Elon Musk: యుక్రెయిన్లో ఇంటర్నెట్ కోసం 5,000 స్టార్ లింక్ టెర్మినల్స్ యాక్టివేట్

లాన్ మస్క్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్ "స్టార్ లింక్" ద్వారా యుక్రెయిన్ ప్రజలకు ఉచిత ఇంటర్నెట్ అందిస్తున్నాడు. 5,000 స్టార్ లింక్ టెర్మినల్స్ ను యుక్రెయిన్ కోసం యాక్టివేట్

Elon Musk: యుక్రెయిన్లో ఇంటర్నెట్ కోసం 5,000 స్టార్ లింక్ టెర్మినల్స్ యాక్టివేట్

Starlink

Elon Musk: రష్యాతో యుద్ధం కారణంగా సర్వం కోల్పోయిన యుక్రెయిన్ కు ప్రపంచ దేశాల నుంచి సహాయసహకారాలు కొనసాగుతున్నాయి. పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళుతున్న యుక్రెయిన్ ప్రజలకు విరాళాలు, ఇతర నిత్యావసరాలు అందిస్తూ కొన్ని స్వచ్చంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈక్రమంలో ప్రపంచ అపరకుబేరుడు, టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ యుక్రెయిన్ దేశ ప్రజలకు తనవంతు సహాయం అందిస్తున్నారు. ఎలాన్ మస్క్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్ “స్టార్ లింక్” ద్వారా యుక్రెయిన్ ప్రజలకు ఉచిత ఇంటర్నెట్ అందిస్తున్నాడు. యుక్రెయిన్ లో రష్యా దాడులు ప్రారంభమైన నాటి నుంచి ఆదేశంలో ఇంటర్నెట్ సేవలను నిలువరించింది రష్యా. ఈక్రమంలో అమెరికాలోని యుక్రెయిన్ రాయభారి విజ్ఞప్తి మేరకు ఎలాన్ మస్క్ స్పందిస్తూ యుక్రెయిన్ కు స్టార్ లింక్ టెర్మినల్ పంపిణీ చేశారు.

Also Read:Heart Touching Video: యుక్రెయిన్ శరణార్థి బాలుడిని హత్తుకుంటూ తరగతికి ఆహ్వానించిన స్పెయిన్‌ చిన్నారులు

అయితే ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో. యుక్రెయిన్ కు మరిన్ని స్టార్ లింక్ టెర్మినల్స్ పంపిణీ చేయాలనీ నిర్ణయించిన మస్క్.. ఆమేరకు 5,000 స్టార్ లింక్ టెర్మినల్స్ ను యుక్రెయిన్ కోసం యాక్టివేట్ చేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ నుంచి రోజు మార్చి రోజు కొత్త స్టార్ లింక్ టెర్మినల్స్ యుక్రెయిన్ కు వస్తున్నాయని..ప్రజలకు ఇంటర్నెట్ అందుబాటులో ఉండడంతో.. అత్యవసర సేవలు ఎక్కడ లభిస్తున్నాయో తెలుసుకోవడం వారికి సులభంగా మారిందని యుక్రెయిన్ ఉప ప్రధాని మైఖైలో ఫెడోరోవ్ అన్నారు. యుక్రెయిన్ ఇప్పుడు బాహ్యప్రపంచానికి మరింత చేరువ అయింది..యుక్రెయిన్ లో స్టార్ లింక్ ఇంటర్నెట్ పనితనం అద్భుతంగా ఉంది, ఎలాన్ మస్క్ కి కృతఙ్ఞతలు అంటూ ఫెడోరోవ్ ట్వీట్ చేశారు.

Also read: China Aircraft Crash : చైనా పర్వతాల్లో కుప్పకూలిన విమానం..133మంది ప్రయాణీకులు మృతి?!