకు పంపించింది కూడా. చైనాలోని గ్వాంగ్‌డోంగ్ ప్రావిన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా పేరు పొందింది. ఇది హాంగ్ కాంగ్‌కు పక్కనే ఉంటుంది. అయితే ఇక్కడ నిరుద్యోగం పెరగడంతో ఎక్కడ చూసినా ‘నో వేకెన్సీ’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. దీంతో కాలేజ్ గ్రాడ్యుయేట్లు, యంగ్ ఎంటర్‌ప్రెన్యూవర్లు గ్రామాల్లో పనులు వెతుక్కోవాలంటూ గ్వాంగ్‌డోంగ్ ప్రావిన్స్ ప్రభుత్వం సలహా ఇచ్చింది. గ్రామీణ యువతకు కూడా ఇదే సలహా ఇచ్చింది. గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలను వెతుక్కోవాలని పేర్కొంది.

Chhattisgarh: ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ట్రైబల్ బిగ్ బాస్

గతేడాది చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సైతం ఇదే సలహా ఇచ్చారు. 2022 డిసెంబరులో ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడం కోసం యువత గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు వెతుక్కోవాలని తెలిపారు. మావో జెడాంగ్ పరిపాలనా కాలంలో కూడా చైనా ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేసింది. అప్పట్లో కూడా యువత మారుమూల గ్రామాలకు వెళ్లిపోయారు. చైనాలో ఈ ఏడాది కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి పట్టాలు పుచ్చుకుని బయటకు వచ్చినవారి సంఖ్య కోటి 15 లక్షలకు పైగానే ఉంటుందట. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండటంతో సాంఘిక అస్థిరత్వానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోందనే ఆందోళనలు పెరిగాయి.

Tuni Train Burning Case : తుని రైలు దహనం కేసు.. ఏడేళ్ల తర్వాత కోర్టు కీలక తీర్పు

చైనాలోని పట్టణ ప్రాంతాల్లో 16 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్కుల్లో నిరుద్యోగం రేటు ఈ ఏడాది మార్చిలో 19.6 శాతానికి పెరిగింది. ఫిబ్రవరి నెలలో ఈ రేటు 18.1 శాతం ఉండేది. చైనాలోని పట్టణాలు, నగరాల్లో కోటికి పైగా నిరుద్యోగ యువత ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. ఇక చైనాలో నిరుద్యోగం రేటు పెరుగుతుండటానికి కారణం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనమేనని నిపుణులు చెప్తున్నారు. మాన్యుఫ్యాక్చరింగ్ మందగించడం, ఐటీ సెక్టర్ బలహీనపడటం ఈ సమస్యకు కారణాలని చెప్తున్నారు. కమ్యూనిస్ట్ యూత్ లీగ్ గత నెలలో యువ గ్రాడ్యుయేట్లను హెచ్చరించింది. ఫ్యాక్టరీలలో స్క్రూలను బిగించడానికి నిరాకరించేవారిపై మండిపడింది. సూట్లు విప్పేసి, చొక్కా చేతులు వెనుకకు మడిచి, పొలం పనులకు వెళ్లాలని చెప్పింది.

Rajasthan: ముఖ్యమంత్రి పుట్టిన రోజు కోసం వేసి హోర్డింగ్ ఎత్తుకెళ్లిన దొంగలు.. రాజస్థాన్‭లో వింత ఘటన

అయితే దీనిపై చైనా యువత నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. సామాజిక మాధ్యమాలపై చైనా ప్రభుత్వం గట్టి ఆంక్షలు విధిస్తున్నప్పటికీ, చాలా మంది ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. విద్యావంతులు పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం తగిన సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించలేకపోతోందని మండిపడుతున్నారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో కోట్ల మంది నిరుద్యోగులుగా ఉండడం ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.