Russia-Ukraine war: రష్యాకు భారీ షాక్.. హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ నుంచి తొలగించిన ఐరాస

రష్యాకు ఐక్యరాజ్య సమితిలో (ఐరాస)లో భారీ షాక్ తగిలింది. ఉక్రెయిన్ లో తమ బలగాలతో విరుచుకుపడుతున్న రష్యాకు తగిన గుణపాఠం చెప్పేందుకు ఒక్కో అడుగు పడుతున్నాయి. ఈ క్రమంలో మానవ హక్కుల...

Russia-Ukraine war: రష్యాకు భారీ షాక్.. హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ నుంచి తొలగించిన ఐరాస

Russia Ukraine War

Russia-Ukraine war: రష్యాకు ఐక్యరాజ్య సమితిలో (ఐరాస)లో భారీ షాక్ తగిలింది. ఉక్రెయిన్ లో తమ బలగాలతో విరుచుకుపడుతున్న రష్యాకు తగిన గుణపాఠం చెప్పేందుకు ఒక్కో అడుగు పడుతున్నాయి. ఈ క్రమంలో మానవ హక్కుల పరిరక్షణ మండలి (హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) నుండి రష్యాను తొలగిస్తున్నట్లు ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. ఉక్రెయిన్ నగరాల్లో రష్యా సైనికులు పాల్పడిన దురాగతాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా బుచాతో పాటు కీవ్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో రష్యన్ సైనికుల నరమేధానికి సంబంధించిన ఆధారాలు బయటపడటంతో ప్రపంచ వ్యాప్తంగా రష్యా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

NATO : యుక్రెయిన్‌కు నాటో భారీ షాక్‌.. బలగాలు పంపట్లేదని ప్రకటన

ఈ క్రమంలో మాన హక్కుల కౌన్సిల్ నుంచి రష్యాను బహిష్కరించాలని కోరుతూ ఐరాస సాధారణ సభలో అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది. గురువారం జరిగిన UN జనరల్ అసెంబ్లీ సమావేశంలో 193 మంది సభ్యులు ఉండగా 93మంది అమెరికా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. 24 మంది వ్యతిరేకంగా ఓటేయగా, 58 దేశాలు ఈ ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. ఈ ఓటింగ్ లో మూడింట రెండు వంతుల మెజారిటీ అమెరికా తీర్మానానికి అనుకూలంగా రావడంతో ఐరాస మానవ హక్కుల మండలి నుంచి రష్యా బహిష్కరణకు గురైంది.

russia ukraine war : రష్యాపై ఆంక్షలు కఠినతరం.. టార్గెట్ పుతిన్ డాటర్స్..

ఇదిలా ఉంటే ఐరాస సాధారణ సభలో రష్యాకు అనుకూలంగా చైనా, మాస్కో మిత్రపక్షం, ఇరాన్, మాజీ సోవియట్ రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్, కమ్యూనిస్ట్ క్యూబా, అలాగే బెలారస్, సిరియాలు ఓటు వేశాయి. మరోవైపు భారత్ తో సహా 58 దేశాల్లో ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. వీటిలో భారత్, బ్రెజిల్, మెక్సికో, సెనెగల్, దక్షిణాఫ్రికా తదితర దేశాలు ఉన్నాయి. అయితే ఓటింగ్ కు దూరంగా ఉండటం పై భారత రాయబారి TS తిరుమూర్తి మాట్లాడుతూ.. అమాయక మానవ జీవితాలు ప్రమాదంలో ఉన్నప్పుడు, దౌత్యం మాత్రమే ఆచరణీయమైన ఎంపికగా ప్రబలంగా ఉండాలని తెలిపాడు.

Russia-ukraine war : యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రష్యాను శిక్షించండి..లేదంటే ఐరాసను మూసేయండి : జెలెన్‌స్కీ

ఇదిలా ఉంటే 2011లో తొలిసారిగా లిబియాను మానవ హక్కుల మండలి నుంచి బహిష్కరించింది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు (P5+1) చైనా, ఫ్రాన్స్‌, రష్యా, యూకే, అమెరికాతో పాటు అదనంగా జర్మనీ కూడా ఉంది. ఈ క్రమంలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాల్లో ఐరాసలోని ఒక ఉన్నత మండలి నుంచి తొలగించబడిన తొలిదేశం రష్యాగా నిలించింది.

హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ నుండి రష్యాను తొలగించడం పట్ల ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ట్విటర్ లో స్పందించారు. మానవ హక్కులను కాపాడే లక్ష్యంతో ఉన్న యూఎన్ సంస్థల్లో యుద్ధ నేరస్థులకు చోటు లేదని అన్నాడు. సంబంధిత UNGA తీర్మానానికి మద్దతిచ్చిన, చరిత్రకు మంచివైపును ఎంచుకున్న అన్ని సభ్య దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు.