Russian Forces : చివరి దశకు యుక్రెయిన్ ఆక్రమణ.. కీవ్‌లో ప్రవేశించిన రష్యా బలగాలు

రష్యా ట్యాంకర్లు రాకుండా యుక్రెయిన్ బలగాలు ప్రతిఘటిస్తున్నాయి. రష్యా ట్యాంకర్లు కీవ్‌లోకి చేరకుండా నగర శివార్లలోని ఇవాంకివ్‌ వంతెనను యుక్రెయిన్ సైన్యం బాంబులతో పేల్చేసింది.

Russian Forces : చివరి దశకు యుక్రెయిన్ ఆక్రమణ.. కీవ్‌లో ప్రవేశించిన రష్యా బలగాలు

Kyiv

Occupation of Ukraine : యుక్రెయిన్‌ రాజధాని ఆక్రమణ దిశగా రష్యా వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే రష్యా బలగాలు కీవ్‌లో ప్రవేశించాయి. కీవ్‌పై వైమానిక దాడులకు రష్యా సిద్ధమైంది. కీవ్‌ గగనతలంలో రష్యా ఎయిర్‌క్రాఫ్ట్‌లు చక్కర్లు కొడుతున్నాయి. ఏ క్షణమైనా కీవ్‌ను సీజ్‌ చేసేందుకు రష్యా రెడీగా ఉంది. 96 గంటల్లో కీవ్‌ను రష్యా ఆక్రమించేసుకుంటుదని యుక్రెయిన్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అటు యుక్రెయిన్‌ ఆర్మీ పోరాడుతున్నా రష్యా సైన్యాన్ని ఆపలేకపోతోంది.

రష్యా ట్యాంకర్లు రాకుండా యుక్రెయిన్ బలగాలు ప్రతిఘటిస్తున్నాయి. రష్యా ట్యాంకర్లు కీవ్‌లోకి చేరకుండా నగర శివార్లలోని ఇవాంకివ్‌ వంతెనను యుక్రెయిన్ సైన్యం బాంబులతో పేల్చేసింది. మరోవైపు కీవ్‌లో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. ఇటు దాడుల నేపథ్యంలో ఎయిర్‌రెయిడ్‌ సైరన్లు నిరంతరాయంగా మారుతూనే ఉన్నాయి. అటు లీవ్‌ నగరంలోనూ ఇలాంటి పరిస్థితే ఇంది.

Joe Biden : ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్యపై జో బైడెన్​ కీలక వ్యాఖ్యలు

యుక్రెయిన్ పై రష్యా బలగాలు మెరుపు దాడులతో విరుచుకుపడుతున్నాయి. రష్యా..యుక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా 203 దాడులు చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రాన్ని రష్యా ఆధీనంలోకి తీసుకుంది. రేడియోధార్మిక వ్యర్ధాల నిల్వలపై రష్యా బాంబులు పడ్డాయని యుక్రెయిన్ తెలిపింది. రేడియోధార్మికత స్థాయి ఒక్కసారిగా పేరిగిందని వెల్లడించింది. గతంలో దుర్ఘటన తరువాత ఉక్రెయిన్ అణుకర్మాగారం మూసివేసింది.

ఓవైపు రష్యా దళాలు ముందుకు దూసుకొస్తున్నాయి. మరోవైపు తమ సైనికులు వెనకడుగు వేస్తున్నారు. రాజధాని కీవ్‌లోనూ రష్యా సైన్యం ప్రవేశించింది. ఎయిర్‌పోర్ట్‌ చేయిజారిపోయింది. ఈ దశలో నాటో దేశాలు ఏదో రూపంలో సాయం చేస్తాయని భావిస్తే ఎవరూ ఇప్పుడు స్పందించడం లేదు. మేమున్నాం నీకెందుకంటూ యుక్రెయిన్‌ను ముందుకు తోసిన దేశాలు ఇప్పుడు జారుకున్నాయి. రష్యా చేసింది తప్పంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి తప్ప ఒక్క దేశం కూడా సైనిక సాయానికి ముందుకు రావడం లేదు.

Ukraine : ప్రపంచం మమ్మల్ని ఒంటరి చేసింది, నమ్మించి నట్టేట ముంచారు.. యుక్రెయిన్ ఆవేదన

రష్యా నుంచి వచ్చే గ్యాస్‌పై చాలావరకూ ఆధారపడ్డ యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్‌పై దాడిని ఖండిస్తున్నాయి తప్ప… సైనిక చర్యలకు ముందుకు రావడం లేదు. ఎక్కడ రష్యాపై దాడికి దిగితే తాము ఇబ్బంది పడాల్సి వస్తుందో అని ఆందోళన పడుతున్నాయి. దీంతో వీరందరినీ నమ్మి యుద్ధానికి దిగిన యుక్రెయిన్‌ ఇప్పుడు తలపట్టుకుంటోంది. ఏ క్షణమైనా రష్యా సేనలు యుక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ను బంధీగా పట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

యుక్రెయిన్‌కు ప్రపంచదేశాల వెన్నుపోటు పొడిచాయి. నమ్మించి నట్టేట ముంచారని యుక్రెయిన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రపంచం తమను ఒంటరిని చేసిందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిని ఏ సాయం అడిగినా ఎవరూ స్పందించడం లేదని ఆయన వాపోతున్నారు. చివరకు ప్రజలే రష్యాను ఎదుర్కోవాలని పిలుపు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.

UK Ristrictions : రష్యాపై యూకే కఠిన ఆంక్షలు

అమెరికా సహా నాటో దేశాలను నమ్మి రష్యాను ఎదిరించిన యుక్రెయిన్‌.. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. సాయం చేస్తామని చెప్పి చివర్లో అమెరికా సహా నాటో దళాలు చేతులెత్తేయడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. మందుగుండు అడిగితే మంచినీళ్లు, బిస్కట్లు పంపిస్తున్న దేశాలతో యుక్రెయిన్‌ షాక్‌లోకి జారుకుంది. సైనిక సాయం అడిగితే ప్రపంచ దేశాలు కుంటిసాకులు చెబుతున్నాయి. రష్యాను కట్టడి చేయాల్సింది పోయి ఆంక్షలతో సరిపెట్టాయి.