Vladmir Putin: పుతిన్ కు క్యాన్సర్, జింక కొమ్ముల రక్తంతో స్నానం చేస్తాడు: రష్యా పత్రిక సంచలన ప్రకటన

వ్లాదిమిర్ పుతిన్ కు థైరాయిడ్ క్యాన్సర్ ఉందని..ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో క్యాన్సర్ ను నయం చేసేందుకు గానూ ఇప్పటికే 35 సార్లు వైద్యులు పుతిన్ నివాసానికి వెళ్ళివచ్చారంటూ

Vladmir Putin: పుతిన్ కు క్యాన్సర్, జింక కొమ్ముల రక్తంతో స్నానం చేస్తాడు: రష్యా పత్రిక సంచలన ప్రకటన

Putin

Vladmir Putin: యుక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలైన నాటి నుంచి రష్యా ధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై అనేక కధనాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి. అయితే ఆయా కథనాల్లో ఎంత మేర విశ్వసనీయత ఉందో తెలియదుగాని పుతిన్ పై ప్రజ ల్లో ఉన్న అభిప్రాయం మాత్రం మారిపోతుంది. తాజాగా రష్యాకు చెందిన ప్రముఖ వార్తా పరిశోధక సంస్థ(Investigative News Outlet) ‘ప్రోక్ట్ (Proekt)’..రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై సంచలన కథనం ప్రచురించింది. వ్లాదిమిర్ పుతిన్ కు థైరాయిడ్ క్యాన్సర్ ఉందని..ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో క్యాన్సర్ ను నయం చేసేందుకు గానూ ఇప్పటికే 35 సార్లు వైద్యులు పుతిన్ నివాసానికి వెళ్ళివచ్చారంటూ ‘ప్రోక్ట్’ పేర్కొంది.

Also read:Hormonal Imbalance : మహిళల్లో హర్మోన్ల అసమతుల్యత, బరువు నియంత్రణ కోసం గింజలు

అంతే కాదు థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న పుతిన్ కు ఏయే డాక్టర్ ఎన్ని సార్లు వెళ్లాడు..ఎన్ని రోజులు పుతిన్ తో గడిపాడు అనే విషయాలను సైతం వార్తా సంస్థ సేకరించినట్లు నివేదించింది. అత్యధికంగా అలెక్సీ షెగ్లోవ్ అనే వైద్యుడు పుతిన్‌ను చూడటానికి 59 సార్లు వెళ్లారని మరియు 2016 – 2020 మధ్య మొత్తం 282 రోజులు అతనితో గడిపారని నివేదికలో పేర్కొంది. నల్లసముద్రం సమీపంలో సోచి నగరంలో ఉన్న పుతిన్ రహస్య నివాసంలో ఈ వైద్యం జరుగుతున్నట్టు ‘ప్రోక్ట్’ నివేదించింది.

Also read:Pak National Assembly : ఇమ్రాన్ ఖాన్ గూగ్లీ .. జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన అధ్యక్షులు

మత్తుమందు నిపుణులు, ఒక న్యూరో సర్జన్, ఒక అంటు వ్యాధుల నిపుణుడు మరియు ఇంటెన్సివ్ కేర్ వైద్యుడు కలిగిన డాక్టర్ల బృందం 2016 నుంచి పుతిన్ కు వైద్యం అందిస్తున్నట్లు వార్తా సంస్థ తెలిపింది. అంతేకాదు..క్యాన్సర్ ను జయించడానికి మందులకు ప్రత్యామ్న్యాయంగా జింక కొమ్ముల రక్తంతో స్నానం కూడా చేస్తున్నట్లు ‘ప్రోక్ట్’ తెలిపింది. బ్రతికే ఉన్న జింక కొమ్ములను అమాంతం లాగి దాని ద్వారా వచ్చిన రక్తంలో పుతిన్ స్నానం చేస్తున్నట్లు వార్తా సంస్థ తెలిపింది. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు సూచన మేరకు పుతిన్ ఈ విధంగా చేస్తున్నట్లు ‘ప్రోక్ట్’ వార్తా సంస్థ తెలిపింది.

Also read:Brazil Rain effect : బ్రెజిల్ లో కుండపోత వర్షం.. కొండచరియలు విరిగిపడి 14మంది మృతి