Chrome Password Checker : మీ పాస్‌వ‌ర్డ్ హ్యాక‌ర్ల చేతుల్లో.. అయితే డౌటే.. ఇలా చెక్ చేసుకోండి!

మీ పాస్‌వర్డ్ హ్యాకర్లు హ్యాక్ చేశారనుకుంట.. మీకు తెలియకుండా హ్యాకర్లు మీ పాస్ వర్డ్ వినియోగిస్తున్నారేమో.. ఎప్పుడైనా చెక్ చేశారా? అయితే ఇప్పుడే చెక్ చేసుకోండి..

Chrome Password Checker : మీ పాస్‌వ‌ర్డ్ హ్యాక‌ర్ల చేతుల్లో.. అయితే డౌటే.. ఇలా చెక్ చేసుకోండి!

How To Secure Your Password From Hackers, Find Out Via Google Chrome Password Checker (1)

Chrome Password Checker : మీ పాస్‌వర్డ్ హ్యాకర్లు హ్యాక్ చేశారనుకుంట.. మీకు తెలియకుండా హ్యాకర్లు మీ పాస్ వర్డ్ వినియోగిస్తున్నారేమో.. ఎప్పుడైనా చెక్ చేశారా? అయితే ఇప్పుడే చెక్ చేసుకోండి.. మీ పాస్ వర్డ్ ఎంత భద్రమో.. ఎంత స్ట్రాంగ్ పాస్ వర్డ్ పెట్టారో ఇట్టే తెలుసుకోవచ్చు. సాధారణంగా బ్యాంకు అకౌంట్ల‌తో పాటు ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ సోష‌ల్ మీడియా అకౌంట్లకు ఒకే పాస్ వర్డ్ పెడుతుంటారు. ఒక్కోదానికి ఒక్కో పాస్‌వ‌ర్డ్‌లు గుర్తుపెట్టుకోవడం కష్టమని చాలామంది సేమ్ పాస్‌వ‌ర్డ్‌ల‌ను అన్ని అకౌంట్లకు వాడేస్తుంటారు. ఇలా ఈజీ పాస్‌వ‌ర్డ్‌లను పెడుతూ పోతుంటే మీ అకౌంట్ భద్రత ఉండదు. ఇంతకీ మీ అకౌంట్లు ఎవ‌రైనా సైబ‌ర్ నేర‌గాళ్లకు చిక్కాయా అనే అనుమానం వచ్చిందా? మీ పాస్‌వ‌ర్డ్ హ్యాక‌ర్లకు చిక్కిందో లేదో ఇప్పుడే తెలుసుకోండి. మీరు చేయాల్సిందిల్లా.. గూగుల్ క్రోమ్‌ (Google chrome) ఇన్ స్టాల్ చేసుకోవడమే.. ప్రతిఒక్కరి కంప్యూటర్‌, మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ కామన్.. అందులో ఒక ఫీచ‌ర్ ఉంది. దాని ద్వారా మీ పాస్‌వ‌ర్డ్ ఎంత స్ట్రాంగ్‌గా అనేది చెప్పేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. అది ఎలానో ఇప్పుడు చూద్దాం..

గూగుల్ క్రోమ్‌ ఫీచ‌ర్ ఇదే :
మీ పాస్‌వ‌ర్డ్ హ్యాక్ అయిందని తెలియాలంటే గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్‌లో ముందుగా ఈ ఫీచర్ గురించి తెలుసుకోవాల్సిందే. డెస్క్‌టాప్ బ్రౌజ‌ర్‌, మొబైల్ బ్రౌజ‌ర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఈ ఫీచ‌ర్ ఎలా పనిచేస్తుందో తెలియాలంటే.. గూగుల్ క్రోమ్‌లో మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వండి. ఫేస్‌బుక్‌, ట్విట‌ర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోష‌ల్ మీడియా అకౌంట్ల‌ు మాత్రమే కాదు.. బ్యాంకు అకౌంట్లు అన్నీ మీ గూగుల్ అకౌంట్‌తో లింక్ అయి ఉండాలి. అలాగే మీ పాస్‌వ‌ర్డ్‌లను గూగుల్ అకౌంట్లో సేవ్ (Save) చేసి ఉండాలి.

మీ పాస్‌వర్డ్ స్ట్రాంగేనా? చెక్ చేయండిలా.. :
– క్రోమ్ బ్రౌజ‌ర్‌ ఓపెన్ చేయండి.. సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
– సెట్టింగ్స్ పేజిలో లెఫ్ట్ సైడ్ కనిపించే ఆప్ష‌న్ల‌లో ఆటో ఫిల్‌ (Autofill)ను ఎంచుకోండి.
– పాస్‌వ‌ర్డ్ ఆప్ష‌న్‌లోని చెక్ పాస్‌వ‌ర్డ్ బ‌ట‌న్‌ (Check Password)పై క్లిక్ చేయాలి.
– మీ అకౌంట్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ల‌ను గూగుల్ క్రోమ్ స‌ర్వ‌ర్‌కు పంపుతుంది.
– పాస్‌వ‌ర్డ్ వీక్ అయితే వెంటనే మార్చుకోమ‌ని చెబుతుంది.
– మీరు ఎప్పుడైనా కొత్త IP Address సిస్టమ్ నుంచి లాగిన్ అయితే వెంటనే క్రోమ్ బ్రౌజ‌ర్‌ అలర్ట్ చేస్తుంది.

హ్యాకర్ల బారినపడకుండా ఏం చేయాలంటే? :
– మీ పాస్‌వ‌ర్డ్‌లను చాలా కాన్ఫిడెన్షియల్‌గా ఉంచుకోవాలి. ఎవరికి షేర్ చేయకూడదు.
– త‌ర‌చూ పాస్‌వ‌ర్డ్‌ల‌ను మారుస్తుండటం చేయాలి.
– గతంలో వాడిన పాస్‌వ‌ర్డ్‌ను మళ్లీ అదే పెట్టుకోవద్దు.
– ఎవరైనా ఈజీగా గెస్ చేసేలా నంబ‌ర్లు, పేర్ల‌ను అసలే పెట్టుకోవద్దు.
– అన్ని అకౌంట్ల‌కు ఒకే పాస్‌వ‌ర్డ్ వద్దు.. వేర్వేరుగా పెట్టుకోవాలి.
– పాస్‌వ‌ర్డ్‌ల‌ు ఎప్పుడూ లెటర్స్, సింబ‌ల్స్‌, నెంబర్లు, స్పెషల్ క్యారెక్టర్లతో పెట్టుకోవాలి.

Read Also : Whatsapp Beta : వాట్సాప్ వెబ్‌లో ప్రైవసీ సెట్టింగ్స్.. ఆండ్రాయిడ్‌లో Media Shortcut బగ్ ఫిక్స్!