Face Book Friend Cheating : ఫేస్‌బుక్ లో పరిచయం….రూ. 27లక్షలు దోచేసిన యువతులు

ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన యువతితో... స్నేహంగా మాట్లాడి రూ.27 లక్షలు  మోసపోయిన విశాఖ యువకుడి కధ వెలుగులోకి వచ్చింది.

Face Book Friend Cheating : ఫేస్‌బుక్ లో పరిచయం….రూ. 27లక్షలు దోచేసిన యువతులు

Face Book Cheating

Updated On : October 10, 2021 / 1:33 PM IST

Face Book Friend Cheating :  ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన యువతితో… స్నేహంగా మాట్లాడి రూ.27 లక్షలు  మోసపోయిన విశాఖ యువకుడి కధ వెలుగులోకి వచ్చింది. విశాఖలోని అచ్యుతాపురం  సెజ్‌లో పని చేస్తున్న రవిప్రసాద్ గుప్త అనే యువకుడికి   కార్ల మోర్గాన్ అనే పేరుతో ఒక యువతి ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. రవిప్రసాద్ యాక్సెప్ట్ చేశాడు. అనంతంరం ఇద్దరూ చాటింగ్ చేసుకోవటం ప్రారంభించారు.

Also Read : Priest Molests Minor Girl : మైనర్ బాలికపై గుళ్లో పూజారి అత్యాచార యత్నం

ఆ తర్వాత ఫోన్ నెంబర్లు ఎక్సేంజ్ చేసుకుని గంటల తరబడి మాట్లాడుకోవటం మొదలెట్టారు. ఈ క్రమంలో కార్ల మోర్గాన్ ఇండియా వస్తాను… మనిద్దరం కలుద్దాం అని చెప్పింది. విదేశీ స్నేహితురాలు వస్తోందనే  సంతోషంతో సరే అన్నాడు గుప్త. అందులో భాగంగా   ఫ్లైయిట్ టికెట్ల్  వాట్సప్ లో పోస్ట్ చేసిన యువతి  తన వద్ద ఇండియా రావటానికి డబ్బులు తక్కువగా ఉన్నాయని..ఢిల్లీలో ఇమ్మిగ్రేషన్ కోసం రూ. 68 వేలు కావాలని కోరింది.

రవి ప్రసాద్ ఆ మొత్తాన్ని తన  ఫేస్‌బుక్ ఫ్రెండ్‌కు  ట్రాన్సఫర్ చేశాడు. తర్వాత కొద్ది రోజులకు ఢిల్లీ ఇమ్మిగ్రేషన్ అధికారి  పేరుతో ఒక మహిళ  ఫోన్ చేసి కార్ల మోర్గాన్ ఇమ్మిగ్రేషన్ కోసం మరికొంత ఫీజు చెల్లించాలని కోరింది. ఈ రకంగా యువతులిద్దరూ రవిప్రసాద్ వద్దనుంచి ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 14, రెండు వారాల లోపు రూ.27 లక్షలు వసూలు చేశారు.

Also Read : Green Channel : అవయవదానం : మదురై నుంచి చెన్నైకి 76 నిమిషాల్లో ఊపిరి తిత్తులు
ఆ తర్వాత నుంచి సరిగా ఫోన్లకు సమాధానం ఇవ్వని  ఇద్దరు యువతుల ఫోన్ నెంబర్లు క్రమంగా స్విఛ్చాఫ్ అయ్యాయి.  దీంతో మోసపోయానని గ్రహించిన రవిప్రసాద్ గుప్త అచ్యుతాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.