Nasa Artemis-1 Launch: నేడు చంద్రుడిపైకి అర్టెమిస్-1 ప్రయోగం.. ఈసారైనా నింగికెగురుతుందా..

1972లో అపోలో ప్రాజెక్టు ముగిసిన తరువాత మళ్లీ చంద్రుడిపైకి వ్యోమగాములను పంపే ప్రయత్నం జరగలేదు. అయితే నాసా మరోసారి మనుషులను చంద్రుడిపైకి పంపేందుకు ప్రయోగాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఆరెమిస్-1 ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.

Nasa Artemis-1 Launch: నేడు చంద్రుడిపైకి అర్టెమిస్-1 ప్రయోగం.. ఈసారైనా నింగికెగురుతుందా..

Nasa

Nasa Artemis-1 Launch: చంద్రుడిపైకి ఆర్టెమిస్-1ను ప్రయోగించేందుకు నాసా (అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ) మరోసారి సిద్ధమైంది. ఇప్పటికే రెండు దఫాలుగా ప్రారంభంలోనే విఫలమైన ఈ ప్రయోగం.. ఈసారి విజయవంతం అవుతుందని నాసా శాస్త్రవేత్తలు గట్టినమ్మకంతో ఉన్నారు. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 11.34గంటలకు ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు నాసా వెల్లడించింది. కేప్ కెనావెరల్‌లోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని నాసా నిర్వహించనుంది.

NASA Artemis-1 Mission: నేడు చంద్రుడిపైకి మానవరహిత ఆర్టెమిస్-1 ప్రయోగం.. ఆర్టెమిస్ అంటే ఏమిటి? ఆ పేరెందుకు పెట్టారంటే?

2024లో ఆర్టెమిస్‌-2 ప్రయోగాన్ని చేపట్టి వ్యోమగాములను కచ్చితంగా చంద్రుడిపైకి తీసుకెళ్లాలని నాసా భావిస్తుంది. చంద్రుడిపై శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేయడంలో భాగంగా నాసా ఈ ప్రయోగాన్ని చేపడుతున్నది. అయితే, ప్రస్తుతం ఈ మిషన్‌లోని ఓరియన్‌ క్యాప్సూల్‌ మానవ రహితంగానే చంద్రుడి కక్ష్యలోకి వెళ్లిరానున్నది. ఆర్టెమిస్‌-3ని 2025 ప్రయోగించేందుకు నాసా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తుండటం విశేషం.

NASA Artemis Launch: నేడు మరోసారి చంద్రుడిపైకి ఆర్టెమిస్ -1 ప్రయోగం .. ఏ సమయానికంటే?

1972లో అపోలో ప్రాజెక్టు ముగిసిన తరువాత మళ్లీ చంద్రుడిపైకి వ్యోమగాములను పంపే ప్రయత్నం జరగలేదు. అయితే నాసా మరోసారి మనుషులను చంద్రుడిపైకి పంపేందుకు ప్రయోగాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఆరెమిస్-1 ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ క్రమంలో నాసా తలపెట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగం ఇప్పటికే రెండుసార్లు విఫలమైంది. ఈ ఏడాది ఆగస్టు 29న కొన్నిఅనివార్య కారణాలతో ఈ ప్రయోగాన్ని వాయిదా వేశారు. మళ్లీ సెప్టెంబర్ 3న ఆర్టెమిస్-1 ప్రయోగంకు అంతా సిద్ధంచేసిన తరువాత లాంచ్ సిస్టమ్ రాకెట్‌లో ఇంధనం లీక్ అవుతున్నట్లు గుర్తించారు. సూపర్‌ కోల్డ్‌ హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ లీక్ అవుతుండటంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు. మళ్లీ నేడు ఉదయం 11.34గంటలకు నాసా ఈ ప్రయోగాన్ని తలపెట్టింది. గతంలో రెండు సార్లు ప్రయోగం ప్రారంభంలోనే విఫలం కావటంతో ఈసారైనా నాసా ఆర్టెమిస్-1 ప్రయోగం సఫలమవుతుందా..? మరోసారి వాయిదా పడుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.