China Artificial Sun :కృత్రిమ సూర్యుడితో చైనా కొత్త రికార్డు..సహజ సూర్యుడి కంటే 5రెట్లు ఎక్కువే సాధించిన డ్రాగన్ దేశం

కృత్రిమ సూర్యుడితో మరో సరికొత్త రికార్డు సాధించిన చైనా..సహజ సూర్యుడి కంటే 5రెట్లు ఎక్కువే సాధించింది డ్రాగన్ దేశం.

China Artificial Sun :కృత్రిమ సూర్యుడితో చైనా కొత్త రికార్డు..సహజ సూర్యుడి కంటే 5రెట్లు ఎక్కువే సాధించిన డ్రాగన్ దేశం

China Artificial Sun (1)

China Arificial Sun : టెక్నాలజీలో దూసుకుపోతున్న చైనా ఏదైనా అనుకుంది అంటే చేసి చూపిస్తుంది. బుల్లెట్ ట్రైన్లతో ప్రపంచాన్ని ఆకర్షించిన డ్రాగన్ దేశం ఏకంగా సొంతంగా ఓ సూర్యుడినే తయారు చేయటం ప్రారంభించి యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. అలా అనుకున్నది సాధించింది చైనా. సొంతంగా సూర్యుడిని సృష్టించింది. అనుకున్న‌ది సాధించింది. ఇప్పటికే ఆర్టిఫిషియ‌ల్ సూర్యుడిని రూపొందించిన చైనా..ఈ కీల‌క‌ ప్ర‌యోగంలో మరో స‌రికొత్త రికార్డు సృష్టించింది.

ఈ కృత్రిమ సూర్యుడి నుంచి 70 మిలియ‌న్ డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌ను 1056 సెకండ్ల పాటు ఉత్ప‌త్తి చేసింది. అదే నిజ‌మైన సూర్యుడి కోర్ వ‌ద్ద కేవ‌లం 15 మిలియ‌న్‌ డిగ్రీల ఉష్ణోగ్ర‌త ఉంటుంది. అంటే చైనా రూపొందించిన ఈ కృత్రిమ సూర్యుడు నుంచి ఉత్పత్తి అయిన హీట్ అసలైన సూర్యుడినుంచి వచ్చే హీట్ కంటే అత్యంత ఎక్కువగా ఉందన్నమాట. అంటే..అస‌లైన సూర్యుడి కంటే దాదాపు ఐదు రెట్లు వేడిగా ఉంది ఈ కృత్రిమ సూర్యునుంచి ఉత్పత్తి చేసిన వేడి. సూర్యుడి వేడి 1.5 కోట్ల డిగ్రీల సెల్సియస్‌తో పోల్చితే ఇది ఐదు రెట్లు ఎక్కువ అని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్మా ఫిజిక్స్‌ పరిశోధకుడు గాంగ్ జియాన్జు తెలిపారు.

ఇది కూడా చదవండి : కృత్రిమ సూర్యుణ్ని తయారుచేసుకున్న చైనా..!!

అలా డ్రాగన్ దేశం అనుకున్న‌ది సాధించింది.. ఔరా అని ఏమి ఈ డ్రాన్ దేశంపు సంకల్పం అనిపించింది. చైనా కృత్రిమ సూర్యుడిని తయారు చేస్తున్నప్పుడు ప్రపంచ దేశాలన్ని అచ్చెరువొందాయి…ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? దీనిపై చైనా పెట్టే ఖర్చుకు తగిన ఫలితం లభిస్తుందా?అనే పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ చైనా అనుకున్నది సాధించింది అనేకంటే అనుకున్నదానికంటే ఎక్కువే సాధించింది అని చెప్పుకోవచ్చు.

సహజమైన సూర్యుడికి కృత్రిమ సూర్యుడికి తేడా ఏంటి?
మ‌న‌కు తెలిసిన సూర్యుడు ఆకాశంలో ఉంటాడు. నిరంతరం నిప్పులు చెరుగుతంటాడు. మొత్తం విశ్వం వెలుతురు..శ‌క్తిని అందిస్తాడు. ఆ శక్తితోనే భూమ్మీద సమస్త జీవరాశి జీవిస్తోంది. మ‌రి చైనా సృష్టించిన కృత్రిమ సూర్యుడు కూడా ఆకాశంలో ఉండి వెలుగునిస్తాడా? అనే అతి పెద్ద అనుమానం ఉండేది. కానీ అది నిజం కాదు. ఇదొక రియాక్ట‌ర్ మాత్రమే‌. విద్యుత్ త‌దిత‌ర అవ‌స‌రాల కోసం ఏర్పాటు చేసిన ఎక్స్‌ప‌రిమెంట‌ల్ అడ్వాన్స్‌డ్ సూప‌ర్ కండ‌క్టింగ్ టొక‌మాక్ (ఈస్ట్‌) ఫ్యూజ‌న్ ఎనర్జీ రియాక్ట‌ర్‌. ఈ రియాక్ట‌ర్ ఉత్ప‌త్తి చేసే అధిక ఉష్ణోగ్రత, శక్తి వల్లనే దీన్ని సూర్యుడు అని అంటున్నారు. అదే కృత్రిమ సూర్యుడు అని పిలుస్తున్నారు.

సూర్యుడి ప‌ర‌మాణు కేంద్రంలో అత్య‌ధిక శ‌క్తి ఉంటుంది. అందులోని అణువులు విచ్ఛిన్న‌మైన‌ప్పుడు భారీ శ‌క్తి ఉత్ప‌త్తి అవుతుంది.ఇది దాదాపు 15 మిలియ‌న్ డిగ్రీల సెల్సియ‌స్‌ ఉష్ణోగ్ర‌తగా ఉంటుంది. అచ్చం సూర్యుడిలాగే అణు సంలీన ప్ర‌క్రియ‌(ఫ్యూజ‌న్‌)లో భాగంగా హైడ్రోజ‌న్‌, డ్యూటీరియం వాయువుల‌ను ఇంధ‌నంగా ఉప‌యోగించి అణు క‌లయిక‌ను ప్రేరేపిస్తారు. దీని ద్వారా శక్తిని ఉత్ప‌త్తి చేస్తారు. తాజాగా చైనా శాస్త్ర‌వేత్త‌లు జ‌రిపిన ప‌రిశోధ‌న‌లో భాగంగా 70 మిలియ‌న్ డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌ను సృష్టించారు.

ఇది కూడా చదవండి : village’Built its own sun’: 3నెలలు సూర్యుడు ఉదయించని గ్రామం..వెలుగు కోసం ‘కొత్త సూర్యుడి’ సృష్టి

చైనా కృత్రిమ సూర్యుడి ప్ర‌యోగం ఎందుకోసం?
దీనికి కారణాలు చాలానే చెబుతోంది చైనా. ఫ్యూజ‌న్ రియాక్ట‌ర్ ద్వారా ఉత్ప‌త్తి చేసిన శ‌క్తిని చైనా విద్యుదుత్పత్తితో పాటు ఇత‌ర అవ‌స‌రాల‌కు ఉప‌యోగిస్తామ‌ని చెబుతోంది. కానీ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. చైనా పోకడలను బట్టి ఈ ప్రయోగం వెనుక ఏదో దురుద్దేశం కూడా ఉండొచ్చ‌నే అనుమానాలు, ఆరోప‌ణ‌లు వెల్లడవుతున్నాయి. ఈ శ‌క్తిని అణ్వాయుధాల‌కు ఉప‌యోగించుకునే అవ‌కాశం లేక‌పోలేద‌నే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే నిజమైతే..భార‌త్‌, అమెరికా లాంటి దేశాల‌కు ప్రమాదం ఉంటుందని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.