కృత్రిమ సూర్యుణ్ని తయారుచేసుకున్న చైనా..!!

  • Published By: nagamani ,Published On : December 7, 2020 / 03:11 PM IST
కృత్రిమ సూర్యుణ్ని తయారుచేసుకున్న చైనా..!!

China Artificial Sun : ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. అంతజనాభా కలిగిన చైనా టెక్నాలజీలో దూసుకుపోతోంది. ఎంతగా అంటే అత్యధిక ధనిక దేశాలు కూడా చేయలేనటువంటి సాంకేతికతను సొంతం చేసుకుంది. సృష్టికి ప్రతిసృష్టి చేసినట్లుగా సూపర్ సూపర్ పవర్ ‘‘ఆర్టిఫిషియల్ సన్’ని తయారు చేసుకుంది డ్రాగన్ దేశం. ఇంత గొప్ప ఘతన సాధించిన చైనావైపే ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి.



చైనా ఓ పని అనుకుంది అంటే అది అయిపోవాల్సిందే.పంత పట్టిందంటే చేసి తీరాల్సిందే. అలా తనస్వయంగా ఓ సూర్యుణ్ని తయారుచేసుకుంది. ప్రపంచదేశాలవైపు చైనా చూడకుండా తమవైపే ప్రపంచం చూడాలనేది చైనా ఉద్ధేశ్యం. దీంతో ఏకంగా ప్రపంచదేశాలు తమపై ఆధారపడేలా చేయాలన్నది చైనా అత్యాధునిక సిద్ధాంతం. దీంట్లో భాగంగా చైనా ప్రతీదీ తన కోసం ప్రత్యేకంగా తయారుచేసుకుంటోంది. తాజాగా…ఏకంగా కృత్రిమ సూర్యుణ్ని (Artificial Sun) తయారు చేసి చూపించి..దటీజ్ చైనా అనిపించింది. కృత్రిమంగా సూర్యుడ్ని విజయవంతంగా తయారుచేసినట్లు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ కృత్రిమ సూర్యుడి పేరు HL-2M టోకామాక్ రియాక్టర్.



ఇది చైనాలో అతి పెద్ద, అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రయోగ పరిశోధనా పరికరం. ఇది న్యూక్లియర్ ఎనర్జీని విజయవంతంగా ఇవ్వగలదని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. దీనికి తగిన ఫలితాలు విజయవంతంగా వస్తాయని ఆశిస్తున్నారు.



సూర్యుడి పరమాణు కేంద్రంలో విపరీతమైన సూపర్ పవర్ ఉంటుంది. అణువులను విచ్ఛిన్నం చేస్తే… విపరీతమైన ఎనర్జీ వస్తుంది. ఈ రియాక్టర్‌లో చైనా సైంటిస్టులు అదే చేస్తున్నారు. ఇది అత్యంత శక్తి మంతమైన మాగ్నెటిక్ ఫీల్డ్ కలిగివుంది.

 

దీని ద్వారా… వేడి ప్లాస్మాను ఇది విచ్చిన్నం చేయగలదు. తద్వారా…15 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఎనర్జీని విడుదల చేయగలదని పీపుల్స్ డైలీ తెలిపింది. 15 కోట్ల డిగ్రీల సెల్సియస్ అంటే… ఒరిజినల్ సూర్యుడి మధ్య భాగంలో ఉండే వేడి కంటే 10 రెట్లు ఎక్కువ వేడి అన్నమాట.



ఈ రియాక్టర్ వాయవ్య చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉంది. 2019లోనే దీని నిర్మాణం పూర్తి అయ్యింది. ఇది ఎక్కువ పవర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి… దీన్ని ‘‘ఆర్టిఫిషియల్ సన్’’ అంటున్నారు. దీని ద్వారా చైనా తన కరెంటు అవసరాల్ని తీర్చుకోవడమేకాక… భవిష్యత్తులో… ఆర్థిక వ్యవస్థతో మరింత బలంగా తయారు కానుంది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని పీపుల్స్ డైలీ తెలిపింది.



2006 నుంచి ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ తయారీపై చైనా సైంటిస్టులు దృష్టి పెట్టారు. ఫ్రాన్స్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ తయారవుతోంది. అది 2025 నాటికి పూర్తికానుంది భావిస్తున్నారు. ఫ్రాన్స్‌లో తయారయ్యేదాన్ని ఇంటర్నేషనల్ థెర్మో న్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్ (ITER) అని పిలుస్తున్నారు.



ఈ ఫ్యూజన్ ద్వారానే ఎనర్జీ వస్తుంది. మన సూర్యుడిలోనూ అలాగే వస్తోంది. అణ్వాయుధాలు, అణు ఇంధన ఉత్పత్తి ప్లాంట్లలో ఈ విధానాన్ని పాటిస్తున్నారు. అణు సంలీనంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉత్పత్తి అవుతాయి.

 

అణు విచ్ఛిన్నంలో అలాంటివి ఏర్పడవు. ఐతే… అణు విచ్ఛిన్నం అనేది కష్టమైన ప్రక్రియ, ఖర్చుతో కూడినది. ITER అంచనా ఖర్చు రూ.1,66,062 కోట్లుగా అంచనా. ఈ ఖర్చు పెరిగే అవకాశం కూడా ఉంది.