Artemis-1 Launch: ఆర్టెమిస్-1 ప్రయోగానికి మరోసారి తేదీని ప్రకటించిన నాసా.. ఎప్పుడంటే?

యాబై ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత చంద్రుడిపైకి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగం సోమవారం వాయిదా పడిన విషయం విధితమే. అయితే ఈ ప్రయోగానికి సంబంధించి నాసా మరో తేదీని వెల్లడించింది. నాసాలోని ఆర్టెమిస్ -1 మిషన్ మేనేజర్ మైక్ సిరాఫిన్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 3న శనివారం మధ్యాహ్నం మరోసారి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.

Artemis-1 Launch: ఆర్టెమిస్-1 ప్రయోగానికి మరోసారి తేదీని ప్రకటించిన నాసా.. ఎప్పుడంటే?

Artemis-1

Artemis-1 Launch: యాబై ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత చంద్రుడిపైకి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగం సోమవారం వాయిదా పడిన విషయం విధితమే. ఇంజిన్ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగాన్ని నిలిపివేసినట్లు నాసా తెలిపింది. మరికొద్ది గంటల్లో ఆర్టెమిస్-1 నింగికి ఎగరాల్సి ఉండగా ఇంధనం లీక్ అయినట్లు గుర్తించారు. దీంతో ప్రయోగాన్ని అకస్మాత్తుగా వాయిదా వేశారు. అయితే మళ్లీ ఆర్టెమిస్-1 ప్రయోగం ఎప్పుడు ఉంటుందనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. తొలుత సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ప్రయోగం ఉంటుందని అందరూ భావించారు. అయితే తాజాగా ఆ విషయాన్ని నాసా వెల్లడించింది.

NASA Artemis-1 Mission: నేడు చంద్రుడిపైకి మానవరహిత ఆర్టెమిస్-1 ప్రయోగం.. ఆర్టెమిస్ అంటే ఏమిటి? ఆ పేరెందుకు పెట్టారంటే?

నాసాలోని ఆర్టెమిస్ -1 మిషన్ మేనేజర్ మైక్ సిరాఫిన్ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్టెమిస్-1 ప్రయోగాన్ని సెప్టెంబర్ 3న శనివారం మధ్యాహ్నం మరోసారి చేపట్టనున్నట్లు తెలిపారు. సోమవారం నాటి ఆర్టెమిస్-1 ప్రయోగం నిలిచిపోవటంతో అందుకు కారణాలన్నింటిని కనుగొని పరిష్కరించడం జరిగిందని తెలిపారు. రెండవ సారి ప్రయోగం విజయవంతం అవుతుందని అన్నారు. ప్లోరిడాలోని కేప్ కెనవెరల్ లోని ఏజెన్సీ కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి మిషన్ యొక్క క్యారియర్ వాహనం స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ ను చంద్రుడిపైకి ప్రయోగించడానికి జరుగుతుందని తెలిపారు.

ఇదిలాఉంటే చంద్రుడిపైకి మనిషిని పంపే ప్రాజెక్టులో భాగమే ఆర్టెమిస్ -1. నాసా చేపట్టిన ఈ యాత్రలో శక్తివంతమైన రాకెట్ తో సహా వ్యోమనౌకలను నింగిలోకి పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గతంలో మాదిరిగా కాకుండా చంద్రుడిపై శాశ్వత ఆవాసానికి పునాదులు వేసే ప్రయత్నాల్లో భాగంగా నాసా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. అయితే ప్రస్తుతం మాత్రం అందులో ఉన్న ఓరియన్ క్యాప్సూల్ మానవరహితంగానే చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి రానుంది.