Remarks on Indian Flag: జాతీయ జెండాపై ఆర్ఎస్ఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

దేశంలోని హిందూ సమాజం మొత్తం కలిసి వస్తే మువ్వన్నెల జెండా స్థానంలో కాషాయ రంగు జెండా ఎగురుతుందని.. ఆర్ఎస్ఎస్ నేత కల్లడ్క ప్రభాకర్ భట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Remarks on Indian Flag: జాతీయ జెండాపై ఆర్ఎస్ఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

National Flag

Remarks on Indian Flag: భారత జాతీయ పతాకంపై ఆర్ఎస్ఎస్ నేత ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని హిందూ సమాజం మొత్తం కలిసి వస్తే మువ్వన్నెల జెండా స్థానంలో కాషాయ రంగు జెండా ఎగురుతుందని.. ఆర్ఎస్ఎస్ నేత కల్లడ్క ప్రభాకర్ భట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులంతా ఐక్యంగా ఉంటే ఇది సాధ్యపడుతుందని ప్రభాకర్ భట్ అన్నారు. హిందువులను ఏకం చేసే దిశగా సోమావారం కర్ణాటక రాష్ట్రంలో మంగుళూరులో విశ్వహిందు పరిషద్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ పాదయాత్రలో ప్రభాకర్ భట్ పాల్గొన్నారు. లక్షలాది మంది హిందువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆర్ఎస్ఎస్ నేత ప్రభాకర్ భట్ మాట్లాడుతూ త్రివర్ణ పతాకం కంటే ముందు మనదేశంలో బ్రిటిష్ జెండా ఎగిరిందని.. అంతకముందు భారతదేశానికి ఆకుపచ్చని నక్షత్రం, చంద్రుడుతో కూడిన జెండా ఉండేదని ప్రభాకర్ భట్ వివరించారు.

Also Read: AP Pegasus : పెగాసస్‌‌పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఇప్పుడు కూడా జాతీయ జెండా మార్పుకోసం..రాజ్యసభలో ఓటింగ్ నిర్వహించి అత్యధిక శాతం ఓట్లు కూడగట్టుకుంటే ప్రస్తుతం జెండాను మార్చుకోవచ్చని ప్రభాకర్ భట్ అన్నారు. అయితే ప్రస్తుత జెండాను ఎందుకు మార్చాలో వివరణ ఇవ్వని ప్రభాకర్ భట్.. ఇపుడున్న త్రివర్ణ పతాకాన్నీ తాను గౌరవిస్తున్నామని అన్నారు. దేశంలో ఆనాడు మైనార్టీ వర్గాల మెప్పుపొందేందుకు త్రివర్ణ పతాకాన్ని ఆమోదించారని.. అదే విధంగా జాతీయ గీతంగా వందేమాతరాన్ని సైతం తిరస్కరించి జనగనమణనకు ఆమోదం తెలిపారని ప్రభాకర్ భట్ అన్నారు. ఇక కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతున్న హిజాబ్ వివాదంపై ప్రభాకర్ భట్ మాట్లాడుతూ..పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి కొన్ని అతివాద సంస్థల మాయ మాటలతో విద్యార్థులు హిజాబ్ వివాదాన్ని లేవనెత్తారని అన్నారు.

Also Read: India – Australia: భారత్ – ఆస్ట్రేలియా మధ్య దృఢమైన బంధం పెనవేసుకుంది: ప్రధాని మోదీ

సానియా మీర్జా, సారా అబూబకర్ వంటి ముస్లిం మహిళలు బురఖాను వ్యతిరేకిస్తుంటే.. చదువుకుంటున్న నేటితరం ముస్లిం విద్యార్థినిలు..హిజాబ్ పై పట్టుబట్టడం వింతగా ఉందని ప్రభాకర్ భట్ అన్నారు. విద్యార్థినిలకు నిజంగా చదువుపై ఆసక్తి ఉండి భవిష్యత్తుపై మంచి ఆశయాలు ఉంటే హిజాబ్ అంశం ఒక సమస్యే కాదని ఆర్ఎస్ఎస్ నేత ప్రభాకర్ భట్ పేర్కొన్నారు. హిజాబ్ కంటే పుస్తకం భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తుందని అందరు కలిసికట్టుగా చదువుకోవాలని ప్రభాకర్ భట్ అన్నారు.

Also Read: AAP Punjab: పంజాబ్ నుంచి ఐదుగురు రాజ్యసభ ఎంపీలను నామినేట్ చేసిన ఆమ్ ఆద్మీ