India – Australia: భారత్ – ఆస్ట్రేలియా మధ్య దృఢమైన బంధం పెనవేసుకుంది: ప్రధాని మోదీ

భారత్ - ఆస్ట్రేలియా మధ్య దృఢమైన బంధం పెనవేసుకుందని రానున్న రోజుల్లో మరింత స్నేహపూర్వకంగా ఆ బంధం కొనసాగుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

India – Australia: భారత్ – ఆస్ట్రేలియా మధ్య దృఢమైన బంధం పెనవేసుకుంది: ప్రధాని మోదీ

Australia India

India – Australia: భారత్ – ఆస్ట్రేలియా మధ్య దృఢమైన బంధం పెనవేసుకుందని రానున్న రోజుల్లో మరింత స్నేహపూర్వకంగా ఆ బంధం కొనసాగుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరీసన్ తో ప్రధాని మోదీ వర్చువల్ గా సమావేశం అయ్యారు. ఈసందర్భంగా ఇరు దేశాల మధ్య స్నేహ, దౌత్యపరమైన అంశాలు సహా.. యుక్రెయిన్ – రష్యా యుద్ధం, క్వాడ్ కూటమి గురించి ఇరువురు ప్రధానులు చర్చించారు. క్వాడ్ కూటమిలో మరో సభ్యదేశం జపాన్ ప్రధాని కీషీదా రెండు రోజుల భారత పర్యటన ముగిసిన మరుసటి రోజే భారత్ – ఆస్ట్రేలియా ప్రధానులు సమావేశం అవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read:Telangana : బీజేపీ ట్రాప్ లో పడొద్దు..ఢిల్లీ వేదికగా రైతుల సమస్యలపై ఉద్యమం చేద్దాం..కేంద్రం మెడలు వంచుదాం : కేసీఆర్

ఆస్ట్రేలియా ప్రధాని మోరీసన్ తో సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..రెండు దేశాల మధ్య చివరగా జరిగిన వర్చువల్ సమ్మిట్ మన సంబంధాన్ని “సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా” లాంఛనప్రాయం చేసిందని, నేటి ఈ వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను” అని అన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం మన సంబంధాలను క్రమం తప్పకుండా సమీక్షించడానికి ఒక నిర్మాణాత్మక వ్యవస్థను సిద్ధం చేస్తుందని మోదీ ఆకాంక్షించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడ్డాయని అన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ మరియు భద్రత, విద్య మరియు ఆవిష్కరణలు, సైన్స్, టెక్నాలజీ వంటి రంగాలలో భారత్ సన్నిహితంగా సహకరిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈసహకారం ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, సమగ్రతను కాపాడడంలో భారత్ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది మోదీ అన్నారు.

Also Read: China Aircraft Crash : చైనా పర్వతాల్లో కుప్పకూలిన విమానం..133మంది ప్రయాణీకులు మృతి?!

ఈ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరీసన్ మాట్లాడుతూ..యుక్రెయిన్ రష్యా యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు. యుక్రెయిన్ లో సాధారణ ప్రజల మరణాలకు రష్యా బాధ్యత వహించాలని అన్నారు. క్వాడ్ సభ్యదేశాలైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా.. యుక్రెయిన్ అంశంపై ఇటీవల చర్చిన విధంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో యుక్రెయిన్ ప్రభావం, తదనంతర పరిణామాలు, సభ్య దేశాల మధ్య బంధాల బలోపేతం, ఇతర సమస్యలపై చర్చించేందుకు చక్కని అవకాశం లభించినట్లు మోరీసన్ పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంత అభివృద్ధి తమ ప్రధాన ధ్యేయమైనప్పటికీ ప్రస్తుతం యూరోప్ లో నెలకొన్న పరిస్థితులు తమను కలవరం పెడుతున్నాయని మోరీసన్ ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: Ukraine students: యుక్రెయిన్ విద్యార్థులపై చదువుపై కేంద్రం ఫోకస్

ఇదిలాఉంటే భారత్ నుంచి దొంగిలించబడి ఆస్ట్రేలియా చేరుకున్న పురాతన విగ్రహాలను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల భారత్ కు తిరిగి అప్పగించిన విషయమై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని మోరీసన్ కు కృతజ్ఞతలు తెలిపారు. వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన విగ్రహాలు భారత్ లోని రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల నుంచి దొంగిలించబడి అక్రమ మార్గాన ఆస్ట్రేలియా చేరుకున్నాయని.. వాటిని తిరిగి భారత్ కు అప్పగించిన ఆస్ట్రేలియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంటూ మోదీ తన సందేశాన్ని వినిపించారు.