Russia-ukraine war : యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రష్యాను శిక్షించండి..లేదంటే ఐరాసను మూసేయండి : జెలెన్‌స్కీ

యుద్ధ నేరాలను పాల్పడుతున్న రష్యాను శిక్షించండి..లేదంటే ఐరాసను మూసేయండి అంటూ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ యూఎన్ సమావేశంలో ఆగ్రహం ఆవేదన వ్యక్తంచేశారు.

Russia-ukraine war : యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రష్యాను శిక్షించండి..లేదంటే ఐరాసను మూసేయండి : జెలెన్‌స్కీ

Russia Ukraine War

‘యుద్ధం పేరుతో మాదేశంపై రష్యా చేస్తున్న దురాగతాలను శిక్షించండీ..లేదంటే ఐక్యరాజ్యసమితిని మూసేయండి’అంటూ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆగ్రహం, ఆవేదనతో ఐరాస భద్రతా మండలి(UNITED NATIONS SECURITY COUNCIL) సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సవాల్ విసిరనట్లుగా మాట్లాడారు. యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించాక జెలెన్ స్కీ తొలిసారి మంగళవారం ( ఏప్రిల్ 5,2022) మాట్లాడుతూ ఈ ఆవేదనపూరిత ప్రసంగం చేశారు. ఇకనైనా రష్యా యుద్ధాన్ని ఆపాలని దానికి ఐక్యరాజ్యసమితి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. దేశ రాజధాని కీవ్ కు సమీపంలో ఉన్న బుచా నగరంలో రక్తమోడుతూ, కాలి బుగ్గిగా మారి కనిపించిన శవాల కుప్పలకు సంబంధించిన వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు జెలెన్‌స్కీ. ఐక్యరాజ్యసమితి తక్షణమే స్పందించాలని లేదంటే మొత్తంగా మిమ్మల్ని మీరు పూర్తిగా రద్దు చేసుకోండి అంటూ ఐరాస భద్రతా మండలిని ఉద్దేశించి ఆవేశంగా ప్రసంగించారు జెలెన్‌స్కీ.

Also read : Russian Troops Die : యుద్ధంలో 18,500 మంది రష్యా సైనికులను హతమార్చామన్న యుక్రెయిన్ ఆర్మీ

ఐసిస్‌ (ఉగ్రవాద సంస్థ)కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో రష్యా బలగాలు యుక్రెయిన్‌లో మారణహోమానికి పాల్పడ్డాయ ఈ సందర్భంగా జెలెన్ స్కీ ఐకాసాకు వెల్లడించారు. రష్యాను వెలివేయాలని డిమాండ్‌ చేశాడు. తద్వారా వీటో అధికారాన్ని రష్యాకు లేకుండా చేయాలని కోరారు. ఒకవేళ ప్రత్యామ్నాయం, ఇతర దారులు లేకుంటే గనుక.. మొత్తంగా భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితిలనే రద్దు చేసుకోవాలంటూ కోరారు.

యుక్రెయిన్ పై రష్యా సాగించిన దురాగతాలను నిరోధించడంలో ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఘోరంగా విఫలమైందని జెలెన్‌స్కీ ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణం స్పందించి రష్యాను శిక్షించాలని.. అది చేయలేకుంటే ఐరాసను రద్దు చేసుకోవాలని వ్యాఖ్యానించారు. రష్యా సేనలు యుక్రెయిన్ లో సాధారణ ప్రజలను ఉద్ధేశపూర్వకంగానే అత్యంత దారుణంగా చంపేశారు అని ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ సమావేశంలో జెలెన్ స్కీ తీవ్ర ఆవేదన..ఆవేశంతో ప్రసంగిస్తూ..‘వారు రష్యా సైనికులు, ఉగ్రవాదులు వేరు కాదు అన్నట్లుగా సాధారణ ప్రజలను కూడా అత్యంత పాశవికంగా హత్యలు చేస్తున్నారని..రష్యా బలగాలు ఉగ్రవాదులను మించిపోయారు అంటూ ఆరోపించారు.మా దేశంలో రష్యా సైనికులు సాగించిన అరాచకాలు, ఐసిస్‌ ఉగ్రవాదుల దారుణాలకు మధ్య పెద్ద తేడా ఏమీ లేదన్నారు. భద్రతా మండలిలో వీటో అధికారం ఉన్న దేశంతో తాము పోరాడుతున్నామని..అన్నారు.

Russia-Ukraine War : శవాల దిబ్బగా యుక్రెయిన్ లోని బుచా నగరం.. వందలాది మంది ఊచకోత..ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

ఐరాసలో జెలెన్ స్కీ వాదనలను రష్యా అంబాసిడర్‌ వసెలీ నెబెంజియా తీవ్రంగా ఖండించారు. నేరుగా యుక్రెయిన్‌ అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ.. రష్యా బలగాలు దమనకాండను పాల్పడినట్లు ఎటువంటి ఆధారాలు లేవు, ఉంటే సభకు సమర్పించండి అంటూ సవాల్ విసిరినట్లుగా వ్యాఖ్యానించారు. ఇదంతా యుక్రెయిన్‌ ఆడుతున్న నాటకం అంటూ తిరిగి ఆరోపించారు. ఇదిలా ఉంటే మరోవైపు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ భద్రతా మండలిలో ఈ పరిణామాలపై స్పందిస్తూ..‘ఇప్పటికే రష్యా,యుక్రెయిన్ పై చేస్తున్న యుద్ధం వల్ల 74 దేశాలు, బిలియన్‌న్నర మంది సంక్షోభంలోకి కూరుకుపోయారని వెల్లడించారు. ఈ యుద్ధం ఇప్పటికైనా ఆపాలని పిలుపు ఇచ్చారు.