NASA Artemis Launch: నేడు మరోసారి చంద్రుడిపైకి ఆర్టెమిస్ -1 ప్రయోగం .. ఏ సమయానికంటే?

యాబై ఏళ్ల తరువాత మనిషిని చంద్రుడి మీదకు పంపించే ప్రయత్నాలను మళ్లీ నాసా ప్రారంభించింది. ఈ క్రమంలో ఆర్టెమిస్-1 మూన్ రాకెట్ ను ఈ రోజు ప్రయోగించనుంది. ప్లోరిడా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2.17గంటలకు (భారత్ కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11 గంటల తరువాత) ఆర్టెమిస్ ప్రయోగం ప్రారంభం కానుంది.

NASA Artemis Launch: నేడు మరోసారి చంద్రుడిపైకి ఆర్టెమిస్ -1 ప్రయోగం .. ఏ సమయానికంటే?

Nasa Artemis-1

NASA Artemis Launch: యాబై ఏళ్ల తరువాత మనిషిని చంద్రుడి మీదకు పంపించే ప్రయత్నాలను మళ్లీ నాసా ప్రారంభించింది. ఈ క్రమంలో ఆర్టెమిస్-1 మూన్ రాకెట్ ను ఈ రోజు ప్రయోగించనుంది. ప్లోరిడా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2.17గంటలకు (భారత్ కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11 గంటల తరువాత) ఆర్టెమిస్ ప్రయోగం ప్రారంభం కానుంది. గత నెల చివరి వారంలో ఆర్టెమిస్ -1 ను ప్రయోగించేందుకు నాసా సిద్ధమైనప్పటికీ చివరి నిమిషంలో రాకెంట్ నుంచి ఇంధనం లీక్ అవుతుండటంతో అర్థాంతరంగా ప్రయోగాన్ని నాసా నిలిపివేసింది. దీంతో మళ్లీ శనివారం మానవ రహిత మూన్ రాకెట్ ఆర్టెమిస్ -1 ను ప్రయోగించేందుకు నాసా సిద్ధమైంది.

NASA Artemis-1 Mission: నేడు చంద్రుడిపైకి మానవరహిత ఆర్టెమిస్-1 ప్రయోగం.. ఆర్టెమిస్ అంటే ఏమిటి? ఆ పేరెందుకు పెట్టారంటే?

చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపించడమే ఈ 100 మీటర్ల ఆర్టెమిస్ ఉద్దేశ్యం. 1972లో ప్రాజెక్ట్ అపోలో ముగిసిన తర్వాత ఈ ప్రయత్నం జరగలేదు. ఆర్టెమిస్ -1 కేవలం సాంకేతిక ప్రయోగం మాత్రమే. ఈ స్పేస్ క్యాప్సూల్ లో మనుషులు ప్రయాణించరు. కానీ అన్నీ ఊహించినట్లుగా జరిగితే 2024లో ప్రయోగించనున్న ఆర్టెమిస్ -2 చంద్రునిపైకి వ్యోమగాములను తీసుకెళ్తుంది.

Artemis-1 Launch: ఆర్టెమిస్-1 ప్రయోగానికి మరోసారి తేదీని ప్రకటించిన నాసా.. ఎప్పుడంటే?

ఈ ప్రయోగం మొత్తం 38 రోజులు పాటు కొనసాగుతుంది. అయితే.. ఈ స్పేస్ క్రాప్ట్ పరిమితులను అర్థం చేసుకునేందుకు ఈ ప్రయోగం నిడివిని పెంచాలని ఇంజనీర్లు కోరుతున్నారని నాసాలో ఓరియాన్ ప్రోగ్రాం సీనియర్ సలహాదారు అనెట్ హాస్ బ్రూస్ చెప్పారు. ఇదిలాఉంటే గురువారం ఫ్లోరిడాలో జరిగిన బ్రీఫింగ్ సందర్భంగా మిషన్ మేనేజర్ మైఖేల్ సరాఫిన్ మాట్లాడుతూ.. మేము శనివారం ఆర్టెమిస్-1ను ప్రయోగించబోతున్నాం. కానీ, మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తామని తెలిపారు. ప్రయోగ సమయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుందని అంచనా వేశామని, 60శాతం అవకాశం ఉన్న పరిస్థితులతో ప్రయోగానికి అనుమతి ఉందని తెలిపారు.