Biological Weapons On Ukraine : యుక్రెయిన్‌పై రష్యా రసాయన, జీవాయుధాలు ప్రయోగించొచ్చు-బైడెన్ సంచలన వ్యాఖ్యలు

యుక్రెయిన్ బలగాల నుంచి ఊహించని విధంగా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండటంతో రసాయన, జీవ ఆయుధాలను(Biological Weapons On Ukraine) ఉపయోగించడాన్ని..

Biological Weapons On Ukraine : యుక్రెయిన్‌పై రష్యా రసాయన, జీవాయుధాలు ప్రయోగించొచ్చు-బైడెన్ సంచలన వ్యాఖ్యలు

Biological Weapons On Ukriane

Biological Weapons On Ukraine : యుక్రెయిన్ పై రసాయన, జీవాయుధాలు ప్రయోగించే అవకాశాలను పుతిన్ పరిశీలిస్తున్నారా? అంటే, అవుననే అంటున్నారు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బైడెన్. సైనిక చర్య పేరుతో యుక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్ బలగాల నుంచి ఊహించని విధంగా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండటంతో రసాయన, జీవ ఆయుధాలను ఉపయోగించడాన్ని పుతిన్ పరిశీలిస్తున్నట్లు బైడెన్ తెలిపారు. ఈ విషయంలో తమకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు.

అంతేకాదు అమెరికన్లపై రష్యా సైబర్ దాడులకు దిగే అవకాశం ఉందని.. అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. మరోవైపు, పుతిన్‌ను యుద్ధ నేరస్తుడంటూ ఆరోపించిన బైడెన్ వ్యాఖ్యలపై రష్యా స్పందించింది. రష్యాలో అమెరికా రాయబారి జాన్ సులివాన్‌ను పిలిచి వివరణ అడిగింది. బైడెన్ ప్రకటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను విచ్ఛిన్నం చేసేలా ఉన్నాయని రష్యా తెలిపింది.(Biological Weapons On Ukraine)

Russia Condom Sales : యుద్ధం వేళ.. రష్యాలో భారీగా పెరిగిన కండోమ్ అమ్మకాలు

రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. మూడు వారాలు దాటింది. ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. యుక్రెయిన్ పై రష్యా సేనలు బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, కఠిన ఆంక్షలు విధిస్తున్నా, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చినా.. పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. అనుకున్నది సాధించేవరకు వెనక్కి తగ్గేది లేదంటున్నారు.

Russian President Putin : ప్రాణభయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌

గత 27 రోజులుగా యుక్రెయిన్ పై రష్యా సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. గత కొన్నిరోజులుగా రష్యా దాడుల్లో తీవ్రత పెరిగింది. భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాలను రష్యా ఉపయోగిస్తోంది. అయినా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు పుతిన్. రష్యా యుద్ధం మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే ఉక్రెయిన్‌ రాజధానిని వశపర్చుకొని ప్రభుత్వాన్ని మార్చేస్తుందని భావించారు. కానీ, ఆ అంచనాలు ఏవీ నిజం కాలేదు. దాదాపు మూడు వారాలుగా భీకర గెరిల్లా యద్ధం కొనసాగుతోంది. పుతిన్ ఊహించని విధంగా యుక్రెయిన్ సేనలను తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. యుక్రెయిన్ సేనలు తగ్గేదేలా అన్నట్టు పోరాటం సాగిస్తున్నారు. ఈ క్రమంలో యుక్రెయిన్ పై రష్యా.. వ్యూహాత్మక అణ్వస్త్ర, రసాయనిక, జీవాయుధ దాడులు చేయొచ్చనే వార్తలు వస్తున్నాయి.

Elon Musk: యుక్రెయిన్ లో ఇంటర్నెట్ కోసం 5,000 స్టార్ లింక్ టెర్మినల్స్ యాక్టివేట్

యుక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న రష్యా ఆశించిన మేర ముందుకు వెళ్లలేకపోతోందన్న బైడెన్.. అందుకే ఉక్రెయిన్ పై రసాయనిక, జీవాయుధాలు ప్రయోగించే అవకాశాలను పుతిన్ పరిశీలిస్తున్నారని వెల్లడించారు. యుక్రెయిన్ పై రసాయన, జీవ ఆయుధాలను ఉపయోగించడాన్ని పుతిన్ పరిశీలిస్తున్నట్లు బైడెన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అదే జరిగితే మానవాళికి భారీ నష్టం తప్పదనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Chernobyl Danger : చెర్నోబిల్ డేంజర్ బెల్స్.. యుక్రెయిన్‌తో పాటు సరిహద్దు దేశాలకు పొంచి ఉన్న ముప్పు