Heart Touching Video: యుక్రెయిన్ శరణార్థి బాలుడిని హత్తుకుంటూ తరగతికి ఆహ్వానించిన స్పెయిన్‌ చిన్నారులు

తరగతి గదిలోకి వెళ్లిన ఆ బాలుడు అక్కడ తన ఈడు పిల్లలను చూసి సంతోష పడుతుండగా.. అంతలోనే ఆ తరగతిలో చిన్నారి విద్యార్థులు ఆ బాలుడికి సాధార స్వాగతం పలికారు.

Heart Touching Video: యుక్రెయిన్ శరణార్థి బాలుడిని హత్తుకుంటూ తరగతికి ఆహ్వానించిన స్పెయిన్‌ చిన్నారులు

Ukraine

Heart Touching Video: యుక్రెయిన్ లో రష్యా యుద్ధం కొనసాగుతుంది. గత 26 రోజులుగా యుక్రెయిన్ నగరాల్లో బాంబుల మోత మోగించిన రష్యా సేనలు.. నగరాలకు నగరాలనే కూల్చివేశాయి. యుద్ధ నీటిని మరచి రష్యా సైనికులు..యుక్రెయిన్ లో మారణహోమం సృష్టిస్తున్నారు. రష్యా సైనికుల దాష్టికానికి వందలాది మంది ప్రజలు మృత్యుఒడికి చేరారు. యుద్ధం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో యుక్రెయిన్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళుతున్నారు. పొరుగు దేశాల సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాల్లో ప్రజలు తలదాచుకుంటున్నారు. ఈ శిబిరాల వద్ద యుక్రెయిన్ ప్రజల ఆర్తనాదాలు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారి జీవనఛిద్రాన్ని చూసిన ప్రజల హృదయాలు ద్రవించుకుపోతున్నాయి.

Also Read: Russia Condom Sales : యుద్ధం వేళ.. రష్యాలో భారీగా పెరిగిన కండోమ్ అమ్మకాలు

అటువంటి ఒక వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. యుక్రెయిన్ కు చెందిన ఐదేళ్ల శరణార్థి బాలుడు.. స్పెయిన్ లోని ఓ చిన్నారుల పాఠశాలలో చేరాడు. తరగతి గదిలోకి వెళ్లిన ఆ బాలుడు అక్కడ తన ఈడు పిల్లలను చూసి సంతోష పడుతుండగా.. అంతలోనే ఆ తరగతిలో చిన్నారి విద్యార్థులు ఆ బాలుడికి సాధార స్వాగతం పలికారు. బాలుడిని కౌగిలించుకుంటూ తమలో ఒకడిగా స్వీకరిస్తూ.. ఆ చిన్నారులు చూపిన సహృదయం అందరిని భావోద్వేగానికి గురిచేసింది. హృదయాన్ని హత్తుకునేలా ఉన్న ఈ దృశ్యాన్ని అక్కడున్న కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా..ఆస్ట్రియా దేశంలోని స్పెయిన్ రాయభారి ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Also read: Remarks on Indian Flag: జాతీయ జెండాపై ఆర్ఎస్ఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దృశ్యం చూస్తే కన్నీళ్లు ఆగడంలేదంటూ కొందరు కామెంట్స్ చేస్తే..పెద్దవారి నిర్ణయాత్మక తప్పులు చిన్నారుల హృదయాన్ని గాయపరచలేవంటు మరికొందరు కామెంట్స్ చేశారు. ఇదిలాఉంటే.. యుక్రెయిన్ లో రష్యా సృష్టిస్తున్న మారణహోమం కారణంగా ఇప్పటివరకు 902 మంది పౌరులు మృతి చెందారని, 1400 మందికి పైగా సాధారణ ప్రజలు గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం తెలిపింది. ఇంత జరుగుతున్నా రష్యా సేనలు వెనక్కు తగ్గేట్లు లేరని.. యుక్రెయిన్ నగరాలను కూల్చివేస్తున్నారని ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.