Popcorn clouds : ‘పాప్ కార్న్’ మేఘాలు… ఎప్పుడైనా చూశారా? వినువీధిలో వింత

వినువీధిలో వింత చోటు చేసుకుంది. మేఘాలు పాప్ కార్న్ ఆకారంలో కనువిందు చేశాయి. అప్పుడే వేపిన పేలాలు ఎలా పొంగుతాయో ఆ రీతిలో కనిపించిన మేఘాలను..

Popcorn clouds : ‘పాప్ కార్న్’ మేఘాలు… ఎప్పుడైనా చూశారా? వినువీధిలో వింత

Popcorn Clouds

Popcorn clouds : నీరు ఎండవేడికి ఆవిరై మేఘాలుగా మారతాయని తెలిసిందే. మబ్బులకు నిర్దిష్టంగా ఓ రూపం అంటూ ఉండదు. అవి గాలి వీచే దిశలో పలు రకాలుగా ఆకారాలు దాల్చుతూ ప్రయాణిస్తుంటాయి. అయితే, కొన్ని సందర్భాల్లో మేఘాల ఆకృతులు విస్మయానికి గురి చేస్తాయి. తాజాగా అర్జెంటీనాలో వినువీధిలో వింత చోటు చేసుకుంది. మేఘాలు పాప్ కార్న్ ఆకారంలో కనువిందు చేశాయి. అప్పుడే వేపిన పేలాలు ఎలా పొంగుతాయో ఆ రీతిలో కనిపించిన మేఘాలను చూసి అర్జెంటీనా ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు.

Chrome Password Checker : మీ పాస్‌వ‌ర్డ్ హ్యాక‌ర్ల చేతుల్లో.. అయితే డౌటే.. ఇలా చెక్ చేసుకోండి!

అర్జెంటీనాలోని కార్డోబా ప్రాంతంలో కాసే గ్రాండే దగ్గర ఈ పాప్ కార్న్ మేఘాలను నవంబరు 13న గుర్తించారు. దీన్ని అక్కడి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే, అది వైరల్ గా మారింది. కాగా ఈ రకం మబ్బులను శాస్త్రీయ పరిభాషలో మమ్మాటస్ క్లౌడ్స్ అని పిలుస్తారు. ఈ మబ్బులను చూసి కొందరు ఆందోళనకు గురయ్యారట. ఆ సమయంలో ఈదురుగాలులు కూడా వీస్తుండడంతో ఇదేమైనా ప్రకృతి వైపరీత్యమేమో అని భయపడ్డారట.

Dinner : సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం ఎందుకంటే?

ఇక దీనికి సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఇది వాతావరణ మార్పుగా భావించగా, మరికొందరు ఇవి భూమికి సంబంధించిన మేఘాలు కావని, ఏలియన్ల పనే అని సందేహించారు.