UK Ristrictions : రష్యాపై యూకే కఠిన ఆంక్షలు

ఇటీవల ఐదు రష్యన్ బ్యాంకులపై యూకే నిషేధించింది. ముగ్గురు రష్యా అపర కుబేరుల అకౌంట్లు ఫ్రీజ్ చేశారు.

UK Ristrictions : రష్యాపై యూకే కఠిన ఆంక్షలు

Uk (1)

UK Ristrictions on Russia : రష్యాపై యూకే ఆంక్షలు విధించింది. రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేలా కఠిన ఆంక్షలు విధించింది. రష్యన్ ప్రభుత్వ బ్యాంక్ వీటీబీ ఆస్తులను ఫ్రీజ్ చేసింది. యూకే ఆర్థిక వ్యవస్థ నుంచి రష్యన్ బ్యాంకులను తొలగించారు. నిధుల సమీకరణ చేయకుండా రష్యా ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలపై నిషేధించారు. ఇటీవల ఐదు రష్యన్ బ్యాంకులపై యూకే నిషేధించింది. ముగ్గురు రష్యా అపర కుబేరుల అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. స‌రిహ‌ద్దు దాటి యుక్రెయిన్‌లోకి ప్రవేశించిన ర‌ష్యా బ‌ల‌గాలు దాడులతో విరుచుకుపడుతున్నాయి. సైనిక, వైమానిక, ఓడరేవులు, కీలక, వ్యూహాత్మక ప్రాంతాలే లక్ష్యంగా రష్యన్‌ సేనలు భీకర దాడులు చేస్తున్నాయి.

ఇప్పటివరకు యుక్రెయిన్‌కు చెందిన 83 సైనిక స్థావరాలను.. 11 ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. ఓ సైనిక హెలికాప్టర్‌తో పాటు నాలుగు డ్రోన్లను కూడా కూల్చివేసినట్లు తెలిపింది. తూర్పు యుక్రెయిన్‌లోని నగరాల్లో బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా… పశ్చిమ యుక్రెయిన్‌లోని నగరాలపై వైమానిక దాడులతో నిప్పుల వాన కురిపిస్తోంది. కీవ్‌లోని యుక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయంపైనా క్రెమ్లిన్‌ దళాలు దాడిచేశాయి. దీంతో ఎయిర్‌ రెయిడ్‌ సైరన్ల శబ్దాలతో ప్రధాన నగరాలు మార్మోగిపోతున్నాయి.

Russia Invasion : యుక్రెయిన్‌లో ర‌ష్యా ర‌క్తపాతం

ఓవైపు రష్యా దాడులు, మరోవైపు వాటిని ఎదుర్కొనేందుకు యుక్రెయిన్‌ ప్రయత్నాలతో.. ఇరువైపులా ప్రాణనష్టం సంభవించింది. మొత్తంగా ఇప్పటివరకు వంద మందికిపైగానే మృతిచెందినట్లు తెలుస్తోంది. 40 మందికిపైగా తమ సైనికులు 10 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్‌ పేర్కొంది. ఒడెస్సాలోనే 18 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 50మంది రష్యా ఆక్రమణదారులను చంపినట్లు యుక్రెయిన్‌ ప్రకటించుకుంది. 7 రష్యా విమానాలు, ఓ హెలికాఫ్టర్‌ను కూల్చేసినట్లు వెల్లడించింది. అయితే… తమ యుక్రెయిన్ ప్రకటనను రష్యా తోసిపుచ్చింది. తమ వారెవరూ చనిపోలేదని… ముగ్గురికి మాత్రం గాయాలయ్యాయని ప్రకటించింది.

రష్యాపై అమెరికా మరోసారి సీరియస్ అయింది. ఇకపై పుతిన్‌తో మాట్లాడేది లేదంటూ.. రష్యాపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అదనపు ఆంక్షలు విధించారు. 250 బిలియన్ డాలర్ల గల రష్యన్ ప్రభుత్వ బ్యాంక్ వీటీబీ ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రష్యాతో యుద్ధానికి తమ బలగాలు పంపడం లేదన్న బైడెన్‌… టెక్నాలజీ పరంగా రష్యాను దెబ్బతీస్తామన్నారు. రష్యా ఎయిరోస్పేస్ ఇండస్ట్రీతో పాటు స్పేస్ ప్రోగ్రాంను నిర్వీర్యం చేస్తామన్నారు. ఇవాళ 30 దేశాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి తదుపరి ఆంక్షలపై చర్చిస్తామని బైడెన్ అన్నారు.