Brazil : ఆసుపత్రిలో చెంచాను మైక్‌గా పట్టుకుని పాట పాడిన బుడ్డోడు

అభిమాన పాటను ఆస్వాదిస్తూ...ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. హృదయాలను తాకుతోంది..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Brazil : ఆసుపత్రిలో చెంచాను మైక్‌గా పట్టుకుని పాట పాడిన బుడ్డోడు

Brazil

Little Boy Sings & Dances : ఓ బుడ్డోడు చెంచాను మైక్ గా పట్టుకుని…టీవీలో వస్తున్న పాటకు అనుగుణంగా..అతను పెదవులు కదపడం… సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ గా మారింది. ఆనందంగా స్టెప్పులు కూడా వేశాడు. ఇందులో వింత ఏముంది ? అని అంటారు కదా. ఆ బుడ్డోడు పాట పాడింది ఆసుపత్రిలో. ఆసుపత్రిలో బెడ్ పై నిలబడి..బుడిబుడి అడుగులతో తనకు తోచిన విధంగా స్టెప్పులేశాడు.

Read More : Plane Crash : రష్యాలో కుప్పకూలిన విమానం..16మంది మృతి

అభిమాన పాటను ఆస్వాదిస్తూ…ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. హృదయాలను తాకుతోంది..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన బ్రెజిల్ లో చోటు చేసుకుంది. ఈ వ్యాధి కారణంగా..చికిత్స పొందుతూ..భయం లేకుండా ఉన్న బుడ్డోడి వీడియోను చూసిన నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఈ ఘటన బ్రెజిల్ లో చోటు చేసుకుంది. బ్రెజిల్ లోని ఓ ఆసుపత్రిలో మిగ్యుల్ అనే బుడ్డోడు గ్యాస్ట్రో ఎంటెరిటిస్ వ్యాధికి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు. కానీ..అతనికి ఓ పాట అంటే తెగ ఇష్టం.

Read More : Face Book Friend Cheating : ఫేస్‌బుక్ లో పరిచయం….రూ. 27లక్షలు దోచేసిన యువతులు

అది వచ్చినప్పుడల్లా..డ్యాన్స్ చేస్తుంటాడు. ఆసుపత్రిలో బెడ్ పైనే ఈ పిల్లాడు డ్యాన్స్ చేస్తున్నాడు. టీవీలో వచ్చిన పాట పాడకుండా..డ్యాన్స్ చేయకుండా మిగ్యుల్ ను ఆపడం ఎవరివల్ల కావడం లేదంట. ఓ స్పూన్ ను మైక్ గా మలుచుకుని..టీవీ చూసుకుంటూ…అతని భాషలో పాడుతున్నాడు. చికిత్స పొందుతున్నా ఏ మాత్రం భయం లేకుండా..ఓ పాప్ సింగర్ లా పాడుతూ.. ఆనందంగా ఉన్న ఇతడిని చూసి మెచ్చుకుంటున్నారు. GoodNewsCorrespondent ట్విట్టర్ వేదికగా ఈ వీడియో పోస్టు అయ్యింది.