New Moon : మన సౌర కుటుంబం పక్కనే మరో చంద్రుడు..భూమికంటే మూడు రెట్లు పెద్దగా

సౌర కుటుంబానికి ఆవల శాస్త్రవేత్తలు ఓ ఉప గ్రహాన్ని గుర్తించారు. ఇది చంద్రుడిని పోలి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఉపగ్రహం భూమి కంటే మూడు రెట్లు పెద్దదిగా ఉందని భావిస్తున్నారు.

New Moon : మన సౌర కుటుంబం పక్కనే మరో చంద్రుడు..భూమికంటే మూడు రెట్లు పెద్దగా

New Moon Found

New moon Found :  చుక్కలు ఎన్నున్నా చంద్రుడు ఒక్కడే. మన సౌర కుటుంబంలో భూమికి ఉప గ్రహంగా చంద్రుడు ఉన్నాడు. తన చుట్టు తాను తిరుగుతు భూమి చుట్టు తిరుగుతుంటుంది చంద్రగ్రహం. చంద్రుడు తిరటం వల్లే పగలు రాత్రి ఏర్పడుతున్నాయని మన ఖగోళశాస్త్రవేత్తలు గుర్తించిన విషయం తెలిసిందే. కానీ ఈ అంతరిక్షం అనేది అనంతం. దాంట్లో శాస్త్రవేత్తలు కనిపెట్టింది అత్యంత స్వల్పం. ఇంకా వీడని మిస్టరీలు ఈ అంతరిక్షంలో ఎన్నో ఉన్నాయి. అంతరిక్షంలో మిస్టరీలకు ఛేదించటానికి ఖగోళశాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనల్ని కొనసాగిస్తున్నారు. అత్యాధునిక పరికరాలతో ఎన్నో కొత్త కొత్త గ్రహాలను గుర్తిస్తున్నారు.

Also read : కృత్రిమ సూర్యుణ్ని తయారుచేసుకున్న చైనా..!!

దాంట్లో భాగంగానే అంతరిక్షంలో మరో చంద్రుడు (చంద్రుడు లాంటి గ్రహం) ఉన్నాడని అది మన సౌర కుటుంబానికి అవతలి వైపున ఉన్నాడని గుర్తించారు. భూమికి ఉప గ్రహంగా ఉన్న చంద్రుడు భూమికంటే చిన్న గ్రహం అనే విషయం తెలిసిందే. కానీ కొత్తగా శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ కొత్త చంద్రుడు మాత్రం మన భూమి కంటే మూడు రెట్టు పెద్దగా ఉన్నాడట..కానీ ఈ కొత్త చంద్రుడి వింతలు విశేషాలు తెలియజేయటానికి కాస్త టైమ్ పట్టొచ్చు..

సౌర కుటుంబానికి ఆవల శాస్త్రవేత్తలు ఓ ఉప గ్రహాన్ని గుర్తించారు. ఇది చంద్రుడిని పోలి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఉపగ్రహం 81 వేల కిలోమీటర్ల వ్యాసంతో భూమి కంటే మూడు రెట్లు పెద్దదిగా ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. గురుగ్రహ పరిమాణంలో ఉన్న 1708బీ అనే గ్రహం చుట్టూ ఇది తిరుగుతోందని గుర్తించారు.

Also read : China Artificial Sun :కృత్రిమ సూర్యుడితో చైనా కొత్త రికార్డు..సహజ సూర్యుడి కంటే 5రెట్లు ఎక్కువే సాధించిన డ్రాగన్ దేశం

ఈ గ్రహం భూమికి 5,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. నాసా పంపించిన కెప్లర్‌ టెలిస్కోపు అందించిన సమాచారం సాయం తో దీన్ని గుర్తించారు. అయితే ఈ సమాచారాన్ని ధ్రువీకరించుకోవడానికి శాస్త్రవేత్తలు మిగతా టెలిస్కోపుల సమాచారాన్ని కూడా విశ్లేషించనున్నారు. మరి ఈ కొత్త చంద్రడు అదేనండీ..చంద్రుడు లాంటి ఈ గ్రహం గురించి మరిన్ని వింతలు..విశేషాలు తెలియాల్సి ఉంది.