Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఎన్ఆర్‭సీ’ వాగ్దానం.. మరో వివాదానికి తెరలేపిన బీజేపీ

నందిని పాల వ్యవహారం, ప్రభుత్వ పనుల్లో ప్రజాప్రతినిధులు 40 శాతం కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు బీజేపీని ఇరుకున పెట్టాయి. ఈ రెండు అంశాలను విపక్షాలు ఆయుధంగా మలుచుకుని ఎన్నికలకు వెళ్తున్నాయి. అయితే ఎన్ఆర్‭సీ ద్వారా విపక్షాలని ఇరుకున పెట్టేందుకే బేజేపీ మేనిఫెస్టోలో దీన్ని చేర్చినట్లు ఆరోపిస్తున్నారు

Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఎన్ఆర్‭సీ’ వాగ్దానం.. మరో వివాదానికి తెరలేపిన బీజేపీ

BJP Releases Manifesto For Karnataka Polls

Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆధ్వర్యంలో ‘ప్రజా ధ్వని’ పేరుతో విడుదల చేసిన ఈ మెనిఫెస్టోలో ప్రజలపై అనేక వరాల జల్లు కురిపించినప్పటికీ.. వివాదాస్పద ‘నేషనల్ రిజస్టర్ ఆఫ్ సిటిజెన్’ (జాతీయ పౌరుల రిజిస్టర్) అమలు చేస్తామని పేర్కొంది. కర్ణాకటలో ఇప్పటికే సావర్కర్ అంశం, హిజాబ్ అంశం కొన్ని వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలకు తావునిచ్చింది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన ఎన్ఆర్‭సీని అమలు చేస్తామని పేర్కొనడం మరో వివాదానికి తెరలేపినట్టేనని విమర్శకులు అంటున్నారు.

Minister Dadisetti Raja : రజినీకాంత్, చంద్రబాబు.. ఎన్టీఆర్ కు క్షమాపణ చెప్పాలి : మంత్రి దాడిశెట్టి రాజా

నందిని పాల వ్యవహారం, ప్రభుత్వ పనుల్లో ప్రజాప్రతినిధులు 40 శాతం కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు బీజేపీని ఇరుకున పెట్టాయి. ఈ రెండు అంశాలను విపక్షాలు ఆయుధంగా మలుచుకుని ఎన్నికలకు వెళ్తున్నాయి. అయితే ఎన్ఆర్‭సీ ద్వారా విపక్షాలని ఇరుకున పెట్టేందుకే బేజేపీ మేనిఫెస్టోలో దీన్ని చేర్చినట్లు ఆరోపిస్తున్నారు. ఎన్నికల పోలింగుకు కేవలం 9 రోజుల గడువు మాత్రమే ఉంది. ప్రచార సమయం ఇంకాస్త తక్కువనే ఉంది. ఈ సమయాన్ని ఎలాగైనా తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు అంటున్నారు. ఇదే కాకుండా ఉమ్మడి పౌర స్మృతిపై సైతం బీజేపీ హామీ ఇచ్చింది.

వీటితో పాటు కన్నడ ప్రజలపై బీజేపీ వరాల జల్లు కురిపించింది..
* ఉమ్మడి పౌర స్మృతి
* వడ్డీ లేకుండా రైతులకు 5 లక్షల రూపాయల రుణాలు
* కర్ణాటకలో ఎన్ఆర్‌సీ (జాతీయ పౌరుల రిజిస్టర్) అమలు
* ఛాందసవాదానికి వ్యతిరేకంగా ప్రత్యేక విభాగం ఏర్పాటు
* బెంగళూరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
* ప్రతి రోజూ ఉచితంగా నందిని పాల పంపిణీ
* సీనియర్ సిటిజన్లకు ఉచితంగా ప్రతి సంవత్సరం మాస్టర్ హెల్త్ చెక్-అప్
* ప్రతి నెలా రేషన్ కిట్స్.. 5 కేలోల శ్రీ అన్న-సిరి ధాన్య పంపిణీ
* పురపాలక సంఘంలోని ప్రతి వార్డులోనూ అటల్ ఆహార కేంద్రాల ఏర్పాటు
* ప్రభుత్వ పాఠశాలలను అత్యున్నత స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడం కోసం ప్రముఖులతో భాగస్వామ్యం
* ప్రతిభావంతులైన యువ ప్రొఫెషనల్స్‌కు ప్రోత్సాహం. ‘సమన్వయ’ పథకం ద్వారా చిన్న తరహా పరిశ్రమలు, ఐటీఐల మధ్య సహకారాన్ని పెంపొందించడం
* ఐఏఎస్, కేఏఎస్, బ్యాంకింగ్, ప్రభుత్వోద్యోగాలకు శిక్షణ పొందే విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం
* ‘మిషన్ స్వాస్థ్య కర్ణాటక’ పథకం ద్వారా ప్రజారోగ్య మౌలిక సదుపాయాల బలోపేతం
* ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు, ఏపీఎంసీల ఆధునికీకరణ, డిజిటైజేషన్, మైక్రో కోల్డ్ స్టోరేజ్ కేంద్రాల ఏర్పాటు కోసం రూ.30 వేల కోట్లతో కే-అగ్రి ఫండ్ ఏర్పాటు.
* కర్ణాటకను అత్యంత ఆకర్షణీయమైన టూరిస్ట్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దేందుకు రూ.1500 కోట్లు కేటాయింపు
* ఇళ్లు లేని నిరుపేదల కోసం 10 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ
వీటితో పాటు పలు హామీలు ఇచ్చారు.