Space meat : అంతరిక్షంలో మాంసం తయారు చేయనున్న పరిశోధనలు

పరిశోధకులు స్పేస్‌లోనే మొక్కలు పెంచారు. వెజ్ సరే.. మరి నాన్‌వెజ్‌ సంగతేంటి.. అందుకే.. స్పేస్‌లో.. కాస్త స్పేస్ తీసుకొని.. మాంసం కూడా తయారు చేయబోతున్నారు పరిశోధకులు.

Space meat : అంతరిక్షంలో మాంసం తయారు చేయనున్న పరిశోధనలు

Research to make meat in space : ముందు.. స్పేస్ దాకా వెళ్లారు. తర్వాత.. స్పేస్‌‌ షిప్‌లతో.. అదే స్పేస్‌లో మకాం వేశారు. కొన్నాళ్ల క్రితం.. స్పేస్‌లోనే మొక్కలు కూడా పెంచారు. వెజ్ సరే.. మరి నాన్‌వెజ్‌ సంగతేంటి.. అందుకే.. స్పేస్‌లో.. కాస్త స్పేస్ తీసుకొని.. మాంసం కూడా తయారు చేయబోతున్నారు పరిశోధకులు. దీని కోసం యత్నాలతో పాటు పరిశోధనలు కూడా చేపట్టారు శాస్త్రవేత్తలు..ఈ పరిశోధనలు ఫలిస్తే..ఆస్ట్రోనాట్స్‌ ఆకలి తీరడంతో పాటు లాంగ్ టర్మ్ మిషన్లలో.. వారికి మంచి పోషకాహారం దొరుకుతుంది. కానీ.. ఇది మనం చెప్పుకుంటున్నంత ఈజీ కాదు. పెద్ద సవాల్ అనే చెప్పాలి. భూమి మీద నుంచి చంద్రున్ని చూసే మనిషి.. అదే చంద్రుని దాకా వెళ్లి.. కాలు మోపి.. తిరిగి భూమిమీదకొచ్చేశాడు. ఇదంతా.. కొన్నేళ్ల కిందటి హిస్టరీ. ఈ మధ్యే.. కొన్ని నెలల క్రితమే.. వ్యోమగాములు కాని.. సాధారణ మనుషులు.. భూమికి, ఆకాశానికి మధ్య ఉన్న అంతరిక్షాన్ని టచ్ చేసి వచ్చేశారు.

Also read : Russia-Ukraine War : శవాల దిబ్బగా యుక్రెయిన్ లోని బుచా నగరం.. వందలాది మంది ఊచకోత..ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

రాబోయే రోజుల్లో.. మరింత ముందుకెళ్లే చాన్స్ కచ్చితంగా ఉంది. అప్పుడు.. అంతరిక్షం విసిరే సవాళ్లను తట్టుకొని నిలబడేందుకు.. ఇప్పటి నుంచే పరిశోధనలు మొదలుపెట్టారు. అనంతమైన ఈ విశ్వాన్ని.. మరింత ముందుకెళ్లి పరిశోధనలు సాగించాలంటే.. ఆస్ట్రోనాట్స్‌కి మంచి పోషకాహారం అందించాలి. ఇదే.. ఇప్పుడు బిగ్ టాస్క్‌గా మారింది. స్పేస్‌లో కొన్ని నెలల తరబడి ఉండే వ్యోమగాములకు.. ఆహారం చాలా ముఖ్యమైన విషయం. వారి.. డైట్‌లో మాంసాహారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దానిని.. అంతరిక్షంలో ఎక్కువకాలం వినియోగించేలా ఉంచడమే.. ఇప్పుడు సవాల్‌గా మారింది.

ఇప్పటికే.. అంతరిక్షంలో మొక్కలు పెంచారు. ఇప్పుడు.. మరో అడుగు ముందుకేసి.. స్పేస్‌లోనే మాంసాన్ని తయారుచేసే సమయం ఆసన్నమైంది. దీనికి సంబంధించి.. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ.. అంతరిక్షంలో వినియోగించే ల్యాబ్‌లలో కల్చర్డ్ మాంసాన్ని పెంచే మార్గాలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది. లాంగ్ టర్మ్ మిషన్స్ కోసం.. స్పేస్‌లో నెలలు, ఏళ్ల తరబడి ఉండే ఆస్ట్రోనాట్స్ కోసం.. ఈ పరిశోధనలు మొదలుపెట్టారు. భవిష్యత్తులో స్పేస్‌ షిప్‌లోనే.. వ్యోమగాములు తమకు కావాల్సిన మాంసాహారాన్ని.. అక్కడే వృద్ధి చేసుకొని తినడంపై.. రీసెర్చ్ చేస్తున్నారు.

Also read : Scrap Ambassdor : 1000 కిలోల స్ర్కాప్ మెటీరియల్ తో అంబాసిడర్ కారు తయారు చేసిన కళాకారుడు

భూమికి దూరంగా అంతరిక్షంలో జరుగుతున్న మార్పులను అన్వేషించాలంటే.. స్పేస్‌లోనే ఉండి పనిచేసే.. వ్యోమగాములకు పోషకాహారం చాలా అవసరం. అందుకోసం.. ఇప్పుడున్న విధానాలతో పాటు కొత్త వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముంది. దీనికోసం.. ల్యాబ్‌లో పెరిగే మాంసాన్ని వీలైనంత త్వరగా.. స్పేస్‌లోనే అందుబాటులోకి తెచ్చే మార్గాల కోసం రీసెర్చ్ మొదలుపెట్టారు. ఆస్ట్రోనాట్స్‌కి కల్చర్డ్ మీట్‌తో పాటు లాంగ్ టర్మ్ మిషన్లలో.. పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతోనే.. ఈ పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. కల్చర్డ్ మాంసం ఉత్పత్తుల్లో.. పోషక విలువలు, వాటి ప్రయోజనాలను.. అంతరిక్షంలోని పరిస్థితులకు తగ్గట్లుగా రూపొందించే ప్రోగ్రాం చేపట్టారు. అంతరిక్షంలో పోషక విలువలతో కూడిన మాంసాన్ని పెంచేందుకు అవసరమైన పరిస్థితులను సృష్టించేందుకు.. కొన్ని టీమ్స్ ఈ మధ్యే రీసెర్చ్ మొదలుపెట్టాయ్. ఇది గనక సక్సెస్ అయితే.. భవిష్యత్తులో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్స్‌ కూడా చాలా ఈజీ అయిపోతాయ్.

Also read : sri lanka crisis: కలిసి పనిచేద్దాం రండి.. ప్రతిపక్ష పార్టీలను కోరిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స

అంతేకాదు.. పర్యావరణంలో వస్తున్న మార్పులు కూడా భూమి మీద మాంసం ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. ఏటా రకరకాల వైరస్‌లు సోకి.. కొన్ని బిలియన్ జంతువులను బాధిస్తున్నాయ్. కరోనా వైరస్ కూడా.. చైనాలోని వుహాన్ మాంసం మార్కెట్ నుంచే బయటపడిందనే వార్తలొచ్చాయ్. అందువల్ల.. భవిష్యత్తులో తలెత్తబోయే పరిణామాలు, వాతావరణ మార్పులు.. మాంసం ఉత్పత్తిపైనా ప్రభావం చూపుతాయని గట్టిగా నమ్ముతున్నారు. అందువల్ల.. ఇప్పటి నుంచే కల్చర్డ్ మాంసం ఉత్పత్తిపై దృష్టి పెట్టాలన్న వాదనలు వినిపిస్తున్నాయ్. అంతేకాదు.. ప్రపంచ జనాభా సైతం రోజురోజుకు పెరిగిపోతోంది. మాంసానికి కూడా డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీని వల్ల.. సంప్రదాయ పద్ధతుల్లో వచ్చే మాంసం ఉత్పత్తి.. అందరి అవసరాలను తీర్చలేకపోవచ్చు. అందువల్ల.. ల్యాబ్‌ల్లో మాంసం ఉత్పత్తికి ఇప్పటి నుంచే రీసెర్చ్ మొదలుపెట్టారు పరిశోధకులు. అయితే.. ఇది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే విషయం కాదంటున్నారు. దీనికి.. మరింత టెక్నాలజీతో పాటు పరిశోధన కూడా చాలా అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.