Chernobyl Danger : చెర్నోబిల్ డేంజర్ బెల్స్.. యుక్రెయిన్‌తో పాటు సరిహద్దు దేశాలకు పొంచి ఉన్న ముప్పు

యుక్రెయిన్ తో పాటు దాని సరిహద్దు యూరప్ దేశాలకు చెర్నోబిల్ అణు ధార్మికత ముప్పు పొంచి ఉందని ఉక్రెయిన్ ప్రభుత్వ అణు సంస్థ..(Chernobyl Danger)

Chernobyl Danger : చెర్నోబిల్ డేంజర్ బెల్స్.. యుక్రెయిన్‌తో పాటు సరిహద్దు దేశాలకు పొంచి ఉన్న ముప్పు

Chernobyl Danger (1)

Chernobyl Danger : రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. మూడు వారాలు దాటింది. ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. యుక్రెయిన్ పై రష్యా సేనలు బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అనుకున్నది సాధించేవరకు వెనక్కి తగ్గేది లేదని రష్యా తేల్చి చెప్పింది.

ఇది ఇలా ఉంటే.. యుక్రెయిన్ లో డేంజర్ బెల్స్ మోగాయి. యుక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు వెన్నులో వణుకుపుట్టించే వార్త చెప్పాయి. యుక్రెయిన్ తో పాటు దాని సరిహద్దు యూరప్ దేశాలకు చెర్నోబిల్ అణు ధార్మికత ముప్పు పొంచి ఉందని ఉక్రెయిన్ ప్రభుత్వ అణు సంస్థ ఎనర్జో ఆటమ్ ప్రకటించింది. రష్యా ఆక్రమిత చెర్నోబిల్ ప్లాంట్ చుట్టుపక్కల రేడియేషన్ ను లెక్కించే, పర్యవేక్షించే వ్యవస్థలేవీ పనిచేయడం లేదని, కార్చిచ్చులను ఆర్పివేసే అగ్నిమాపక సేవలూ అందుబాటులో లేవని ఆందోళన వ్యక్తం చేసింది.(Chernobyl Danger)

Elon Musk: యుక్రెయిన్ లో ఇంటర్నెట్ కోసం 5,000 స్టార్ లింక్ టెర్మినల్స్ యాక్టివేట్

రష్యా ఆక్రమణల నేపథ్యంలో చెర్నోబిల్ అణు కేంద్రం చుట్టూ నిషేధిత ప్రాంత జాబితాలోని అడవుల్లో రేడియేషన్ మానిటరింగ్ సిస్టమ్స్ పనిచేయట్లేదని తెలిపింది. ఇప్పుడు అడవుల్లో మంటలు చెలరేగే కాలమని, కార్చిచ్చులు రేగితే ఆర్పేందుకు ఫైర్ ఫైటర్ సర్వీసులు అందుబాటులో లేవంది.

దాని వల్ల రేడియేషన్ స్థాయులను గుర్తించడం కష్టమవుతుందని తెలిపింది. ఫలితంగా ఉక్రెయిన్ తో పాటు ఇతర దేశాలకూ రేడియేషన్ ముప్పు చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ప్రస్తుతం యుక్రెయిన్ సిబ్బంది చెర్నోబిల్ ప్లాంట్ లోనే పని చేస్తున్నారని తెలిపింది. కాగా, గత నెల 24న ఈ కేంద్రాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది.

”రేడియో ధార్మికత స్థాయిని తెలిపేందుకు చెర్నోబిల్‌ అణు విద్యుత్తు కేంద్రం చుట్టూ ఏర్పాటు చేసిన యంత్రాలు పని చేయడం మానేశాయి. రేడియో ధార్మికత వ్యాప్తిని నియంత్రించే సామర్థ్యాన్ని ఈ కేంద్రం కోల్పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల యుక్రెయిన్‌లోనే కాకుండా దేశ సరిహద్దుల వెలుపల నెలల తరబడి రేడియో ధార్మికత ప్రభావం కనిపించే అవకాశం ఉంది” అని ఉక్రెయిన్‌ అణు నియంత్రణ సంస్థ తెలిపింది.

Russia Condom Sales : యుద్ధం వేళ.. రష్యాలో భారీగా పెరిగిన కండోమ్ అమ్మకాలు

క్షిపణిల వర్షం కురిపిస్తున్నా.. బాంబులు బెంబేలెత్తిస్తున్నా యుక్రెయిన్‌ సైనికులు వెనక్కి తగ్గడం లేదు. దీంతో రష్యా కొత్త వ్యూహాలకు తెరలేపింది. మరియుపోల్‌లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కారిడార్లు ఏర్పాటు చేస్తామని, దీనికి బదులుగా ఉక్రెయిన్‌ సేనలు ఆయుధాలు విడిచి, మరియుపోల్‌ను అప్పగించాలని డిమాండ్‌ చేసింది. రష్యా ప్రతిపాదనను ఉక్రెయిన్‌ తోసిపుచ్చింది. తమ నగరాలను, దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అప్పగించేది లేదని తేల్చిచెప్పింది. దీంతో పుతిన్‌ సేనలు మరింతగా రెచ్చిపోయాయి.

Russian President Putin : ప్రాణభయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌

సోమవారం రాత్రి మరియుపోల్‌పై ప్రతి 10 నిమిషాలకొకసారి బాంబుల వర్షాన్ని కురిపించాయి. అంతకుముందు కీవ్‌లోని ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌పై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ ఘటనలో 8 మంది మరణించారు. పశ్చిమ దేశాలు పంపిన ఆయుధాలు, టర్కీ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లతో రష్యా బలగాలపై యుక్రెయిన్‌ సేనలు పోరాడుతున్నాయి.

వాస్తవానికి బెలారస్‌ నుంచి కీవ్‌ పదుల కిలోమీటర్ల దూరంలో ఉండటంతో రష్యా యుద్ధం మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే ఉక్రెయిన్‌ రాజధానిని వశపర్చుకొని ప్రభుత్వాన్ని మార్చేస్తుందని భావించారు. కానీ, ఆ అంచనాలు నిజం కాలేదు. దాదాపు మూడు వారాలుగా భీకర గెరిల్లా యద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే 14వేల మందికి పైగా రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్‌ రక్షణశాఖ వెల్లడించింది.

మరోపక్క రష్యా దళాలు ఉక్రెయిన్‌ మౌలిక సదుపాయాలు వాడుకోకుండా అడ్డుకుంటున్నారు. వంతెనలు, విమానాశ్రయాల్లో లెక్కలేనన్ని ల్యాండ్‌మైన్లు పాతిపెట్టారు. రష్యా దళాలు వీటిని వాడుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. యుద్ధం ముగిశాక కూడా వీటిని తొలగించాలంటే కొన్నేళ్లు పట్టవచ్చని అంచనా. మరోపక్క ఆంక్షలు తీవ్రం కావడంతో మిత్రదేశాలు రష్యాకు దూరంగా జరుగుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పుతిన్‌ ప్లాన్‌-బిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.