AP Pegasus : పెగాసస్‌‌పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

పెగాసస్ పై సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని ఎక్కువ సభ్యులు కోరుతున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు...

AP Pegasus : పెగాసస్‌‌పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

Ap Jagan

CM Jagan Government : పెగాసస్ పై సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని ఎక్కువ సభ్యులు కోరుతున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. రెండు రోజుల్లో కమిటీ సభ్యులను ప్రకటిస్తామని తెలిపారు. టీడీపీ హయాంలో జరిగిన ఇతర అక్రమాలపైనా విచారణ జరగాలని వైసీపీ సభ్యులు కోరారు. పెగాసస్ అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

Read More : ఏపీలో పెగాసస్‌ ప్రకంపనలు

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ తెనెతుట్టేను కదిపారు. చంద్రబాబు నాయుడు హయంలో పెగాసస్ సాప్ట్ వేర్ ని కొనుగోలు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఆనాడు తాము ప్రతిపక్షంగా ఉన్న సమయంలో పెగాసస్ ను ఉపయోగించి తమ నేతలకు సంబంధించిన కాల్స్ అన్నింటినీ రికార్డ్ చేశారని ప్రభుత్వం ప్రస్తుతం ఆరోపణలు చేస్తోంది. పూర్తి ఆధారాలున్నాయంటూ పేర్కొంటోంది. దీనిపై సోమవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. వైసీపీ సభ్యులు దీనిపై మాట్లాడారు. చివరకు స్పీకర్ హౌస్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

Read More : Pegasus Spyware : తెరపైకి మరోసారి పెగాసస్.. సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు!

గత కొన్ని రోజులుగా పెగాసస్ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. పెగాసస్ సాప్ట్ వేర్ ను కొనుగోలు చేయమని అడిగింది కానీ..తమ ప్రభుత్వం దానిని తిరస్కరించిందన్నారు. తాము కొనుగోలు చేసి ఉంటే దానికి సంబంధించిన రికార్డులు ప్రభుత్వం దగ్గర ఉండి ఉంటాయని చెక్ చేసుకోవచ్చన్నారు. ఎక్కడా, ఎప్పుడు అక్రమ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడింది లేదన్నారు.

2019లో వాట్సాప్ ద్వారా పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. 100 మంది ప్రముఖ వ్యక్తుల గూఢచర్యం గురించి చర్చ జరిగింది, ఆ తర్వాత పెగాసస్ గూఢచర్యంపై పార్లమెంటులో చాలా దుమారం చెలరేగింది. పెగాసస్ కేసు జూలై 2021లో మళ్లీ తెరపైకి వచ్చింది. ‘ది వైర్‌’ పెగాసస్‌ స్కామ్‌ని తొలిసారి వెలుగులోకి తీసుకుని వచ్చింది. రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులపైకి కొన్ని దేశాలు పెగాస్‌సను ప్రయోగిస్తున్నాయంటూ ఫార్‌బిడెన్‌ స్టోరీస్‌ అనే కన్సార్షియం ఆఫ్‌ న్యూస్‌ ఆర్గనైజేషన్స్‌ గ్రూప్.. పెగాసస్‌పై వరుస కథనాలు ప్రచురించింది. వీటి ఆధారంగా ‘ది వైర్‌’ భారత్‌లో కూడా ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది.