russia ukraine war : రష్యాపై ఆంక్షలు కఠినతరం.. టార్గెట్ పుతిన్ డాటర్స్..

ఉక్రెయిన్లో నరమోధాన్ని సృష్టిస్తున్న రష్యాపై యురోపియన్ యూనియన్ఆంక్షలను కఠినతరం చేస్తోంది. బుచాలో రష్యా మిలటరీ సృష్టించిన దారుణాలు వెలుగులోకి రావడంతో ప్రపంచ దేశాలు తీవ్రంగా...

russia ukraine war : రష్యాపై ఆంక్షలు కఠినతరం.. టార్గెట్ పుతిన్ డాటర్స్..

Puthin Daughters

russia ukraine war : ఉక్రెయిన్ లో నరమోధాన్ని సృష్టిస్తున్న రష్యాపై ఈయూ (యురోపియన్ యూనియన్) ఆంక్షలను కఠినతరం చేస్తోంది. బుచాలో రష్యా మిలటరీ సృష్టించిన దారుణాలు వెలుగులోకి రావడంతో ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కాలిపోయి, పేరుకుపోయిన మృతదేహాలు అక్కడి ఘోరానికి నిదర్శనంగా నిలిచాయి. కణతలకు తుపాకీ ఎక్కుపెట్టి కాల్చినట్లు పలు మృతదేహాలపై ఆనవాళ్లు ఉన్నాయి. బుచా ఘటనపై పోప్ ఫ్రాన్సిస్ ఖండించారు. మారణహోమాన్ని చవిచూసిన బుచా నగరం నుంచి పంపిన ఉక్రెయిన్ జెండాను ఆయన ప్రేమతో ముద్దాడి, అక్కడి ప్రజలకు సంఘీభావం తెలిపారు. మరోవైపు రష్యా తీరు ఏమాత్రం సమర్థనీయం కాదంటూ ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు యూరోపియన్ యూనియన్ దృష్టిసారించింది. ఇప్పటికే విధించిన ఆంక్షలకు అదనంగా మరికొన్నిటితో రష్యాకు గుణపాఠం చెప్పాలని అమెరికా సహా పలు దేశాలు నిర్ణయించాయి.

Vladmir Putin: పుతిన్ కు క్యాన్సర్, జింక కొమ్ముల రక్తంతో స్నానం చేస్తాడు: రష్యా పత్రిక సంచలన ప్రకటన

ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కుటుంబం, అతని సన్నిహితులను టార్గెట్ గా అమెరికా చర్యలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పుతిన్ కుమార్తెలిద్దరిని లక్ష్యంగా చేసుకొని కఠిన ఆంక్షలు విధించాలని యూరోపియన్ యూనియన్ భావిస్తుంది. పుతిన్ దృష్టికి వెళ్లేలా ఆయన కూతుళ్లు కాటేరీనా, మరియాలపై విధించబోయే ఆంక్షలు ఉండబోతున్నాయని ఈయూ అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈయూ దేశాలు వీటికి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. పుతిన్ పెద్ద కూతురు మరియా వోరోన్ త్సోవా.. హెల్త్ కేర్ కు సంబంధించిన పెట్టుబడుల కంపెనీ నోమోన్కోకి సహ భాగస్వామిగా ఉంది. అలాగే చిన్న కుమార్తె కాటేరీనా టిఖోనోవా మాస్కోలోని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ ఇనిస్టిట్యూట్ ను నడిపిస్తోందని మాస్కో మీడియా వర్గాలు ఈ మధ్య ఫొటోలతో సహా కథనాలు ప్రచురించాయి.

Russia-ukraine war : యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రష్యాను శిక్షించండి..లేదంటే ఐరాసను మూసేయండి : జెలెన్‌స్కీ

అయితే పుతిన్ కుమార్తెలను యుఎస్ ఎందుకు లక్ష్యంగా చేసుకుంటోందని బిడెన్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారి ఒకరిని ప్రశ్నించగా.. పుతిన్ ఆస్తులను కూతుళ్ల నియంత్రణలో ఉంచవచ్చని యుఎస్ భావిస్తున్నట్లు చెప్పారు. పుతిన్ ఆస్తులు చాలా వరకు కుటుంబ సభ్యుల వద్ద దాచి ఉంచారని, అందుకే వారినే లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు. ప్రధానంగా రక్షణ రంగంతో పాటు రష్యాకు చెందిన నాలుగు బ్యాంకులపైనా, బొగ్గు ఉత్పత్తులపైనా నూతనంగా ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది.

Russia-ukraine war : యుక్రెయిన్‌లో కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యం..చనిపోయిన యజమాని వద్దనుంచి కదలని కుక్క

అమెరికా పౌరులు రష్యాకు చెందిన నాలుగు బ్యాంకులతో ఎలాంటి లావాదేవీలు చేయకుండా, మరోవైపు ఆ దేశంలో పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకట్ట వేస్తోంది. అంతేకాక రష్యా ప్రధాని మిఖైల్ మిషుస్తిన్ కుటుంబం, విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్, రష్యా భద్రతా మండలి సభ్యులు తదితరుల  ఆక్షల చట్రంలోకి తెచ్చింది. పుతిన్ సన్నిహితులు, రష్యా వ్యాపార వేత్తలకు అమెరికాలో ఉన్న ఆస్తులను స్తంభింపజేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముప్పేట దాడి ద్వారా రష్యా అధ్యక్షుడు పుతిన్ కు గుణపాఠం చెప్పేందుకు అమెరికా సహా పలు దేశాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.