Ukraine students: యుక్రెయిన్ విద్యార్థులపై చదువుపై కేంద్రం ఫోకస్

యుక్రెయిన్ నుంచి తిరిగొచ్చేసిన విద్యార్థుల భవిష్యత్‌పై కేంద్రం ఫోకస్ పెంచింది. చదువుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఆలోచనలు చేస్తుంది కేంద్రం.

Ukraine students: యుక్రెయిన్ విద్యార్థులపై చదువుపై కేంద్రం ఫోకస్

Ukraine Students

Ukraine students: యుక్రెయిన్ నుంచి తిరిగొచ్చేసిన విద్యార్థుల భవిష్యత్‌పై కేంద్రం ఫోకస్ పెంచింది. చదువుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఆలోచనలు చేస్తుంది కేంద్రం. ఇప్పటికే భారత విద్యార్థుల తరలింపు, వారి విద్య గురించి సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణ నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగానే అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ 22వేల 500 మంది విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చామని తెలిపారు. విద్యార్థుల చదువు గురించి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించగా.. ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు.

తరలింపు పూర్తి కావడంతో చదువు గురించి ఆలోచన చేస్తున్నామని కేంద్రం స్పష్టం చేయడంతో జస్టిస్ రమణ ధర్మాసనం విచారణను ముగించింది.

Read Also :యుక్రెయిన్ వదిలిపోతూ..సూట్‌కేసుల నిండా డబ్బుల కట్టలతో దొరికిపోయిన మాజీ ఎంపీ భార్య

ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించింది రష్యా. అలా రోజు రోజుకు యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోంది. నగరాలను నేలమట్టం చేస్తోంది. హైపర్ సోనిక్ క్షిపణులను కూడా ప్రయోగిస్తోంది. మరోవైపు వల్ల యుక్రెయిన్ నుంచి ఎంతోమంది ప్రజలు పొరుగు దేశాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు.

ఇప్పటి వరకు యుక్రెయిన్ నుంచి 10 మిలియన్ల మంది వలస వెళ్లినట్లుగా లెక్కలు తెలియజేస్తున్నాయి. వీరిలో 3.4 మిలియన్ల మంది పొరుగు దేశాలైన పోలాండ్, స్లోవేకియా, రొమేనియా, హంగేరీ వంటి దేశాలకు వెళ్లారు. మరోవైపు తమ ప్రాణాలు పోయినా ఫరవాలేదనుకుంటున్న యుక్రెయిన్ పౌరులు తమ ఆత్మీయులను దేశాల సరిహద్దులు దాటించి తాము మాత్రం యుద్ధంలో పాల్గొంటున్నారు. అలా రష్యా యుద్ధంలో యుక్రెయిన్‌లో వందలాది మంది పౌరులు మరణిస్తున్నారు.

కానీ యుక్రెయిన్ కూడా యుద్ధంలో ఏమాత్రం తగ్గటంలేదు. శక్తికి మించి పోరాడుతోంది. అలా యుద్ధంలో రష్యా సేనలను అంతమొందిస్తోంది. ఇప్పటి వరకు 14 వేల మంది రష్యన్ సైనికులను హతమార్చినట్టు యుక్రెయిన్ వెల్లడించింది.