Ukraine : ప్రపంచం మమ్మల్ని ఒంటరి చేసింది, నమ్మించి నట్టేట ముంచారు.. యుక్రెయిన్ ఆవేదన

అమెరికా సహా నాటో దేశాలను నమ్మి రష్యాను ఎదిరించిన యుక్రెయిన్‌.. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. సాయం చేస్తామని చెప్పి చివర్లో అమెరికా సహా నాటో దళాలు చేతులెత్తేశాయి.

Ukraine : ప్రపంచం మమ్మల్ని ఒంటరి చేసింది, నమ్మించి నట్టేట ముంచారు.. యుక్రెయిన్ ఆవేదన

Ukraine President

ukraine president volodymyr zelensky : యుక్రెయిన్‌కు ప్రపంచదేశాల వెన్నుపోటు పొడిచాయి. నమ్మించి నట్టేట ముంచారని యుక్రెయిన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రపంచం తమను ఒంటరిని చేసిందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిని ఏ సాయం అడిగినా ఎవరూ స్పందించడం లేదని ఆయన వాపోతున్నారు. చివరకు ప్రజలే రష్యాను ఎదుర్కోవాలని పిలుపు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.

అమెరికా సహా నాటో దేశాలను నమ్మి రష్యాను ఎదిరించిన యుక్రెయిన్‌.. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. సాయం చేస్తామని చెప్పి చివర్లో అమెరికా సహా నాటో దళాలు చేతులెత్తేయడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. మందుగుండు అడిగితే మంచినీళ్లు, బిస్కట్లు పంపిస్తున్న దేశాలతో యుక్రెయిన్‌ షాక్‌లోకి జారుకుంది. సైనిక సాయం అడిగితే ప్రపంచ దేశాలు కుంటిసాకులు చెబుతున్నాయి. రష్యాను కట్టడి చేయాల్సింది పోయి ఆంక్షలతో సరిపెట్టాయి.

UK Ristrictions : రష్యాపై యూకే కఠిన ఆంక్షలు

ఓవైపు రష్యా దళాలు ముందుకు దూసుకొస్తున్నాయి. మరోవైపు తమ సైనికులు వెనకడుగు వేస్తున్నారు. రాజధాని కీవ్‌లోనూ రష్యా సైన్యం ప్రవేశించింది. ఎయిర్‌పోర్ట్‌ చేయిజారిపోయింది. ఈ దశలో నాటో దేశాలు ఏదో రూపంలో సాయం చేస్తాయని భావిస్తే ఎవరూ ఇప్పుడు స్పందించడం లేదు. మేమున్నాం నీకెందుకంటూ యుక్రెయిన్‌ను ముందుకు తోసిన దేశాలు ఇప్పుడు జారుకున్నాయి. రష్యా చేసింది తప్పంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి తప్ప ఒక్క దేశం కూడా సైనిక సాయానికి ముందుకు రావడం లేదు.

రష్యా నుంచి వచ్చే గ్యాస్‌పై చాలావరకూ ఆధారపడ్డ యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్‌పై దాడిని ఖండిస్తున్నాయి తప్ప… సైనిక చర్యలకు ముందుకు రావడం లేదు. ఎక్కడ రష్యాపై దాడికి దిగితే తాము ఇబ్బంది పడాల్సి వస్తుందో అని ఆందోళన పడుతున్నాయి. దీంతో వీరందరినీ నమ్మి యుద్ధానికి దిగిన యుక్రెయిన్‌ ఇప్పుడు తలపట్టుకుంటోంది. ఏ క్షణమైనా రష్యా సేనలు యుక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ను బంధీగా పట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.