ఈ వారం రాశిఫలాలు (నవంబరు 9 నుంచి 15 వరకు).. ఈ రాశివారికి ధనలాభం, నిరుద్యోగులకు జాబ్స్
ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన వివరాలు..
Rashi Phalalu: ఈ వారం రాశిఫలాలు (నవంబరు 9 నుంచి 15 వరకు)
గురువు 11 వరకు అతిచారం, 12వ తారీఖు నుంచి వక్తారంభం
కర్కాటక రాశిలో శని, మీన రాశిలో వక్రస్థితి
రవి శుక్రులు తులా రాశిలో
కుజ బుధులు వృశ్చికంలో
చంద్రుడు మిధునం కర్కాటక, సింహ రాశులలో సంచారం
మేష రాశి: శత్రువులు మిత్రులుగా మారుతారు. మీరు పై అధికారుల ఆదరాభిమానాలు పొందుతారు. ధనలాభం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశము, స్త్రీల వల్ల లాభములు, నూతన వ్యాపారంలో ధనలాభము, గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయడం, అందరూ ఆరోగ్యకరముగా ఉండటం, గౌరవ మర్యాదలు లభించడం, ప్రయూణములలో ప్రముఖ వ్యక్తుల కలయిక ద్వార లాభములు కలగడం వంటివి జరుగుతాయి. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన వలన ఉత్తమ ఫలితములు కలుగుతాయి.
వృషభ రాశి: బద్ధకం పెరగడం, మనస్సుకు ప్రశాంతత లేకపోవడం, ఇబ్బందులు రావడం, వృత్తి ఉద్యోగాలలో రాణింపు లేకపోవడం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, విరోధములు, తీర్థయాత్రలు చేయడం, భార్యభర్తల మధ్య అభిప్రాయ భేదములు ఉంటాయి. తారా మహాదేవి స్తోత్ర పారాయణం చేయడంవల్ల శుభ ఫలితములు కలుగుతాయి
మిథున రాశి: ప్రయాణాలలో ఇబ్బందులు, అనవసర విషయములలో కలహములు, ఆటంకములు, గొడవలు, శుభకార్యక్రమాలలో ఆటంకములు, బంధుమిత్రులతో విరోధములు, స్థానభ్రంశము, అనారోగ్యము, బుణబాధలు, భాగస్వామ్యంతో చికాకులు, బుద్ధి చాంచల్యము, ఆవేశంతో గొడవలు ఉంటాయి. సుందర కాండ పారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.
కర్కాటక రాశి: కుటుంబంలో సఖ్యత పెరగడం, కోర్టు సమస్యలు పరిష్కారం కావడం, అన్నదమ్ములతో సఖ్యత పెరగడం, మంచి ఉద్యోగం లభించడం, బంధువర్గంలో గౌరవం పెరగడం, వృత్తిలో లాభము, ధైర్యము పెరగడం, విదేశాలకు వెళ్ళడం, ఆరోగ్యము కుదుటపడటం, అనవసరము లేని విషయములలో కల్పించుకోకూడదు, దుస్తులు కొనుగోలు చేయడం, సంతానము ద్వారా శుభవార్తలు రావడం. ఇష్టదైవ ప్రార్ధన వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
సింహ రాశి: మానసిక ఆందోళన గురికావడం, నమ్మి మోసపోవడం, బాకీలు, ఋణబాధలు, మోసానికి గురి కావడం, దీర్ఘ కాలిక వ్యాది బాధలు, ధననష్టము, విరోధములు, భాగస్వామ్య వ్యాపారంతో అలజడులు, తగాదులు, కుటుంబంలో చికాకులు, ఆప్యాయములు, ప్రయాణములు వాయిదా పడటం, అలసట, ఉద్యోగంలో ఇబ్బందులు. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధనవల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
కన్యా రాశి: వృత్తి ఉద్యోగములు ఆనందంగా ఉండటం, ఆరోగ్యము కుదుటపడటం, విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడం, బంధమిత్రులతో విందులు, వినోదములు గడుపుతారు, నూతన వ్యాపారములలో లాభములు, నూతన ఉద్యోగములు, అమ్మకాలు పెరగడం, సరియైన నిర్లయములు తీసుకోవడం, ప్రయాణములు చేయడం, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లడం. శ్రీ సుబ్రహ్మణేశ్వర్ స్వామి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి
తులా రాశి: వివాహాది శుభకార్యములకు ఆటంకములు కలుగుతాయి, మనస్సుకి ఇబ్బందికరమైన సంఘటనలు కలుగుతాయి. సోమరితనము కలగడం, ప్రయాణంలో పొదుపు పాటించడం, మాట పట్టింపులు, గృహనిర్మాణములో ఆటంకములు, అపాయములు, అదికారుల ద్వారా మాట పట్టింపులు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శుభఫలితములు కలుగుతాయి.
వృశ్చిక రాశి: శుభవార్తలు వినడం, కార్యసిద్ధి, ధనలాభం, కుటుంబ సౌఖ్యములు, బంధుమిత్రులతో విందు వినోదములతో కాలము గడుపుతారు, లాభదాయకమైన ప్రయాణములు చేస్తారు. ఇష్టులైన వారితో సంప్రదింపులు జరపడం వల్ల లాభములు కలుగుతాయి, సంతానము ద్వారా లాభములు, వృత్తి, ఉద్యోగములందు ఊహించని శుభవార్తలు కలుగుతాయి. శివాలయ ప్రదక్షణలు చేయడం వల్ల శుభఫలితములు కలుగుతాయి.
ధనస్సు రాశి: నూతన వ్యక్తులతో పరిచయాలు వలన లాభాలు కలగడం, చేయు వృత్తి, ఉద్యోగ, వ్యాపారములలో అభివృద్ధి రాణింపు ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, శుభకార్యక్రమములలో పాల్గొనడం, చేపట్టిన పనిలో సానుకూలత, ఆరోగ్యము, సుఖసంతోషములు కలగడం, శత్రునాశనము, సంఘంలో గౌరము పెరగడం. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రములు చదవడం వల్ల శుభం కలుగును.
మకర రాశి: ఉద్యోగ, వ్యాపారములలో మార్పులు, కార్యరంగంలో ప్రతికూలత, బంధు మిత్ర పుత్ర విరోధములు, కుటుంబ సమస్యలు, అన్యస్థల నివాసము, ఉద్యోగంలో భయము, శుత్రువృద్ధి, స్త్రీల మూలకంగా ఇబ్బందులు, ఆరాచకములు, నిద్రలేమి, అకారణ వైరము, కలహములు, బంధు మిత్రులతో జాగ్రత్త అవసరము. శ్రీ లక్ష్మీదేవిని ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
కుంభ రాశి: నరాల బలహీనత, మానసిక ప్రశాంతత లేకపోవడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ధననష్టము, అనారోగ్యము, విరోధములు, కోర్టు సమస్యలు, వ్యాపారులలో చికాకులు, ఊహించని నష్టాలు, సోమరితనము అధికం కావడం, ప్రయాణములలో ప్రమాదాలు. శ్రీ విష్ణు స్తోత్రము పారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.
మీన రాశి: నూతన విషయములలో అభివృద్ధి, కీలక అంశాలపై చర్చలు, ప్రతి పనిని సమర్థవంతంగా నిర్వహించడం, ధనధాన్యలాభములు, అన్య స్త్రీ పరిచయము, వృత్తి ఉద్యోగములలో లాభములు కలగడం, కీర్తి ప్రతిష్ఠలు కలగడం, ఆదరాభిమానములు పోందడం, గౌరవసన్మాములు పొందడం, నగలు విలువైన వస్త్రములు కొనుగోలు చేయడం, అభివృద్ధి కలగడం. అమ్మవారి ఆరాధన వల్ల శుభం కలుగుతుంది.

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956
