Russia-ukraine war : యుక్రెయిన్‌లో కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యం..చనిపోయిన యజమాని వద్దనుంచి కదలని కుక్క

యుక్రెయిన్‌లో కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యం..చనిపోయిన యజమాని వద్దనుంచి కదలని కుక్క ఆయన ఎప్పుడు లేస్తాడా? అని ఎదురు చూస్తున్న దృశ్యం కంటతడి పెట్టిస్తోంది.

Russia-ukraine war : యుక్రెయిన్‌లో కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యం..చనిపోయిన యజమాని వద్దనుంచి కదలని కుక్క

Dog Refuses To Leave Side Of Owners Body In Kyiv

Dog refuses to leave side of owners body in Kyiv : యుక్రెయిన్‌పై యుద్ధాన్ని 40 రోజులకుపైగా కొనసాగిస్తునే ఉంది. ఈ యుద్ధంలో యుక్రెయిన్ పైనే దృష్టి పెట్టిన రష్యా కొన్ని రోజుల క్రితం వరకు సామాన్య జనాల జోలికిపోలేదు. వారిపై దాడులు చేయలేదు. కాని కొన్ని రోజులుగా రష్యా సేనలు సామాన్య ప్రజలపై తూటాల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఎంతోమంది అమాయకులు నేలరాలిపోతున్నారు. దీంతో నగరాలకు నగరాలే శవాల దిబ్బలుగా మారిపోతున్నాయి. యుక్రెయిన్ లోని బుచా నగరంలో.. వందలాది మంది ఊచకోతకు గురయ్యారు. ఫుల్ పాత్ లపైనా ఎక్కడపడితే అక్కడ రష్యా సేనల తూటాలకు బలైపోయిన విగతజీవులుగా మారుతున్నారు. ఎక్కడపడితే అక్కడ మృతదేహాలు పడి ఉన్నాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది.

Also read : Russia-Ukraine War : శవాల దిబ్బగా యుక్రెయిన్ లోని బుచా నగరం.. వందలాది మంది ఊచకోత..ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

అందమైన యుక్రెయిన్ దేశాన్ని రష్యా శవాల దిబ్బగా మారుస్తోంది. వేలాదిమంది ప్రజలు బాంబులు, క్షిపణులకు బలవుతున్నారు. సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న ఉక్రెయిన్ నగరాల ఫొటోలు, వీడియోలు గుండెలను పిండేస్తున్నాయి. ఈ క్రమంలో ‘నెక్స్టా’ మీడియా తాజాగా షేర్ చేసిన ఓ ఫొటో గుండెల్ని పిండేస్తోంది.కన్నీళ్లు పెట్టిస్తోంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ ప్రాంతంలో సైకిలుపై వెళ్తున్న ఓ వ్యక్తి రష్యా సేనలు చేసిన దాడిలో మరణించి రోడ్డు పక్కన అచేతనంగా పడిపోయాడు. అలా పడిపోయిన అతడి పెంపుడు కుక్క విలవిల్లాడిపోయింది. ఏం చేయాలో దానికి తోచలేదు. కానీ యజమాని మృతదేహం పక్కనే కదలకుండా కూర్చుంది. దానిని అక్కడి నుంచి పంపేందుకు యత్నిస్తుంటే అది మాత్రం అక్కడనుంచి కదలటంలేదు. యజమాని వంక చూస్తే అక్కడే పడుకుని ఉంది.

ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన రష్యా బాంబులు, క్షిపణులతో దాడిని కొనసాగిస్తోంది. వేలాదిమంది పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 లక్షల మంది యుక్రెయిన్‌ను విడిచిపెట్టారు. రాజధాని కీవ్ చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లి యుక్రెయిన్ తూర్పు భాగాలపై దృష్టిసారిస్తామని రష్యా ఇప్పటికే ప్రకటించింది.

Also read : Space meat : అంతరిక్షంలో మాంసం తయారు చేయనున్న పరిశోధనలు

మరోవైపు..రాజధాని కీవ్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుచా నగరాన్ని రష్యా దళాలు శవాల దిబ్బగా మార్చేస్తోంది. వీధుల్లో శవాల కుప్పలు కనిపిస్తున్నాయి.బుచా నగరంలో రష్యా సేనలు ప్రజలను ఊచకోత కోశాయి. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా వైరల్ గా మారి చూసినవారందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.