Chhattisgarh: ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ట్రైబల్ బిగ్ బాస్

1980లో బీజేపీ రాయ్‌గఢ్ జిల్లా విభాగానికి చీఫ్‌గా ఎన్నికయ్యారు. 1985 నుంచి 1998లో తప్కారా నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా వరుసగా ఎన్నికయ్యారు. 1997 నుంచి 2000 వరకు మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్‌గా.. 2003 నుంచి 2005 వరకు ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.

Chhattisgarh: ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ట్రైబల్ బిగ్ బాస్

Tribal leader Nand Kumar Sai joins Congress

Chhattisgarh: మరో నాలుగైదు నెలల్లో నెలల్లో ఛత్తీస్‭గఢ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో విపక్ష భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇదే సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి లైన్ క్లియర్ అయినట్లే వినిపిస్తోంది. సీనియర్ గిరిజన నాయకుడు అయిన నంద్ కుమార్ సాయి సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాయ్‌పూర్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్, పార్టీ అధ్యక్షుడు మోహన్ మార్కం సమక్షంలో సాయికి పార్టీ ప్రాథమిక సభ్యత్వం లభించింది.

Karnataka elections 2023: మద్యం వరదను, ధన ప్రవాహాన్ని కట్టడి చేయండి: ఎన్నికల సంఘాన్ని కోరిన ఏపీ

దీనికి ముందు నంద్ కుమార్ తన రాజీనామాను ఆదివారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్‭సాకు తన రాజీనామాను సమర్పించారు. గతంలో రెండుసార్లు లోక్‌సభ ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నందకుమార్ సాయి (77 ఏళ్లు) గతంలో ఉమ్మడి మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి, అనంతరం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. సుర్గుజా డివిజన్ (ఉత్తర ఛత్తీస్‌గఢ్)లోని గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతాల్లో సాయి అత్యంత బలమైన నాయకుడు. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈయన, బీజేపీకి చెందిన ప్రముఖ గిరిజన ముఖంగా ఇన్ని రోజులు వెలుగొందారు. ఆయన తొలుత జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1977లో మధ్యప్రదేశ్‌లోని తప్కారా స్థానం (ప్రస్తుతం జాష్‌పూర్ జిల్లాలో) నుంచి జనతా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Rajasthan: ముఖ్యమంత్రి పుట్టిన రోజు కోసం వేసి హోర్డింగ్ ఎత్తుకెళ్లిన దొంగలు.. రాజస్థాన్‭లో వింత ఘటన

1980లో బీజేపీ రాయ్‌గఢ్ జిల్లా విభాగానికి చీఫ్‌గా ఎన్నికయ్యారు. 1985 నుంచి 1998లో తప్కారా నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా వరుసగా ఎన్నికయ్యారు. 1997 నుంచి 2000 వరకు మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్‌గా.. 2003 నుంచి 2005 వరకు ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. నవంబర్ 2000లో మధ్యప్రదేశ్ నుండి విడిపోయిన తర్వాత ఛత్తీస్‌గఢ్ శాసనసభలో మొదటి ప్రతిపక్ష నాయకుడిగా పని చేశారు. 2017లో షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు.

Revanth Reddy: కొత్త సెక్రటేరియట్‌కు వెళ్తున్న రేవంత్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. సచివాలయం వద్ద భారీగా పోలీసులు

నంద్ కుమార్ చేరికతో రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత బలపడుతుందని ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ చీఫ్ మోహన్ మార్కం అన్నారు. దాదాపుగా రెండు దశబ్దాల పాటు నిరాటకంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని పాలించిన బీజేపీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. అనంతరం రోజురోజుకు బలహీన పడుతూ వస్తోంది. ఈ యేడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం కావడంతో నంద్ కుమార్ చేరికతో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల లైన్ క్లియర్ అయినట్లే అని విశ్లేషణలు వస్తున్నాయి. ఇదిలావుండగా, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి అజయ్ చంద్రకర్ మాట్లాడుతూ, ఛత్తీస్‌గఢ్‌లో సాయికి రాజకీయ పునాది లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో చేరాలన్న ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.